Showing posts with label HAPPY JANMASHTAMI. Show all posts
Showing posts with label HAPPY JANMASHTAMI. Show all posts

Monday, September 3, 2018

HAPPY JANMASHTAMI

HAPPY JANMASHTAMI

sri krishna


 శ్రీ కృష్ణాయను నామమంత్ర రుచి
సిద్ధించుట నా కెన్నటికో
శ్రీ గురు పాదాబ్జంబులు మదిలో
స్థిరముగ నిలిచే దెన్నటికో
lశ్రీ కృష్ణాయనుl

మరవక మాధవు మహిమలు పొగడే
మర్మము తెలిసే దెన్నటికో
హరిహరి హరియని హరినామామృత
పానము జేసే దెన్నటికో
lశ్రీ కృష్ణాయనుl

కమలాక్షుని నా కన్నులు చల్లగ
కనిసేవించే దెన్నటికో
లక్షణముగ శ్రీ లక్ష్మీరమణుని
దాసుడనయ్యే దెన్నటికో
lశ్రీ కృష్ణాయనుl

పంచాక్షరీ మంత్రము మదిలో 
పఠియించే దెన్నటికో
ఆదిమూర్తి శ్రీ అమర నరేయణ
భక్తుడ నయ్యే దెన్నటికో
lశ్రీ కృష్ణాయనుl

ROYAL KINGDOM GREEN HILLS

ROYAL KINGDOM GREEN HILLS Premium Frams, Tadkal, Sangareddy  Pin 8977111729

STARS

gtag('config', 'UA-93893754-1');