Friday, November 30, 2018

కార్తీకపురాణం 23వ అధ్యాయం

కార్తీకపురాణం 23వ అధ్యాయం

శ్రీ రంగ క్షేత్రంలో పురంజయుడు ముక్తిపొందుట

అగస్త్యుడు తిరిగి అత్రి మహామునితో ఇలా చెబుతున్నాడు… ”ఓ ముని పుంగవా! విజయలక్ష్మి వరించాక పురంజయుడు ఏం చేశాడో వివరిస్తారా?” అని కోరాడు. దీనికి అత్రి మహర్షి ఇలా చెబుతున్నాడు. ”కుంభ సంభవా! పురంజయుడు కార్తీక వ్రతమాచరించడం వల్ల అసమాన బలోపేతుడై అగ్నిశేషం, శత్రు శేషం ఉండకూడదని తెలిసి… తన శత్రురాజులందరినీ ఓడించాడు. నిరాటంకంగా తన రాజ్యాన్ని ఏలాడు. తన విష్ణు భక్తి ప్రభావం వల్ల గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్ష తత్పరుడు, నిత్యాన్నదాన, భక్తి ప్రియవాది, తేజోమంతుడు, వేదవేదాంగవేత్తగా విరాజిల్లాడు. శత్రురాజ్యాలను జయించి, తన కీర్తిని దశదిశలా చాటాడు. శత్రువులు సింహస్వప్నమై… విష్ణు సేవాధురంధురుడై, కార్తీకవ్రత ప్రభావంతో కోటికి పడగలెత్తి, అరిషడ్వర్గాలను జయించాడు. అయినా… అతనిలో తృప్తి లోపించింది. ఏ దేశాన్ని, ఏ కాలంలో, ఏ క్షేత్రాన్ని ఏవిధంగా దర్శించాలి? శ్రీహరిని ఎలా పూజించి కృతార్థుడనవ్వాలి? అని విచారిస్తూ గడిపేవాడు. అలా శ్రీ హరిని నిత్యం స్మరిస్తున్న అతనికి ఓ రోజు అశరీర వాణి పలకరించింది” అని అత్రి మహర్షి ఇలా చెబుతున్నాడు…
పురంజయుడితో అశరీరవాణి ఇలా అంటోంది… ”ఓ పురంజయా! కావేరీనదీ తీరంలో శ్రీ రంగ క్షేత్రముంది. దాన్ని రెండో వైకుంఠమని పిలుస్తారు. నీవు అక్కడకు వెళ్లి, శ్రీ రంగనాథ స్వామిని అర్చించు. నీవు ఈ సంసార సాగరం దాటి మోక్షప్రాప్తిని పొందగలవు” అని పలికింది. అంతట పురంజయుడు తన రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి, సపరివార సమేతంగా బయలుదేరి, మార్గంలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ… ఆయా దేవతలను సేవిస్తూ, పుణ్యనదుల్లో స్నానం ఆచరిస్తూ… శ్రీ రంగానికి చేరుకున్నాడు. అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహిస్తుండగా… శ్రీరంగనాథ స్వామి మధ్యలో కొలువయ్యారు. శేషశయ్యపై పవళిస్తున్న ఆయనను గాంచిన పురంజయుడు పరవశంతో చేతులు జోడించి… ”దామోదరా… గోవిందా… గోపాలా… హరే కృష్ణా… హే వాసుదేవా! దాసోహం… దాసోహం…” అని స్తోత్రం చేశాడు. కార్తీకమాసమంతా శ్రీ రంగంలోనే గడిపాడు. ఆ తర్వాత వారు అయోధ్యకు బయలుదేరారు. పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షంలో కార్తీకమాసం చేయడం… వ్రత మహిమలతో అతని రాజ్యంలోని ప్రజలంతా సుఖశాంతులతో విరాజిల్లారు. పాడిపంటలు, ధనధాన్యాలు, ఆయురారోగ్యాలకు లోటు లేకుండా పోయింది. అయోధ్యానగరం దృఢతర ప్రాకారాలు కలిగి, తోరణ యంత్ర ద్వారాలతో మనోహర గృహగోపురాలు, పురాదులతో, చతురంగ సైన్య సంయుతంగా ప్రకాశించుచుండె. అయోధ్యానగరంలోని వీరులు యుద్ధనేర్పరులై… రాజనీతి కలవారై, వైరి గర్భ నిర్భదకులై, నిరంతరం విజయశీలురై, అప్రమత్తులై ఉండిరి. ఆ నగరంలోని మహిళు, యువతులు హంసగజామ ఇనులూ, పద్మపత్రాయతలోచనలు, రూపవుతులు, శీలవతులని, గుణవతులని ఖ్యాతి గడించారు.
శ్రీ రంగంలో కార్తీకవ్రతమాచరించి, ఇంటికి క్షేమంగా చేరిన పురంజయుడిని ఆ పుర ప్రజలు మంగళ వాద్యాలతో ఆహ్వానించారు. అలా కొంతకాలం ఐహికవాంఛలను అనుభవించిన పురంజయుడు ఆ తర్వాత వాటిని వదులుకుని, తన కుమారుడికి రాజ్యభారం అప్పగించి, వానప్రస్థాశ్రమం గడిపాడు. జీవితాంతం కార్తీక వ్రతాన్ని క్రమం తప్పకుండా ఆచరిస్తూ… అంత్యకాలంలో వైకుంఠానికి చేరుకున్నాడు. ”కాబట్టి ఓ అగస్త్యా! కార్తీక వ్రతం అత్యంత ఫలప్రదమైంది. దాన్ని ప్రతిఒక్కరూ ఆచరించాలి. ఈ కథ చదివినవారికి, విన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది” అని అత్రి మహర్షి వివరించారు.

ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య: త్రయోవింశోధ్యాయ సమాప్త
23వ రోజు పారాయణం సమాప్తం

Thursday, November 29, 2018

కార్తీక పురాణం - 22 వ అధ్యాయం

కార్తీక పురాణం - 22 వ అధ్యాయం

పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతమాచరించుట

అత్రి మహాముని తిరిగి అగస్త్యుడికి ఇలా చెబుతున్నాడు. పురంజయుడు వశిష్టులు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు శుచియై దేవాలయానికి వెళ్లి, శ్రీ మన్నారాయణుడిని షోడశోపచారాలతో పూజించాడు. శ్రీహరిని గానం చేశాడు. సాష్టాంగ నమస్కారం చేసి, సూర్యోదయమైన వెంటనే నదికి పోయి, తిరిగి స్నానమాచరించి తన ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో విష్ణుభక్తుడైన ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసి మాలలు ధరించి, పురంజయుడి వద్దకు వచ్చి…”ఓ రాజా! విచారించకు…నువ్వు వెంటనే చెల్లా చెదురై ఉన్న నీ సైన్యాన్ని తీసుకుని, యుద్ధ సన్నద్ధుడివై శత్రురాజులతో పోరాడు” అని చెప్పి పంపాడు. దెబ్బతిని క్రోదంతో ఉన్న పురంజయుడి సైన్యం రెట్టింపు బలాన్ని ప్రయోగిస్తూ పోరాడసాగింది. పురంజయుడు, అతని సైన్యం ధాటికి శత్రురాజులు నిలవలేకపోయారు. అంతేకాకుండా… శ్రీ మన్నారాయణుడు పురంజుడి విజయానికి అన్నివిధాలా సహాయపడ్డాడు. ఓటమిపాలైన కాంభోజాది భూపాలరు ”పురంజయా… రక్షింపుము… రక్షింపుము” అని కేకలు వేస్తూ కాలికి బుద్ధి చెప్పారు. పురంజయుడు విజయలక్ష్మితో కలిసి తిరిగి తన రాజ్యానికి వెళ్లాడు.
శ్రీ హరిని నమ్మినవారికి ఓటమి ఉండదనే విషయాన్ని పురంజయుడి వృత్తాంతం నిరూపించింది. అంతకు ముందు కూడా శ్రీహరి అని ప్రార్థించినంతనే ప్రహ్లాదుడికి అతని తండ్రి హిరణ్యకశిపుడు ఇచ్చిన విషం అమృతతుల్యమైంది. ఎన్నో సందార్భల్లో అధర్మం ధర్మంగా మారింది. దైవానుగ్రహం లేనప్పుడు ధర్మమే అధర్మమవుతుంది. తాడు కూడా పాములా కరుస్తుంది. కార్తీక మాసమంతా నదీస్నానమొనర్చి, దేవాలయంలో జ్యోతిలను వెలిగించి దీపారాధన చేసినట్లయితే…సర్వ విపత్తులు తొలగిపోతాయి. అన్ని సౌక్యాలు సమకూరుతాయని అగస్త్యుల వారికి అత్రి మహర్షి వివరించారు.

ఇతి స్కాంధపురాణాంతర్గతేన వశిష్ట ప్రోక్త:
కార్తీక మహత్య: 22 అధ్యాయ: సమాప్త:
22వ రోజు పారాయణం సమాప్తం

Wednesday, November 28, 2018

కార్తీక పురాణం 21 వ అధ్యాయం

కార్తీక పురాణం 21 వ అధ్యాయం

పురంజయుడు కార్తీక ప్రభావం

అలా యుద్ధానికి సిద్ధమైన పురంజయుడికి, కాంభోజాది భూపాలురకు భీకరయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రథికులు రథికుడితో, అశ్వసైనికుడు అశ్వసైనికుడితో, గజ సైనికుడు గజ సైనికుడితో, పదాతులు పదాతి దళాలతో, మల్లులు మల్లయుద్ధనిపుణులతో, ఖడ్గ, గద, బాణ, పరశు మొదలు ఆయుధాలు ధరించినవారు అవే ఆయుధాలు ధరించినవారితో ధర్మబద్ధమైన యుద్ధం చేస్తున్నారు. ఒకరినొకరు ఢీకొంటూ.. హూంకరించుకుంటూ.. దిక్కులు దద్దరిల్లేలా సింహనాదాలు చేశారు. శూరత్వం, వీరత్వం ప్రదర్శించేందుకు భేరీ దుందుబులను వాయిస్తూ, శంఖాలను పూరిస్తూ, విజయకాంక్షతో పోరాడారు. ఆ ఆరణ భూమి అంతా ఎక్కడ చూసినా… విరిగిన రథాల గుట్టలు, తెగిపడిన మొండాలు, ఏనుగుల తొండాలు, సైనికుల తలలు, చేతులతో నిండిపోయింది. యుద్ధభూమిలో హాహాకారాలు, ఆక్రందనలు మిన్నంటాయి. పర్వాతాల్లా పడి ఉన్న ఏనుగులు, గుర్రాల కళేబరాల దృశ్యాలతో అతి గంభీరంగా, భయంకరంగా రణస్థలి కనిపించింది. యుద్ధవీరుల్ని వీరస్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పకవిమానంపై వచ్చిన దేవదూతలు అక్కడకు చేరుకున్నారు. సూర్యాస్తమయం వరకు యుద్ధం కొనసాగింది. కాంబోజాది భూపాలురకు చెందిన సైన్యం భారీగా నష్టపోయింది. అయినా.. మూడు అక్షౌహిణులున్న పురంజయుడి సైన్యాన్ని అతి నేర్పుతో ఓడించారు. పెద్ద సైన్యమున్నా… పురంజయుడికి అపజయం కలిగింది. దాంతో పురంజయుడు రహస్య మార్గంలో శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాడు. బలోపేలైన శత్రురాజులు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో, సిగ్గుతో దు:ఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ట మహర్షి వచ్చి, పురంజయుడిని ఊరడించారు. ”రాజా! ఇంతకు ముందు ఒకసారి నీవద్దకు వచ్చాను. నువ్వు ధర్మాన్ని తప్పావు. నీ దురాచారాలకు అంతులేదు. నిన్ను సన్మార్గంలో వెళ్లమని హెచ్చరించాను. అప్పుడు నా మాటల్ని వినలేదు. నీవు భగవంతుడిని సేవింపక అధర్మప్రవర్తుడవైనందునే… ఈ యుద్ధంలో ఓడిపోయి, రాజ్యాన్ని శత్రువులకు అప్పగించావు. ఇప్పటికైనా నామాటలు విను. జయాపజయాలు దైవాదీనాలు. నీవు చింతతో కృంగిపోవడం మాని, శత్రురాజులను యుద్ధంలో జయించి, నీ రాజ్యం నీవు తిరిగి పొందాలని సంకల్పించు. ఇది కార్తీకమాసం. రేపు కృత్తికా నక్షత్ర యుక్తంగా పౌర్ణమి ఉంది. కాబట్టి స్నాన, జపాది నిత్యకర్మలు ఆచరించి, గుడికి వెళ్లి, దేవుడి సన్నిధిలో దీపారాధన చేయి. భగవన్నామ స్మరణంతో నాట్యం చేయి. ఇంట్లో అర్చించినట్లయితే నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు… శ్రీ మన్నారాయణుడిని సేవించడం వల్ల విష్ణుమూర్తి ప్రసన్నుడై… నీ శత్రువులను దునిమాడేందుకు చక్రాయుధాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి… రేపు అలా చేసినట్లయితే…పోయిన నీ రాజ్యం తిరిగి పొందగలుగుతావు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసాలు చేయడం వల్లే ఈ అపజయం కలిగింది. శ్రీహరిని మదిలో తలచి, నేను చెప్పినట్లు చేయి…” అని ఉపదేశించాడు.
శ్లో// అపవిత్ర: పవిత్రో పవిత్రోవా సర్వావస్థాంగతోపివా
య్ణ స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యా భంతర శుచి||

ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యే, ఏకవింశోద్యాయ సమాప్త్ణ
ఇరవయొక్కటో రోజు పారాయణం సమాప్తం.

Tuesday, November 27, 2018

కార్తీక పురాణం - 20 వ అధ్యాయం

కార్తీక పురాణం - 20 వ అధ్యాయం

పురంజయుడు దురాచారుడగుట

చాతుర్మాస్య వ్రత ప్రభావాన్ని తెలుసుకున్నాక జనక మహారాజు వశిష్ఠుడితో తిరిగి ఇలా అడుగుతున్నాడు… ”ఓ గురువర్యా! కార్తీకమాస మహత్యాన్ని ఇంకనూ వినాలనిపిస్తోంది. ఈ వ్రత మహత్యానికి సంబంధించి ఇంకా ఇతిహాసాలు, ఇతివృత్తాలు, విశేషాలున్నాయా? అనే విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతోంది” అని కోరాడు. దానికి వశిష్టులవారు మందహాసంతో ”ఓ రాజా! కార్తీక మాస మహత్యాన్ని గురించి అగస్త్య మహాముని అత్రి మునికి చెప్పిన విషయం వివరిస్తాను” అని ఇలా చెప్పసాగారు. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహాముని అత్రి మహర్షిని చూసి… ”ఓ అత్రి మునీ! నీవు విష్ణువు అంశలో పుట్టావు. కాబట్టి నీకు కార్తీక మహత్యం ఆమూలాగ్రంగా (ఆది నుంచి అంతం వరకు) తెలుసి ఉంటుంది. కాబట్టి దాన్ని నాకు వివరించు” అని కోరాడు. దానికి అత్రి మహాముని ”ఓ కుంభసంభవా! కార్తీక మాసానికి సమాన మాసం లేదు. వేదాల్లో సమానమైన శాస్త్రం, ఆరోగ్య సంపదకు సాటిలేని సంపద లేదు. అలాగే శ్రీమన్నారాయణుడికంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనా…కార్తీకంలో నదీస్నానం చేసినా.. శివకేశవాలయాల్లో దీపారాధన చేసినా, దీపదానం చేసినా… దాని ఫలితం చెప్పనలవి కాదు. ఇందుకు ఒక ఇతిహాసముంది. చెబుతాను విను… త్రేతాయుగంలో పురంజయుడనే సూర్యవంశపురాజు అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండేవాడు. అతడు సమస్త శాస్త్రాలను అభ్యసించాడు. న్యాయబద్ధంగా రాజ్యపాలన చేసేవాడు. ప్రజలకు ఎలాంటి ఆపదలు రాకుండా పాలించేవాడు. అయితే కొంతకాలానికి పురంజయుడిలో మార్పువ చ్చింది. అమిత ధనాశతో, రాజ్యాధికార గర్వంతో జ్ఞానహీనుడై… దుష్టబుద్ధి కలవాడై.. దయాదాక్షిణ్యాలు లేక… లేవ బ్రాహ్మణ మాన్యాలను లాక్కొనడం ఆరంభించాడు. పరమలోభిగా మారాడు. దొంగలను చేరదీసి, వాళ్లతో దొంగతనాలు, దోపిడీలు చేయించాడు. వారు కొల్లగొట్టుకొచ్చిన ధనంలో సగం వాటా తీసుకుంటూ… ప్రజలను భీతావహులను చేయసాగాడు. కొంతకాలానికి అతని దాష్టీకాలు నలుదిశలా వ్యాపించాయి. ఈ వార్త విన్న కాంభోజరాజు ఇదే సమయమని గుర్తించి, అయోధ్యపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. రథ, గజ, తురగ, పదాతి దళౄలను తీసుకుని అయోధ్యను చేరుకున్నాడు. నగరం నలుమూలలా శిబిరాలు నిర్మించి, యుద్ధానికి సిద్ధపడ్డాడు. గూఢచారుల వల్ల విషయం తెలుసుకున్న పురంజయుడు చసేది లేక… తాను కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. శత్రువు కంటే… తన శక్తి బలహీనంగా ఉన్నా… తుదికంటా పోరాడాలని నిర్ణయించుకున్నాడు. శాస్త్రసమన్వితమైన రథాన్ని ఎక్కి, సైన్యాధిపతులను పురికొల్పాడు. చతురంగ సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నద్దుడయ్యాడు. యుద్ధభేరీ మోగించి, సింహనాదాలు గావించి, మేఘాలు గర్జిస్తున్నాయా? అన్నట్లు పెద్దఎత్తున హుంకరించారు. శత్రు సైన్యంపై విరుచుకుపడ్డాడు.

ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యం వింశాధ్యాయ: (20వ అధ్యాయం) సమాప్త:20వ రోజు పారాయణ సంపూర్ణం

Sunday, November 25, 2018

కార్తీకపురాణం - 19 వ అధ్యాయం

కార్తీకపురాణం - 19 వ అధ్యాయం 

చతుర్మాస్య వ్రత ప్రభావం

నైమిశారణ్యంలో మునులంతా కలిసి చిదానందుని స్తోత్రం చేసిన తర్వాత జ్ఞానసిద్ధుడు అనే ఒక మహాయోగి ”ఓ దీనబాంధవా! వేదవేద్యుడవని, వేదవ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రాలుగా ఉన్నవాడివని, సర్వాంతర్యామివని, బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వతా పూజలందుకునే వాడివని, సర్వాంతర్యామివని, నిత్యుడవని, నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుతున్న ఓ మాధవా! నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు. సకల ప్రాణకోటికి ఆధారభూతడవైన ఓ నందనందనా… మా స్వాగతం స్వీకరింపుము. నీ దర్శన భాగ్యం వల్ల మేము, మా ఆశ్రమాలు, మా నివాస స్థలాలు అన్నీ పవిత్రాలయ్యాయి. ఓ దయామయా! మేం ఈ సంసార బంధం నుంచి బయటపడలేకున్నాం. మమ్మల్ని ఉద్దరింపుము. మానవుడెన్ని పురాణాలు చదివినా… ఎన్ని శాస్త్రాలను విన్నా… నీ దివ్య దర్శనం దొరకజాలదు. నీ భక్తులకు మాత్రమే నీవు కనిపిస్తావు. ఓ గజేంద్ర రక్షకా! ఉపేంద్రా! శ్రీధరా! హృషీకేశా! నన్ను కాపాడుము” అని మైమరచి స్తోత్రము చేయడగా… శ్రీహరి చిరునవ్వుతో…. ”జ్ఞానసిద్ధా! నీ స్తోత్ర వచనానికి నేనెంతో సంతోషించాను. నీకు ఇష్టమైన ఒక వరం కోరుకో” అని పలికెను. అంతట జ్ఞాన సిద్ధుడు ”ప్రద్యుమ్నా! నేనీ సంసార సాగరం నుంచి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగలా కొట్టుకుంటున్నాను. కాబట్టి నీ పాదపద్మాలపై ధ్యానముండేట్లు అనుగ్రహించు. మరేదీ నాకు అవసరం లేదు” అని వేడుకొన్నాడు. అంతట శ్రీమన్నారాయణుడు ”ఓ జ్ఞాన సిద్ధుడా! నీ కోరిక ప్రకారం వరమిస్తున్నాను. అదేకాకుండా, మరో వరం కోరుకో… ఇస్తాను. ఈ లోకంలో అనేకమంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యాలుచేస్తున్నారు. అలాంటివారి పాపాలు పోవడానికి ఒక వ్రతం కల్పిస్తున్నాను. ఆ వ్రతాన్ని సర్వజనులు ఆచరించొచ్చు. సావధానుడవై ఆలకించు…. నేను ఆషాఢ శుద్ధ దశిమిరోజున లక్ష్మీసమేతంగా పాలసముద్రంలో శేషశయ్యపై పవళిస్తాను. తిరిగి కార్తీకమాసం శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ కాలంలో చేసే వ్రతాలు నాకు అమిత ఇష్టమైనవి. చాతుర్మాస్యాల్లో ఎలాంటి వ్రతాలు చేయనివారు నరక కూపాలలో పడతారు. ఇతరులతో కూడా ఈ వ్రతాన్ని ఆచరింపజేయాలి. దీని మహత్యాన్ని తెలుసుకో. వ్రతం చేయనివారికి బ్రహ్మహత్యాది పాతకాలు కలుగుతాయి. ఇక చాతుర్మాస్య వ్రతం చేసేవారికి జన్మ, జరా, వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమంగా ఆషాఢ శుద్ధ దశిమి మొదలు శాఖములు (కూరలు), శ్రావణ శుద్ధ దశిమి మొదలు పప్పుదినుసులు విసర్జించాలి. నాయందు భక్తిగలవారిని పరీక్షించడానికి నేను ఇలా ద్రవ్యాల నిషేధాన్ని విధించాను. ఆ కాలంలో నేను ఆయా ద్రవ్యజాల్లో శయనిస్తాను. నీను ఇప్పుడు నన్ను స్తుతించిన తీరున త్రిసంధ్యల్లో భక్తిశ్రద్ధలతో పఠించేవారు నా సన్నిధికి నిశ్చయంగా వస్తారు” అని శ్రీమన్నారాయణుడు తెలిపాడు. అనంతరం ఆయన మహాలక్ష్మితో కలిసి పాలసముద్రానికి వెళ్లి, శేషపాన్పుపై పవళించాడు.
తిరిగి వశిష్టుడు జనకమహారాజుతో ఇలా అంటున్నాడు… ”ఓ రాజా! ఈ విధంగా విష్ణుమూర్తి, జ్ఞాన సిద్ధుడు, మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యాన్ని ఉపదేశించాడు. ఈ వృత్తాంతాన్ని ఆంగీరసుడు ధనలోభునికి తెలియజేశాడు. నేను నీకు వివరించాను. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఎలాంటి స్త్రీపురుష బేధం లేదు. అన్ని జాతుల వారు ఈ వ్రతాన్ని ఆచరించొచ్చు. శ్రీమన్నారాయణుడి ఉపదేశం ప్రకారం మునిపుంగవులంతా చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి, ధన్యులయ్యారు. అనంతరం వైకుంఠ ప్రాప్తిని పొందారు” అని వశిష్టులు చెప్పారు.

ఇట్లు స్కాంద పురాణాంతర్గతంలో వశిష్టుడు బోధించిన కార్తీకమహత్యం పందొమ్మిదో అధ్యాయం సమాప్తం
పందొమ్మిదోరోజు పారాయణం సమాప్తం.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Saturday, November 24, 2018

కార్తీకపురాణం 18 వ అధ్యాయం

కార్తీకపురాణం 18 వ అధ్యాయం

సత్కర్మనుష్టాన ఫల ప్రభావం

ధనలోభుడు తిరిగి ఆంగీరసులవారితో ఇలా అడుగుతున్నాడు…. ”ఓ మునిచంద్రా! మీ దర్శనం వల్ల నేనను ధన్యుడనయ్యాను. మీరు నాకున్న ఎన్నో అనుమానాలను నివృత్తి చేశారు. తత్ఫలితంగా నాకు జ్ఞానోపదేశమైంది. జ్ఞానోదయం కలిగింది. ఈ రోజు నుంచి నేను మీకు శిశ్యుడను. తండ్రి-గురువు-అన్న-దైవం అన్నీ మీరే. నా పూర్వ పుణ్య ఫలితాల వల్లే నేను మిమ్మల్ని కలిశాను. మీవంటి పుణ్యమూర్తుల సాంగథ్యం వల్ల నేను తిరిగి ఈ రూపాన్ని పొందాను. లేకుంటే… అడవిలో ఒక చెట్టులా ఉండాల్సిందే కదా? అసలు మీ దర్శన భాగ్యం కలగడమేమిటి? కార్తీక మాసం కావడమేమిటి? చెట్టుగా ఉన్న నేను విష్ణువు ఆలయాన్ని ప్రవేశించడమేమిటి? నాకు సద్గతి కలగడమేమిటి? ఇవన్నీ దైవికమైన ఘటనలే. కాబట్టి, ఇకపై మీతోనే మీ శిష్యకోటిలో ఒక పరమాణువుగా ఉండాలనుకుంటున్నాను. దయచేసి, నన్ను శిష్యుడిగా స్వీకరించండి. మానవులు చేయాల్సిన సత్కర్మలను, అనుసరించాల్సిన విధానాలు, వాటి ఫలితాలను విషదీకరించండి” అని కోరాడు. దానికి అంగీరసులవారు ఇలా చెబుతున్నారు… ”ఓ ధనలోభా! నీవు అడిగిన ప్రశ్నలన్నీ చాలా మంచివే. అందరికీ ఉపయోగపడతాయి. నీ అనుమానాలను నివృత్తి చేస్తాను. శ్రద్ధగా విను” అని ఇలా చెప్పసాగెను…”ప్రతి మనిషి శరీరమే సుస్థిరమని అనుకుంటాడు. అలా భావిస్తూ జ్ఞానశూన్యుడవుతున్నాడు. ఈ భేదం శరీరానికే కానీ, ఆత్మకు లేదు. అలాంటి ఆత్మజ్ఞానం కలగడానికే సత్కర్మలు చేయాలి. సకల శాస్త్రాలు ఇవే ఘోషిస్తున్నాయి. సత్కర్మనాచరించి వాటి ఫలితాన్ని పరమేశ్వరార్పితం చేయాలి. అప్పుడే జ్ఞానం కలుగుతుంది. మానవుడేజాతివాడు? ఎలాంటి కర్మలు ఆచరించాలి? అనే అంశాలను తెలుసుకోవాలి. వాటిని ఆచరించాలి. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక, సత్కర్మలనాచరించినా, అవి వ్యర్థమవుతాయి. అలాగే కార్తీకమాసంలో సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశిస్తుండగా… వైశాక మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తుండగా… మాఘ మాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా… అంటే మొత్తానికి ఈ మూడు మాసాల్లో తప్పక నదీ స్నానాలు, ప్రాత:కాల స్నానాలు ఆచరించాలి. అతుల స్నానాలాచరించాలి. దేవార్చన చేసినట్లయితే తప్పక వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సూర్య, చంద్ర గ్రహణ సమయాల్లో, ఇతర పుణ్యదినాల్లో ప్రాత: కాలంలోనే స్నానం చేసి, సంధ్యావందనం చేసుకుని, సూర్యుడికి నమస్కరించాలి. అలా ఆచరించని వాడు కర్మబ్రష్టుడవుతాడు. కార్తీకమాసంలో అరుణోదయస్నానం ఆచరించిన వారికి చతుర్విద పురుషార్థాలు సిద్ధిస్తాయి. కార్తీకమాసంతో సమానమైన నెలగానీ, వేదాలతో సరితూగే శాస్త్రంగానీ, గంగాగోదావరులకు సమాన తీర్థాలుగానీ, బ్రాహ్మణులకు సమానమైన జాతిగాని, భార్యతో సరితూగే సుఖమూ, ధర్మంతో సమానమైన మిత్రుడూ, శ్రీహరితో సమానమైన దేవుడూ లేడని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కార్తీకమాసంలో విద్యుక్త ధర్మంగా స్నానాదులు ఆచరించినవారు కోటియాగాల ఫలితాన్ని పొందుతారు” అని వివరించెను. దీనికి ధనలోభుడు తిరిగి ఇలా ప్రశ్నఇస్తున్నాడు…. ”ఓ మునిశ్రేష్టా…! చాతుర్మాస్య వ్రతమనగానేమిటి? ఎవరు దాన్ని ఆచరించాలి? ఇదివరకెవరైనా ఆ వ్రతాన్ని ఆచరించారా? ఆ వ్రత ఫలితమేమిటి? దాని విధానమేమిటి? నాకు సవివరంగా తెలపగలరు…” అని కోరాడు. ధనలోభుడి ప్రార్థనను మన్నించిన అంగీరసుడు ఇలా చెబుతున్నాడు…. ”ఓయీ…! చాతుర్మాస్య వ్రతమనగా మహా విష్ణువు, మహాలక్ష్మీదేవితో ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పాల సముద్రంలో శేషపాన్పుపై శయనించి, కార్తీక శుద్ధ ఏకాదశిరోజున నిద్రలేస్తారు. ఆ నాలుగు నెలలను చాతుర్మాస్యమంటారు. అనగా… ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు. ఈ నాలుగు నెలలు విష్ణుదేవుడి ప్రీతికోసం స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసినట్లయితే పుణ్యఫలితాలు కలుగుతాయి. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను. ఆ సంగతిని నీకు చెబుతున్నాను.
తొలుత కృతయుగంలో వైకుంఠంలో గరుడ గంధర్వాది దేవతలు, వేదాలతో సేవించబడే శ్రీమన్నారాయణుడు లక్ష్మీసమేతుడై సింహాసనంపై కూర్చుని ఉండగా… ఆ సమయంలో నారద మహర్షి వచ్చి, కోటి సూర్య ప్రకాశవంతుడైన శ్రీమన్నారాయణుడికి నమస్కరించి, ముకుళిత హస్తాలతో నిలబడి ఉన్నాడు. అంత శ్రీహరి నారదుడిని చూసి… ఏమి తెలియనివాడిలా మందహాసంతో ‘నారదా క్షేమమేనా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలే లేవు. మహామునుల సత్కర్మానుష్టానాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగుతున్నాయా? ప్రపంచంలో అరిష్టములేమీ లేవుకదా?’ అని కుశల ప్రశ్నలు వేసెను. అంత నారదుడు శ్రీహరికి, ఆదిలక్ష్మికి నమస్కరించి ‘ఓ దేవా… ఈ జగత్తులో నీవు ఎరగని విషయాలే లేవు. అయినా… నన్ను అడుగుతున్నారు. ఈ ప్రపంచంలో కొందరు మనుషులు, మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు. వారు ఎలా విముక్తులవుతారో తెలియదు. కొందరు తినరాని పదార్థాలు తింటున్నారు. కొందరు పుణ్యవ్రతాలు చేస్తూ, అవి పూర్తికాకుండానే మధ్యలోనే మానేస్తున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సాహితులుగా, పరనిందా పరాయణులుగా జీవిస్తున్నారు. అలాంటి వారిని సత్కృపత రక్షింపుము’ అని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీహరి కలవరం చెంది, లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షుఉలున్న భూలోకానికి వచ్చి, ముసలి బ్రాహణ రూపంలో ఒంటరిగా తిరుగుతుండెను. ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు, పుణ్యశ్రవణాలు తిరుగుచుండెను. ఆ విధంగా తిరుగుతున్న భగవంతుడిని గాంచిన కొందరు, అతను ముసలిరూపంలో ఉండడంతో ఎగతాళి చేయుచుండిరి. కొందరు ‘ఈ ముసలివానితో మనకేమి పని’ అని ఊరకుండిరి. గర్విష్టులై మరికొందరు శ్రీహరిని కన్నెత్తి చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి, ‘వీరిని ఎలా తరింపజేయాలి?’ అని ఆలోచిస్తూ… తన నిజరూపంలోకి వచ్చాడు. శంఖ, చక్ర, గదా, పద్మ, కౌస్తుభ, వనమాలా ధరించి, లక్ష్మీదేవితోను, భక్తులతోనూ, మునిజన ప్రీతికరమైన నైమిశారణ్యానికి వెళ్లాడు. ఆ వనంలో తపస్సు చేసుకుంఉటున్న ముని పుంగవులను స్వయంగా ఆశ్రమంలో కలిశారు. వారంతా శ్రీ మన్నారయణుడిని దర్శించి, భక్తిశ్రద్ధలతో ప్రణమిల్లారు. అంజలి ఘటించి, ఆది దైవమైన ఆ లక్ష్మీనారాయణుడిని ఇలా స్తుతించారు…

శ్లో|| శాంత కారం! భజగా శయనం ! పద్మ నాభం! సురేశం!
విశ్వా కారం! గగన సదృశం ! మేఘవర్ణం శుభాంగం!
లక్ష్మి కాంతం ! కమల నయనం! యోగి హృద్ద్యాన గమ్యం!
వందే విష్ణు! భవ భయ హారం! సర్వ లోకైక నాథం||

శ్లో|| లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీ రంగ దామేశ్వరీం
దాసి భూత సమస్త దేవా వనితాం లోకైక దీపంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధవిభవత్ బ్రహ్మేంద్ర గంగాధరం
త్వాం త్రైలోక్య కుటుంబినిం శర సిజాం వందే ముకుంద ప్రియం||

ఇట్లు స్కాంద పురాణాం తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి అష్టా దశాధ్యాయం – పద్దెనిమిదో రోజు పారాయణం సమాప్తం.

కార్తీకపురాణం - 17వ అధ్యాయం

కార్తీకపురాణం - 17వ అధ్యాయం

ధనలోభికి తత్వోపదేశం

అప్పుడు ఆంగీరసుడు మునులతో ఇలా అంటున్నాడు…. ”ఓ మహా మునులారా! ఓ ధనలోభి! మీకు కలిగిన సంశయాలకు సమాధానమిస్తాను. సావధానంగా వినండి” అంటూ ఇలా చెప్పసాగారు. ”కర్మల వల్ల ఆత్మ దేహదారణ సంభవిస్తున్నది. కాబట్టి, శారీరోత్పత్తి కర్మకారణంగా జరుగుతోందనే విషయాన్ని గుర్తించాలి. శరీరధారణం వల్ల ఆత్మ కర్మను చేస్తుంది. కర్మ చేయడానికి శరీరమే కారణమవుతోన్నది. స్థూల, సూక్ష్మ శరీర సంబంధాల వల్ల ఆత్మకు కర్మ సంబంధాలు కలుగుతాయని తొలుత పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు. దాన్ని మీకు చెబుతున్నాను. ఆత్మ అనగా… ఈ శరీరాన్ని అహంకారంగా ఆవహించి వ్యవహరించేది అని అర్థం” అని వివరించాడు. దీనికి ధనలోభుడు తిరిగి ఇలా అడుగుతున్నాడు… ”ఓ మునినీద్రా! మేం ఇప్పటి వరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాం. ఇంకా వివరంగా చెప్పండి. వ్యక్య్తార్థ జ్ఞానం, పదార్థ జ్ఞానం, అహం బ్రహ్మ అనే వ్యక్య్తార్థ్య జ్ఞానం గురించి తెలియజేయండి” అని కోరాడు. 
అప్పుడు అంగీరసుడు తిరిగి ఇలా చెబుతున్నాడు ”ఈ దేహం అంత్ణకరణ వృత్తికి సాక్షి. నేను-నాది అని చెప్పే జీవాత్మయే అహం అను శబ్దం. సర్వాతంర్యామి అయిన పరమాత్మ న్ణ అనే శబ్దం. శరీరానికి ఆత్మలా షుటాదులు లేవు. సచ్చిదానంద స్వరూపం, బుద్ది, సాక్షి, జ్ఞానరూపి, శరీరేంద్రియాలను ప్రవర్తింపజేసి, వాటికంటే వేరుగా ఉంటూ… ఒకే రీతిలో ప్రకాశించేదే ఆత్మ. నేను అనేది శరీరేంద్రియానికి సంబంధించినది. ఇనుము అయస్కాంతాన్ని అంటిపెట్టుకుని ఎలా తిరుగుతుందో… ఆత్మకూడా శరీరాన్ని, శరీర ఇంద్రియాలను ఆశ్రయించి తిరుగుతుంది. అవి ఆత్మ వల్ల పనిచేస్తాయి. నిద్రలో శరీరేంద్రియాల సంబంధం ఉండదు. నిద్ర మేల్కొన్నతర్వాత నేను సుఖనిద్ర పొందాను అని భావిస్తారు. శరీర ఇంద్రియాలతో ప్రమేయం లేకుండా ఎదైతే సుఖాన్నిచ్చిందో అదే ఆత్మ. దీపాన్ని గాజుబుడ్డి ప్రకాశింపజేస్తుంది. అదేవిధంగా ఆత్మకూడా దేహ, ఇంద్రియాలను ప్రకాశింపజేస్తుంది. ఆత్మ పరమాత్మ స్వరూపం. తత్వమసి మొదలైన వ్యాక్యాల్లో త్వం అనే పదం కించిత్ జ్ఞాత్వాదిశాశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం. త్వం అంటే నీవు అని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ, పరమాత్మల ఏకత్వాన్ని బోధిస్తుంది. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మాలను వదిలివేయడగా సచ్చిదానంద రూపం ఒక్కటే నిలుస్తుంది. అదే ఆత్మ. దేహలక్షణాలు జన్మించుట, పెరుగుట, క్షీణించుట వంటివి ఆరు క్రమాలుంటాయి. అయితే ఆత్మకు అలాంటి లక్షణాలు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం ఉన్నది. వేదాల్లో దేనికి సర్వజ్ఞత్వం, ఉపదేశం, సంపూర్ణత్వం నిరూపించబడి ఉందో… అదే ఆత్మ. ఒక కుండను చూసి, అది మట్టితో చేసిందని ఎలా గుర్తిస్తామో… అలాగే ఒక దేహాంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మ అని తెలుసుకోవాలి. జీవుల కర్మ ఫలాలను అనుభవించేవాడు పరమేశ్వరుడేనని, జీవులు ఆ కర్మలను ఫలాలని భావిస్తారని తెలుసుకోవాలి. అందువల్ల మానవుడు గుణసంపత్తు కలవాడై… గురుశుశ్రూష ఒనర్చి, సంసార సంబంధమైన ఆశలను విడిచి, విముక్తిని పొందాలి. మంచి పనులు తలచినంతనే చిత్తశుద్ధి, తద్వారా జ్ఞానం, భక్తి, వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందుతారు. అందువల్ల సత్కర్మానుష్టానం చేయాలి. మంచి పనులు చేస్తేగానీ ముక్తి లభించదు” అని అంగీరసుడు వివరించాడు.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి సప్తాదశాధ్యాయం – పదిహేడవ రోజు పారాయణ సమాప్తం

Friday, November 23, 2018

కార్తీకపురాణం 16వ అధ్యాయం

కార్తీకపురాణం 16వ అధ్యాయం
కార్తీకపురాణం 16వ అధ్యాయం
స్తంభదీప ప్రశంస


తిరిగి వశిష్టుడు జనకమహారాజుతో ఇలా చెబుతున్నాడు… ”ఓ మహారాజా! కార్తీక మాసం దామోదరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఆ నెలలో స్నాన, దాన, వ్రతాదులను చేయడం, సాలగ్రామ దానం చేయడం చాలా ముఖ్యం. ఎవరు కార్తీక మాసంలో తనకు శక్తి ఉన్నా దానం చేయరో… అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుతారు. ఈ నెలరోజులు తాంబూల దానం చేయువారు చక్రవర్తిగా పుడతారు. ఆ విధంగా నెలలో ఏ ఒక్కరోజూ విడవకుండా తులసి కోటవద్దగానీ, భగవంతుని సన్నిధిలోగానీ దీపారాధన చేసినట్లయితే సమస్త పాపాలు నశిస్తాయి. వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక శుద్ధ పౌర్ణమిరోజు నదీస్నానమాచరించి, భగవంతుడి సన్నిధిలో ధూప దీప నైవేద్యాలతో దక్షిణ తాంబూలాలు, నారీకేళ ఫలాలు దానం చేసినట్లయితే… చిరకాలం నుంచి సంతానం లేనివారికి పుత్ర సంతానం కలుగుతుంది.
సంతానం ఉన్నవారు ఇలా చేస్తే… వారికి సంతాన నష్టమనేది ఉండదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు. ఈ నెలలో ధ్వజస్తంభంలో ఆకాశ దీపం వెలిగించినవారు వైకుంఠంలో సకల భోగాలు అనుభవిస్తారు. కార్తీకమాసమంతా ఆకాశదీపంగానీ, స్తంభదీపంగానీ పెట్టి, నమస్కరించిన స్త్రీపురుషులకు సకలైశ్వర్యాలు కలిగి, వారి జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆకాశదీపం పెట్టేవారు శాలిదాన్యంగానీ, నువ్వులుగానీ ప్రమిద అడుగున పోయాలి. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారు, లేదా దీపం పెట్టేవారిని పరిహాసం చేసేవారు చుంచు జన్మ ఎత్తుతారు. ఇందుకు ఒక కథ ఉంది… చెబుతాను. సావధానంగా విను…” అని ఇలా చెప్పసాగాడు….
దీపస్తంభం.. విప్రుడగుట
రుష్యాగ్రగణ్యుడైన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని, దానికి దగ్గర్లో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించారు. నిత్యం పూజలు చేస్తూ ఉండేవారు. కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల ఉండే మునులు కూడా అక్కడకు వచ్చి పూజాదికాలు నిర్వహించేవారు. ఒకరోజు ఆ మునుల్లో ఒక వృద్ధుడు తక్కినవారిని చూసి… ”ఓ సిద్ధులారా! కార్తీకమాసంలో హరిహరాదుల ప్రీతికోసం స్తంభదీపం పెట్టిన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా! రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతికోసం ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి, దానిపై దీపం పెడదాం. అంతా కలిసి అడవికి వెళ్లి, నిడుపాటి స్తంభం తీసుకువద్దాం” అని కోరారు. అందుకు అంతా సంతసించి, పరమానందభరితులై అడవికి వెళ్లి, చిలువలు, వలువలు లేని ఓ చెట్టును మొదలు నుంచి నరికి, దాన్ని తీసుకొచ్చి, ఆలయంలో స్వామివారికి ఎదురుగా పాతారు. దానిపై శాలి ధాన్యముంది, ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి, అందులో వత్తిని వేసి, వెలిగించారు. ఆ తర్వాత వారంతా కూర్చుని పురాణ పఠనం చేయసాగారు. అంతలో ”ఫళఫలా”మనే శబ్ధం వచ్చింది. వారు అటు చూడగా… వారు పాతిన స్తంభం పడిపోయి ముక్కలై కనిపించింది. దీపం కూడా ఆరిపోయి, చెల్లాచెదురుగా పడిపోయింది. ఆ దృశ్యం చూసినవారంతా ఆశ్చర్యంతో నిలబడిపోయారు. అంతలో ఆ స్తంభం నుంచి ఒక పురుషుడు బయటకు వచ్చాడు. మునులంతా అతన్ని చూసి, ఆశ్చర్యంతో ”ఓయీ… నీవెవరవు? నీవీ స్తంభం నుంచి ఎలా వచ్చావు? నీ కథేంటి?” అని ప్రశ్నించారు.
దానికి ఆ పురుషుడు మునులందరికీ నమస్కరించి, ”పుణ్యాత్ములారా! నేను కిందటి జన్మలో బ్రాహ్మణుడను. ఒక జమిందారుగా సకలైశ్వర్యాలతో తలతూగాను. నాపేరు ధన లోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండడం వల్ల మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలేక ప్రవర్తించాను. దుర్భుద్ధుల వల్ల వేదాలను చదవక, శ్రీహరిని పూజింపక, దానధర్మాలు చేయకుండా ఉంటిని. నేనను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయంలో ఎవరైనా విప్రులు వచ్చినా… వారితో నా కాళ్లను కడిగించి, ఆ నీటిని వారి తలపై వేసుకునేలా చేసి, నానా దుర్భాషలాడేవాడిని. నేను ఉన్నతాసనంపై కూర్చుని, అతిథులను నేలపై కూర్చోమని చెప్పేవాడిని. స్త్రీలను, పసిపిల్లలను హనీంగా చూసేవాడిని. జనాలంతా నా చేష్టలకు భయపడేవారు. నన్ను మందలించే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. నేను చేసే పాపకార్యాలకు హద్దులేకపోయింది. ధర్మాలంటే ఏమిటో నాకు తెలియదు. ఇంత దుర్గార్గుడిగా, పాపిగా జీవితం గడిపి, అవసాన దశలో చనిపోయాను. ఆ తర్వాత ఘోర నరకాలు అనుభవించి, లక్ష జన్మలలో కుక్కగా, పదివేల జన్మలు కాకిగా, అయిదువేల జన్మలు తొండగా, అయిదు వేల జన్మలు పేడ పెరుగుగా, తర్వాత వృక్ష జన్మమెత్తి అరణ్యంలో కూడా ఉన్నాను. అయినా నేను చేసిన పాపాలను పోగొట్టుకోలేకపోయాను. ఇన్నాళ్లకు మీ దయవల్ల స్తంభంగా ఉన్న నేను నా రూపమెత్తి, జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీ మీకు తెలియజేశాను. నన్ను మన్నించండి” అని వేడుకొన్నాడు. ఆ మాటలు విన్న మునులంతా అమిత ఆశ్చర్యం పొందారు. ”ఆహా! కార్తీకమాసం మహిమ ఎంత గొప్పది ? అంతేకాకుండా కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యంకాదు. కర్రలు, రాళ్లు, స్తంభాలు కూడా మన కళ్ల ఎదుట ముక్తిని పొందుతున్నాయి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశ దీపముంచిన వైకుంఠప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది. అందువల్లే ఈ స్తంభానికి  ముక్తికలిగింది” అని మునులు అనుకుంటుండగా… ఆ పురుషుడు మళ్లీ ఇలా మాట్లాడుతున్నాడు… ”ఓ మునులారా…! నాకు ముక్తి కలుగు మార్గమేమైనా ఉందా? ఈ జగంలో ఎల్లరకూ కర్మబంధం ఎలా కలుగుతుంది? అది ఎలా నశిస్తుంది? నా సంశయాన్ని తీర్చండి” అని ప్రార్థించారు. అంత అక్కడున్న మునులంతా… తమలో ఒకరగు అంగీరసమునితో ”స్వామీ…! మీరే అతని సంశయాన్ని తీర్చగల సమర్థులు. కాబట్టి వివరించండి” అని కోరిరి. అంతట ఆయన వారి సంశయాన్ని తీర్చేందుకు అంగీకారం తెలిపాడు.

ఇట్లు స్కాంధ పురాణాంతర్గతమై, వశిష్టులవారిచే చెప్పబడిన కార్తీకమహత్యమందలి పదహారో అధ్యాయం
పదహారో రోజు పారాయణం సమాప్తం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Thursday, November 22, 2018

కార్తీకపురాణం 15 వ అధ్యాయం

కార్తీకపురాణం 15 వ అధ్యాయం 

దీప ప్రజ్వలనం - ఎలుకకు పూర్వజన్మ స్మృతి

తిరిగి జనక మహారాజుతో వశిష్టమహాముని ఇలా అంటున్నారు… ”ఓ జనకా! కార్తీక మహత్యాన్ని గురించి ఎంత చెప్పినా పూర్తికాదు. కానీ, ఇంకో ఇతిహాసం చెబుతాను. శ్రద్ధగా విను…” అని ఇలా చెప్పసాగెను. ”ఈ నెలలో హరినామ సంకీర్తనలు చేయడం, వినడం, శివకేశవుల వద్ద దీపారాధన చేయడం, పురాణ పఠనం లేదా శ్రవణం, సాయం సమయాల్లో దేవతా దర్శనాలు విధిగా చేయాలి. అలా చేయనివారు కాలసూత్రమనే నరకంలో కొట్టుమిట్టాడుతారు. కార్తీక శుద్ధ ద్వాదశిరోజున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం కలుగుతుంది. శ్రీమన్నారాయణును గంధపుష్పాలతో, అక్షితలతో పూజించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించినట్లయితే… విశేష ఫలం లభిస్తుంది. ఇలా నెలరోజులు క్రమం తప్పకుండా చేసిన వారు అంత్యమున దేవదుందుభులు మోగుతుండగా… వైకుంఠంలో విష్ణుసాన్నిధ్యం పొందగలరు. ఇలా నెలరోజులు పూజాదికాలు నిర్వర్తించలేనివారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణిమ రోజుల్లో నిష్టతో పూజ చేసి, ఆవునేతితో దీపం వెలిగించాలి. ఆవుపాలు పితికినంత సేపైనా దీపం వెలిగించిన వారికి తదుపరి బ్రాహ్మణ జన్మ ప్రాప్తిస్తుంది. ఇతరులు పెట్టిన దీపంలో నూనె వేసినా… అవసానదశలో ఉన్న దీపం వత్తిని పైకి జరిపి దీపాన్ని వృద్ధి చేసినా, కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించినా… వారి సమస్తపాపాలు హరిస్తాయి. దీనికి సంబంధించి ఒక కథ చెబుతాను విను…” అని ఇలా చెప్పసాగెను… సరస్వతి నదీ తీరంలో శిథిలమైన దేవాలయమొకటి ఉండేది. కర్మనిష్టుడైన దయార్థ్ర హృదయుడైన ఒక యోగిపుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి, కార్తీకమాసమంతా అక్కడే గడిపి, పురాణ పఠనం చేయాలని తలంచాడు. ఆ పాడుబడ్డ దేవాలయాన్ని శుభ్రంగా ఊడ్చి, నీళ్లతో కడిగి, బొట్టు పెట్టి, పక్కగ్రామాలకు వెళ్లి, ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తులు చేసి, పన్నెండు దీపాలు పెట్టాడు. స్వామిని పూజిస్తూ… నిష్టతో పురాణాన్ని చదువుతుండెను. ఈ విధంగా కార్తీకమాసం ఆరంభం నుంచి చేయసాగాడు. ఒక రోజున ఓ ఎలుక ఆ దేవాలయంలోకి ప్రవేశించింది. నాలుగు మూలలు వెతికి, తినడానికి ఏమి దొరుకుతుందా? అని అక్కడ ఆరిపోయిన వత్తిని తినాలని నిర్ణయించుకుంది. అలా ఆ వత్తిని నోట కరుచుకుని తీసుకెళ్తుండగా… పక్కనే ఉన్న దీపానికి తగిలి, ఎలుక నోట్లో ఉన్న వత్తి కొసకు నిప్పు అంటుకుంది. అలా ఆరిపోయిన వత్తి వెలుగుతూ వచ్చింది. అది కార్తీకమాసం కావడం, శివాలయంలో ఆరిపోయిన వత్తిని ఎలుక వెలగించడం వల్ల దాని పాపాలు హరించుకుపోయి, పుణ్యం కలిగింది. వెంటనే దానికి మానవ రూపం సిద్ధించింది. ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు కళ్లు తెరిచిచూడగా… పక్కనే ఒక మానవుడు నిలబడి ఉండడం గమనించాడు. ”ఓయీ…! నీవు ఎవరవు? ఎందుకు ఇలా నిలబడ్డావు?” అని ప్రశ్నించగా… అతను వినమ్రంగా… ”అయ్యా! నేను ఒక ఎలుకను. రాత్రి నేను తిండికోసం వెతుకుతుండగా ఈ ఆలయంలోకి వచ్చాను. ఇక్కడేమీ దొరక్కపోవడంతో నెయ్యివాసనలతో ఉన్న ఆరిపోయిన వత్తిని తినాలని దాన్ని నోటకరిచితీసుకువెళ్లసాగాను. పక్కనే ఉన్న దీపానికి తగిలింది. ఆ వత్తి వెలగడం వల్ల నా పాపాలు హరించుకుపోయాయనకుంటాను. అందుకే వెంటనే పూర్వజన్మమెత్తాను. కానీ… ఓ మహానుభావా! నేను ఎందుకీ మూషిక జన్మనెత్తానో, దానికి కారణమేమో తెలియదు. మీరు యోగిపుంగవుల్లా ఉన్నారు. దయచేసి, నాకు విశదీకరించండి” అని కోరాడు. అంతట ఆ యోగి ఆశ్చర్యంతో తన దివ్యదృష్టిచే సర్వం తెలుసుకుని ఇలా చెబుతున్నాడు… ”ఓయీ! నీవు కిందటి జన్మలో బ్రాహ్మణుడవు. నీ పేరు బహ్లికుడు. నీవు జైనమతానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేస్తూ… ధనాశాపరుడవై దేవ పూజలు, నిత్యకర్మలను మరచావు. నీచుల సహవాసం చేశావు. నిషిద్ధాన్నం తిన్నావు. మంచివారు, యోగ్యులను నిందించావు. పరుల చెంత స్వార్థ చింతన కలిగిఉండడమే కాకుండా, ఆడపిల్లలను అమ్మే వృత్తిని చేపట్టి, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టావు. సమస్త తినుబండారాలను చౌకగా కొని వాటిని ఎక్కువ ధరలకు అమ్మావు. అలా అమ్మిన ధనాన్ని నీవు అనుభవించక… ఇతరులకు ఇవ్వక భూస్థాపితం చేసి, పిసినారివై జీవించావు. మరణించిన తర్వాత ఎలుక జన్మనెత్తి, వెనకటి జన్మ పాపాలను అనుభవించావు. భగవంతుడి దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవయ్యావు. దానివల్లే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కాబట్టి, నీవు నీగ్రామానికి వెళ్లి, నీ పెరట్లో పాతిన ధనాన్ని తవ్వితీసి, దాంతో దానధర్మాలు చేసి, భగవంతుడిని ప్రార్థిస్తూ మోక్షం పొందుము” అని నీతులు చెప్పి పంపాడు. చూశావా జనకమహారాజా! జీర్ణమైన ఓ వత్తిని తిరిగి వెలిగించినంతమాత్రాన ఒక మూషికం ఎంతటి ఫలితాన్ని పొందిందో?? ఇలా కార్తీకమాసంలో దీపం వెలిగించడం వల్ల, కనీసం కొండెక్కేందుకు సిద్ధంగా ఉన్న దీపంలో నూనెవేసి వృద్ధి చేసినా, జీర్ణమైన దీపాన్ని వెలిగించినా ఎలాంటి ఫలితాలు కలుగుతాయనడానికి ఈ వృత్తాంతం ఉదాహరణ…” అని వివరించాడు. స్కాందపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య పంచ దశాధ్యాయ్ణ కార్తీకపురాణం 15వ అధ్యాయం : దీప ప్రజ్వలనం - ఎలుకకు పూర్వజన్మ స్మృతి తిరిగి జనక మహారాజుతో వశిష్టమహాముని ఇలా అంటున్నారు… ”ఓ జనకా! కార్తీక మహత్యాన్ని గురించి ఎంత చెప్పినా పూర్తికాదు. కానీ, ఇంకో ఇతిహాసం చెబుతాను. శ్రద్ధగా విను…” అని ఇలా చెప్పసాగెను. ”ఈ నెలలో హరినామ సంకీర్తనలు చేయడం, వినడం, శివకేశవుల వద్ద దీపారాధన చేయడం, పురాణ పఠనం లేదా శ్రవణం, సాయం సమయాల్లో దేవతా దర్శనాలు విధిగా చేయాలి. అలా చేయనివారు కాలసూత్రమనే నరకంలో కొట్టుమిట్టాడుతారు. కార్తీక శుద్ధ ద్వాదశిరోజున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం కలుగుతుంది. శ్రీమన్నారాయణును గంధపుష్పాలతో, అక్షితలతో పూజించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించినట్లయితే… విశేష ఫలం లభిస్తుంది. ఇలా నెలరోజులు క్రమం తప్పకుండా చేసిన వారు అంత్యమున దేవదుందుభులు మోగుతుండగా… వైకుంఠంలో విష్ణుసాన్నిధ్యం పొందగలరు. ఇలా నెలరోజులు పూజాదికాలు నిర్వర్తించలేనివారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణిమ రోజుల్లో నిష్టతో పూజ చేసి, ఆవునేతితో దీపం వెలిగించాలి. ఆవుపాలు పితికినంత సేపైనా దీపం వెలిగించిన వారికి తదుపరి బ్రాహ్మణ జన్మ ప్రాప్తిస్తుంది. ఇతరులు పెట్టిన దీపంలో నూనె వేసినా… అవసానదశలో ఉన్న దీపం వత్తిని పైకి జరిపి దీపాన్ని వృద్ధి చేసినా, కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించినా… వారి సమస్తపాపాలు హరిస్తాయి. దీనికి సంబంధించి ఒక కథ చెబుతాను విను…” అని ఇలా చెప్పసాగెను… సరస్వతి నదీ తీరంలో శిథిలమైన దేవాలయమొకటి ఉండేది. కర్మనిష్టుడైన దయార్థ్ర హృదయుడైన ఒక యోగిపుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి, కార్తీకమాసమంతా అక్కడే గడిపి, పురాణ పఠనం చేయాలని తలంచాడు. ఆ పాడుబడ్డ దేవాలయాన్ని శుభ్రంగా ఊడ్చి, నీళ్లతో కడిగి, బొట్టు పెట్టి, పక్కగ్రామాలకు వెళ్లి, ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తులు చేసి, పన్నెండు దీపాలు పెట్టాడు. స్వామిని పూజిస్తూ… నిష్టతో పురాణాన్ని చదువుతుండెను. ఈ విధంగా కార్తీకమాసం ఆరంభం నుంచి చేయసాగాడు. ఒక రోజున ఓ ఎలుక ఆ దేవాలయంలోకి ప్రవేశించింది. నాలుగు మూలలు వెతికి, తినడానికి ఏమి దొరుకుతుందా? అని అక్కడ ఆరిపోయిన వత్తిని తినాలని నిర్ణయించుకుంది. అలా ఆ వత్తిని నోట కరుచుకుని తీసుకెళ్తుండగా… పక్కనే ఉన్న దీపానికి తగిలి, ఎలుక నోట్లో ఉన్న వత్తి కొసకు నిప్పు అంటుకుంది. అలా ఆరిపోయిన వత్తి వెలుగుతూ వచ్చింది. అది కార్తీకమాసం కావడం, శివాలయంలో ఆరిపోయిన వత్తిని ఎలుక వెలగించడం వల్ల దాని పాపాలు హరించుకుపోయి, పుణ్యం కలిగింది. వెంటనే దానికి మానవ రూపం సిద్ధించింది. ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు కళ్లు తెరిచిచూడగా… పక్కనే ఒక మానవుడు నిలబడి ఉండడం గమనించాడు. ”ఓయీ…! నీవు ఎవరవు? ఎందుకు ఇలా నిలబడ్డావు?” అని ప్రశ్నించగా… అతను వినమ్రంగా… ”అయ్యా! నేను ఒక ఎలుకను. రాత్రి నేను తిండికోసం వెతుకుతుండగా ఈ ఆలయంలోకి వచ్చాను. ఇక్కడేమీ దొరక్కపోవడంతో నెయ్యివాసనలతో ఉన్న ఆరిపోయిన వత్తిని తినాలని దాన్ని నోటకరిచితీసుకువెళ్లసాగాను. పక్కనే ఉన్న దీపానికి తగిలింది. ఆ వత్తి వెలగడం వల్ల నా పాపాలు హరించుకుపోయాయనకుంటాను. అందుకే వెంటనే పూర్వజన్మమెత్తాను. కానీ… ఓ మహానుభావా! నేను ఎందుకీ మూషిక జన్మనెత్తానో, దానికి కారణమేమో తెలియదు. మీరు యోగిపుంగవుల్లా ఉన్నారు. దయచేసి, నాకు విశదీకరించండి” అని కోరాడు. అంతట ఆ యోగి ఆశ్చర్యంతో తన దివ్యదృష్టిచే సర్వం తెలుసుకుని ఇలా చెబుతున్నాడు…”ఓయీ! నీవు కిందటి జన్మలో బ్రాహ్మణుడవు. నీ పేరు బహ్లికుడు. నీవు జైనమతానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేస్తూ… ధనాశాపరుడవై దేవ పూజలు, నిత్యకర్మలను మరచావు. నీచుల సహవాసం చేశావు. నిషిద్ధాన్నం తిన్నావు. మంచివారు, యోగ్యులను నిందించావు. పరుల చెంత స్వార్థ చింతన కలిగిఉండడమే కాకుండా, ఆడపిల్లలను అమ్మే వృత్తిని చేపట్టి, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టావు. సమస్త తినుబండారాలను చౌకగా కొని వాటిని ఎక్కువ ధరలకు అమ్మావు. అలా అమ్మిన ధనాన్ని నీవు అనుభవించక… ఇతరులకు ఇవ్వక భూస్థాపితం చేసి, పిసినారివై జీవించావు. మరణించిన తర్వాత ఎలుక జన్మనెత్తి, వెనకటి జన్మ పాపాలను అనుభవించావు. భగవంతుడి దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవయ్యావు. దానివల్లే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కాబట్టి, నీవు నీగ్రామానికి వెళ్లి, నీ పెరట్లో పాతిన ధనాన్ని తవ్వితీసి, దాంతో దానధర్మాలు చేసి, భగవంతుడిని ప్రార్థిస్తూ మోక్షం పొందుము” అని నీతులు చెప్పి పంపాడు. చూశావా జనకమహారాజా! జీర్ణమైన ఓ వత్తిని తిరిగి వెలిగించినంతమాత్రాన ఒక మూషికం ఎంతటి ఫలితాన్ని పొందిందో?? ఇలా కార్తీకమాసంలో దీపం వెలిగించడం వల్ల, కనీసం కొండెక్కేందుకు సిద్ధంగా ఉన్న దీపంలో నూనెవేసి వృద్ధి చేసినా, జీర్ణమైన దీపాన్ని వెలిగించినా ఎలాంటి ఫలితాలు కలుగుతాయనడానికి ఈ వృత్తాంతం ఉదాహరణ…” అని వివరించాడు.
స్కాందపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య పంచ దశాధ్యాయ్ణయం 15వ రోజు పారాయణం సమాప్తం

Wednesday, November 21, 2018

కార్తీకపురాణం 14 వ అధ్యాయం

కార్తీకపురాణం 14 వ అధ్యాయం 

ఆబోతుకు అచ్చువేసి వదులుట
మళ్లీ వశిష్టమహాముని కార్తీక మాస మహత్యాలను గురించి తనకు తెలిసిన అన్ని విషయాలను జనకుడికి చెప్పాలనే కుతూహలంతో ఇలా చెబుతున్నారు…”ఓ రాజా! కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సవం చేయడం, శివలింగ సాలగ్రామాలను దానం చేయడం, ఉసిరికాయల్ని దక్షణతో దానం చేయడం మొదలగు పుణ్యకార్యాలు చేయడం వల్ల వెనకటి జన్మల్లో చేసిన సమస్త పాపాలు తొలగిపోతాయి. అలా చేసేవారికి కోటి యాగాల ఫలితం దక్కుతుంది. వారి వంశానికి చెందిన పితృదేవతలు పైలోకాల నుంచి ఎవరు ఆబోతుకు అచ్చువేసి వదులుతారో? అని చూస్తుంటారు. ప్రతిసంవత్సరం కార్తీక మాసంలో శక్తికొలదీ దానం చేసి, నిష్టతో వ్రతమాచరించి, శివకేశవులకు ఆలయంలో దీపారాధన చేసి, పూజరోజున రాత్రంతా జాగారం ఉండి, మర్నాడు శక్తికొలదీ బ్రాహ్మణులు, సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహ, పర లోకాల్లో సర్వసుఖాలను పొందగలరు” అని వివరించారు. కార్తీక మాసంలో చేయాల్సిన పనులను చెప్పిన వశిష్టుడు మరికొన్ని నిత్యాచరణ విధులతోపాటు, చేయకూడనివేవో ఇలా చెబుతున్నాడు..” ఓ రాజా! పరమ పవిత్రమైన ఈ నెలలో పరాన్న భక్షణ చేయరాదు. ఇతరుల ఎంగిలి ముట్టుకోకూడదు, తినకూడదు. శ్రాద్ధ భోజనం చేయకూడదు. నీరుల్లి తినకూడదు. తిలాదానం తగదు. శివార్చన, సంధ్యావందనం, విష్ణుపూజ చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారాల్లో సూర్యచంద్ర గ్రహణం రోజుల్లో భోజనం చేయరాదు. కార్తీక మాసంలో నెలరోజులూ రాత్రుళ్లు భోజనం చేయకూడదు. ఈ నెలలో విధవ వండింది తినకూడదు. ఏకాదశి, ద్వాదశి వ్రతాలు చేసేవారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం చేయాలి. ఒక్కపూట మాత్రమే భోజనం చేయాలి. ఈ నెలో ఒంటికి నూనె రాసుకుని స్నానం చేయకూడదు. పురాణాలను విమర్శించరాదు. కార్తీక మాసంలో వేడినీటితో స్నానం కల్తుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాడు. కాబట్టి, వేడినీటి స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యం ఉంది, ఎలాగైనా విడవకుండా కార్తీకమాస వ్రతం చేయాలనే కుతూహలం ఉన్నవారు మాత్రమే వేడినీటి స్నానం చేయొచ్చు. అలా చేసేవారు గంగా, గోదావరి, సరస్వతీ, యమునా నదుల పేర్లను మనస్సులో స్మరించి స్నానం చేయాలి. తనకు దగ్గరగా ఉన్న నదిలో ప్రాత్ణకాలంలో పూజ చేయాలి. నదులు అందుబాటులో లేని సమయంలో నూతిలోగానీ, చెరువులో గానీ స్నానం చేయవచ్చు. ఆ సమయంలో కింది శ్లోకాన్ని స్మరించుకోవాలి…

శ్లో|| గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిదింకురు||
”కార్తీక మాస వ్రతం చేసేవారు పగలు పురాణ పఠనం, శ్రవణం, హరికథా కాలక్షేపంతో కాలం గడపాలి. సాయంకాలంలో సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తిచేసుకుని, శివుడిని కల్పోక్తంగా పూజించాలి” అని వివరించారు. అనంతరం కార్తీకమాస శివపూజాకల్పాన్ని గురించి వివరించారు. కార్తీక మాస శివ పూజ కల్పము
1 ఓం శివాయ నమ్ణ ధ్యానం సమర్పయామి
2 ఓం పరమేశ్వరాయ నమ్ణ అవాహం సమర్పయామి
3 ఓం కైలసవాసయ నమ్ణ నవరత్న సంహాసనం సమర్పయామి
4 ఓం గౌరీ నాథాయ నమ్ణ పాద్యం సమర్పయామి
5 ఓం లోకేశ్వరాయ నమ్ణ అర్ఘ్యం సమర్పయామి
6 ఓం వృషభ వాహనాయ నమ్ణ స్నానం సమర్పయామి
7 ఓం దిగంబరాయ నమ్ణ వస్త్రం సమర్పయామి
8 ఓం జగన్నాథాయ నమ్ణ యజ్ఞో పవితం సమర్పయామి
9 ఓం కపాల ధారిణే నమ్ణ గంధం సమర్పయామి
10 ఓం సంపూర్ణ గుణాయ నమ్ణ పుష్పం సమర్పయామి
11 ఓం మహేశ్వరాయ నమ్ణ అక్షతాన్ సమర్పయామి
12 ఓం పార్వతీ నాథాయ నమ్ణ దుపం సమర్పయామి
13 ఓం తేజో రూపాయ నమ్ణ దీపం సమర్పయామి
14 ఓం లోక రక్షాయ నమ్ణ నైవైధ్యం సమర్పయామి
15 ఓం త్రిలోచనాయ నమ్ణ కర్పూర నీరాజనం సమర్పయామి
16 ఓం శంకరాయ నమ్ణ సవర్ణ మంత్ర పుష్పం సమర్పయని
17 ఓం భావయ నమ్ణ ప్రదక్షణ నమస్కారాన్ సమర్పయామి.      
    ఈ ప్రకారం కార్తీకమాసమంతా పూజలు నిర్వహించాలి. శివసన్నిధిలో దీపారాధన చేయాలి. ఈ విధంగా శివపూజ చేసినవారు ధన్యులవుతారు. పూజ తర్వాత తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమర్థన చేసి, దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి. ఇలా చేసినట్లయితే.. నూరు అశ్వమేథాలు, వేయి వాజపేయి యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో నెలరోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిలో నిత్య దీపారాధన, తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షం లభిస్తుంది. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమాచరించనివారు వంద జన్మలు నానాయోనులయందు జన్మించి, ఆ తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలనెత్తుతారు. ఈ వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఆచరించేవారు పదిహేను జన్మల పూర్వజ్ఞానాన్ని పొందుతారు. వ్రతం చేసినా, పురాణం చదివినా, విన్నా అట్టివారు సకలైశ్వర్యాలను పొందుతారు. అంత్యమున మోక్షాన్ని పొందెదరు”.

ఇట్లు స్కాందపురాణాంతర్గతమందలి వశిష్టుడు బోధించిన కార్తీక మహత్యం..పద్నాలుగో అధ్యాయం సమాప్తం
పద్నాలుగో రోజు పారాయణం

తులసీధాత్రీ సమేత శ్రీమహాలక్ష్మీనారాయణపూజ

తులసీధాత్రీ సమేత శ్రీమహాలక్ష్మీనారాయణపూజ
తులసీధాత్రీ_సమేత_శ్రీమహాలక్ష్మీనారాయణపూజ

   శ్రీ మహాలక్ష్మీ నారాయణ స్వరూపిణియైన "తులసి" యొక్క మూలంలో సర్వతీర్ధాలు, మధ్యభాగమందు సమస్త దేవతలు, తులసిమొక్క పైభాగమున సర్వవేదాలతో కొలువైవున్న తులసి మాతకు ముందుగా నమస్కరించుకుని, అంతటి పూజ్యనీయమైన ఆ తులసి ఆవిర్భావ చరిత్ర-తులసి ప్రాశస్త్యమును గూర్చి, మన పురాణములలో ఎన్నో కధలు వున్నాయి.

శ్లో|| యన్మూలే సర్వతీర్ధాని యన్మధ్యే సర్వదేవతా
యదగ్రే సర్వవేదశ్చ తులసీం త్వా నమామ్యహమ్‌ ||

 "బ్రహ్మవైవర్తపురాణ"మందు గల తులసి వృత్తాంతము ఇలా ఉన్నది. ధర్మధ్వజుడు, మాధవి అను దంపతులకు అతిలోక సౌందర్యవతియైన కుమార్తై కలిగినది. వారు ఆ బిడ్డకు "బృంద" అను నామకరణము చేసుకుని అల్లారు ముద్దుగా పెంచుకోసాగిరి. ఆమెకు వివాహవయస్సురాగనే శ్రీహరిని వివాహమాడతలచి బదరికాశ్రమము జేరి బ్రహ్మనుగూర్చి ఘోరముగ తపమాచరించినది. బ్రహ్మదర్శన మిచ్చి నీ కోరిక ఏమిటో చెప్పుమనగా "నేను రాధాశాపముతో నున్న రుక్మిణిని, నాకు శ్రీకృష్ణుడే భర్తగా పొందుటకు"- వరమీయమని ప్రార్ధించినది.
అందులకు బ్రహ్మ ! నీ కోరిక తప్పక నెరవేరగలదు. కాని! ముందుగా గోలోకనివాసి సుదాముడే ముందుగా నీకుభర్త కాగలడు, అనంతరమే నీవు కోరిన వాడే నీకు పతియగును అని వరమిచ్చి అంతర్ధానమయ్యెను.  ఇలా ఉండగా బ్రహ్మదేవుడు చెప్పిన సుదాముడు పుష్కరకాలము శాపకారణముగా భూలోకమున శంఖచూడుడై జన్మించి తపమాచరించసాగెను. అతని తపస్సునకు మెచ్చి బ్రహ్మ ఏమివరము కావాలో కోరుకోమన్నాడు. అంత శంఖ చూడుచు "లక్ష్మీభూలోకమున పుట్టినదట! నాకామెతో వివాహాము చేయించమని వేడుకొనెను" బ్రహ్మ 'తధాస్తు' అని పలికి ఆమె బదరికాశ్రమమున నున్నది. ఆమె నీకు తప్పక లభ్యముకాగలదు అని యంతర్ధానమందెను.
అనంతరము శంఖ చూడుడు బృందవాద ప్రతివాదములను గమనించి అప్పుడు వార్కి మరల బ్రహ్మ ప్రత్యక్షమై వారి వారి అభీష్టములు నెరవేరుటకు వార్కి వైభవముగా వివాహము గావించెను. ఇక శంఖచూడునకు లక్ష్మీయంశతో నున్న భార్య లభ్యమగుసరికి! అష్ట్తెశ్వర్యము లతో తులతూగుచూ అతిసమయము పెంచుకుని స్వర్గాధిపత్యము పొందగోరి దేవరాజ్యమును కొల్లగొట్టి; దేవతలను పలు ఇక్కట్లు పాలు చేయుటయే కాకుండా; పరమేశ్వరుని చెంతకేగి, శివా! నీ భార్య సుందరాంగి. అమెను నాకు వశ్యురాలును చేయుము లేనిచో యుద్ధమునకు తలపడమని ఘోరముగా శివునితో యుద్ధము చేయసాగెను. వెంటనే శ్రీహరి వారిని సమీపించి "శివా! వీడు అజేయుడు అగుటకు కారణం! ఈతని భార్య మహాపతివ్రత. ఆమె పాతివ్రత్య భంగము నేనాచరించదను. నీవు వీనిని వధించుము." యని యుక్తి చెప్పెను. అనంతరము మాయా శంఖచూడుని వేషము ధరించి యున్న శ్రీహరిని చూచి బృంద తన భర్తే వచ్చినాడని భ్రమించి! ఆతనికి సర్వోపచారములుచేసి శ్రీహరి చెంతకు చేరగానే! ఆమె పాతివ్రత్యము భగ్నమగుట గ్రహించి శివుడు శంఖచూడుని సంహరించగా! నాతడు దేహమును విడచి "సుదాముడై" గోలోకమునకు పోయెను. బృంద తన ఎదుట ఉన్నది మాయా శంఖచూడుడని గ్రహించి శ్రీహరిని "శిలారూప మందుదువుగాక" యని శపించగా! తిరిగి ఆమెను నీవు "వృక్షమగుదువుగాక" యని శపించెను. ఆవిధంగా శ్రీహరి గండకీనదిలో సాలగ్రామ శిలగాపుట్టి; బృంద తులసీ వృక్షమై పోయి ఇద్దరూ ప్రపంచముచే పూజనీయస్వరూపములు పొందినట్లుగా బ్రహ్మవైవర్త పురాణగాధ ద్వార విదితమగుచున్నది.
    వృక్షాలన్నిటియందు తులసి శ్రేష్ఠమైనది, శ్రీహరికి ఇది అత్యంత ప్రీతిపాత్రమైనది. "తులసిపూజ" తులసీ స్త్రోత్రం చదవడం, తులసి మొక్కలో పోసిన నీటిని శిరస్సున జల్లుకోవడం, తులసీవనమును పెంచి వాటి మాలలు శ్రీహరికి సమర్పించుట ఎంతో! పుణ్యప్రదమైనవి. గోదాదేవి తులసీవనంలోనే అయోనిజగా విష్ణుచిత్తునింట వెలసి శ్రీరంగనాధుని ఇల్లాలయింది. వశిష్ఠాది మునిగణముచే ఎన్నో విధములుగా స్తోత్రపూర్వకముగా శ్రీహరి తులసీ వనమందు పూజలందుకొని నన్ను "కార్తీక శుద్ధద్వాదశి" నాడు విశేషించి ఎవరు బూజచేయుదురో! అట్టివారి సమస్తయొక్క పాపములు అగ్నిలోపడిన మిడుతలు వలె భస్మమయి వారు తప్పక నా సాన్నిధ్యమును పొందుదురని ప్రతిజ్ఞ చేసెనట!
    శ్లో|| తులసీవ్రత మహాత్మ్యం శ్రోతవ్యం పుణ్యవాంచ్చిన:
    యదిచ్చేద్విష్ణు సాయుజ్యం శ్రోతవ్యం బ్రాహ్మ్ణ్తణ్తెస్సహ
    విష్ణో : ప్రీతిశ్చ కర్తవ్యా శ్రోత వ్యాతులసీకధా
    ద్వాదశ్యాం శ్రవణాత్తస్యా: పునర్జన్మ న విద్యతే.
విష్ణు సాన్నిధ్యముగోరి విష్ణుదేవునకు యేమాత్రమైన ప్రీతి జేయవలయునునని తలచేవారు తులసీ వ్రతమహాత్మ్యము తప్పక వినవలయును. అందునా! ఆ వ్రత కధను "క్షీరాబ్ధిద్వాదశి" రోజున తులసీ కధ వినువార్కి, చదువువార్కి, పూర్వజన్మ కృతమైన దు:ఖములన్నియు తొలగిపోయి విష్ణులోకమును పోందుదురు, అని శంకరునిచే "తులసి" కొనియాడబడినట్లు చెప్పబడినది. అట్టి తులసీ బృందావన మందు ఉసిరిమొక్కతో కలిపి "తులసీధాత్రీ సమేత శ్రీమన్నారాయణుని" ఈ కార్తీక ద్వాదశినాడు పూజించుట ఎంతో విశిష్టమైనదిగా పేర్కొనబడినది. మరియు అట్టి తులసీ దళములకు "నిర్మాల్యదోషం" పూజలో ఉండదని కూడా చెప్పబడినది.
    కావున! మన హిందూమతంలో "తులసి" ఆధ్యాత్మిక దృష్టిలో విశిష్టమైన స్ధానాన్ని పొందింది. తులసిమొక్క హిందువులకు పూజనీయమైనది. కావున హిందువులు ప్రతిఇంటా తులసి మొక్కను కోటలో పెంచి పూజించుట మనం చూస్తూ ఉంటాము. ఇక పట్టణావాసులైతే అంతలో కొంత జాగా ఏర్పరచుకుని, చిన్నచిన్న కుండీల్లోనో, డబ్బాల్లోనో పెంచి పూజిస్తూ ఉంటారు. కావున 'తులసి' ఉన్న ఇల్లు నిత్యకళ్యాణము పచ్చతోరణంతో శోభిల్లుతూ ఉంటుంది.
    ఇక ఈ తులసిని వైద్యపరంగా కూడా చూస్తే! ఆయుర్వేద శాస్త్రంలో 'సప్తతులసి-భరతవాసి' అంటూ తులసిని ఏడువిధాలుగా వివరించబడినది.
అవి:
1.కృష్ణ తులసి              2. లక్ష్మీతులసి
3.రామతులసి            4. నేల తులసి
5. అడవి తులసి         6. మరువ తులసి 
7.రుద్రతులసిగా వివరుస్తారు.
వైద్యపరంగా వాటి అన్నిటికి ఎన్నో అమోఘమైన ఔషధగుణాలతో కూడి ఉంటాయని ఆయుర్వేద శాస్త్రం కొనియాడుతోంది. ప్రతి రోజు ఉదయం రెండు తులసి ఆకులు (కోటలోవికాదు) విడిగా పెంచుకున్న మొక్కలనుండి నమలి మింగితే వార్కి బుద్ధిశక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మరియు అనేక మానసిక రుగ్మతలు నయమవుతాయని; ఇలా ఎన్నో విశేష గుణాలను చెప్తారు.ఇక దాని కాండముతో తయారుచేయబడ (తులసిమాల)కు ఇటు ఆధ్యాతికపరంగా అటు ఆరోగ్యపరంగా ఎన్నోలాభాలు ఉన్నాయిట !  కావున ఈ "క్షీరాబ్దిద్వాదశి" వ్రతాన్ని ఆచరించి ఇటు ఆధ్యాత్మిక సంపదతో పాటు ఆరోగ్య భాగాన్ని పొందుదాం!

సర్వంశివసంకల్పం

Tuesday, November 20, 2018

కార్తీకపురాణం - 13 వ అధ్యాయం

కార్తీకపురాణం - 13 వ అధ్యాయం

కన్యాదాన ఫలం, సువీరచరిత్రము

తిరిగి వశిష్టుడు జనకుడితో ఇలా అంటున్నాడు ”ఓ మహారాజా! కార్తీకమాసంలో ఇంకా విధిగా చేయాల్సిన ధర్మాలు చాలా ఉన్నాయి. వాటిని వివరిస్తాను విను… కార్తీకమాసంలో నదీస్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుడి కుమారుడికి ఉపనయనం చేయడం మరింత ముఖ్యం. ఒకవేళ ఉపనయనానికి అయ్యే ఖర్చు అంతా భరించే శక్తిలేనప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాలు, సంభావనలతో తృప్తిపరిచినా ఫలితం కలుగుతుంది. ఈ విధంగా ఓ పేద బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేసినట్లయితే… ఎంతటి మహాపాపాలైనా తొలగిపోతాయి. ఎన్ని బావులు, చెరువులు తవ్వించినా… పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేస్తే వచ్చే ఫలితానికి సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీకమాసంలో భక్తిశ్రద్ధలతో కన్యాదానం చేసినట్లయితే… తను తరించడమే కాకుండా… తన పితృదేవతలను కూడా తరింపజేసినవారవుతారు. ఇందుకు ఒక వృత్తాంతముంది. చెబుతాను విను…” అని ఇలా చెప్పసాగాడు…

సువీర చరితం

పూర్వం వంగ దేశంలో గొప్ప పరాక్రమ వంతుడు, శూరుడు అయిన ”సువిరు”డను ఒక రాజు ఉండేవాడు. అతనికి రుపవతి అయిన భార్య ఉంది. ఒకసారి అతను శత్రురాజులచే పరాజితుడయ్యాడు. దీంతో అతను భార్యతో కలిసి అరణ్యానికి పారిపోయి, ధన హీనుడై, నర్మదానదీ తీరంలో పర్ణశాల నిర్మించుకుని, కందమూలాలు భక్షిస్తూగడపసాగాడు. కొన్నాళ్లకు అతని భార్య ఒక బాలికను కన్నది. ఆ బిడ్డను అతి గారాబంతో పెంచుచుండేవారు. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు లేకపోయినా… శుక్లపక్ష చంద్రుడి మాదిరిగా రోజురోజూ అభివృద్ధి కాసాగింది. అతిగారాబంతో పెరగసాగింది. అలా రోజులుగడుస్తుండగా… ఆ బాలిక యవ్వనవతియైంది. ఒక దినాన వానప్రస్తుడి కుమారుడు ఆ బాలికను చూసి, అందచందాలకు పరవశుడై, తనకు ఇచ్చి వివాహం చేయమని ఆ రాజును కోరాడు. అందుకా రాజు ”ఓ మునిపుత్రా…! ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రాలు అనుభవిస్తున్నాను. మా కష్టాలు తీరేందుకు కొంత ధనమిచ్చినట్లయితే… నా బిడ్డనిచ్చి పెండ్లి చేస్తానని చెప్పాడు. దాంతో ఆ మునిపుత్రుడు చేతిలో పైసా లేకున్నా… బాలికపై ఉన్న మక్కువతో కుబేరుడిని గురించి ఘోర తపస్సు చేశాడు. కుబేరుడిని మెప్పించి, ధన పాత్ర సంపాదించాడు. రాజు ఆ పాత్రను తీసుకుని, సంతోషించి, తన కుమార్తెను ముని కుమారుడికిచ్చి పెళ్లి చేశాడు. నూతన దంతపతులిద్దరినీ అత్తవారింటికి పంపాడు. అలా మునికుమారుడు తన భార్యను వెంటబెట్టుకుని, తల్లిదండ్రుల వద్దకు వెళ్లి, నమస్కరించి, జరిగిన సంగతిని చెప్పాడు. తన భార్యతో కలిసి సుఖంగా జీవించసాగాడు. అయితే సువీరుడు మునికుమారుడిచ్చిన పాత్రను తీసుకుని, స్వేచ్ఛగా ఖర్చుచేస్తూ… భార్యతో సుఖంగా ఉండసాగాడు. కొంతకాలానికి అతనికి మరో బాలిక జన్మించింది. ఆమెకు కూడా యుక్తవయసు రాగానే, ఎవరికైనా ధనానికి అమ్మాలనే ఆశతో ఎదురుచూడసాగాడు. ఒక సాధువు తపతీ నదీ తీరం నుంచి నర్మదా నదీ తీరానికి స్నానార్థం వస్తుండగా… దారిలో ఉన్న సువీరుడిని కలుసుకున్నాడు… ”ఓయీ! నీవెవరు? నీ ముఖ వర్చస్సు చూస్తే రాజవంశంలో పుట్టినవాడిలా ఉన్నావు. ఈ అడవిలో ఏం చేస్తున్నావు? భార్యాపిల్లలతో ఇక్కడ జీవించడానికి కారణమేమిటి ?” అని ప్రశ్నించాడు. దానికి సువీరుడిలా చెబుతున్నాడు… ”ఓ మహానుభావా! నేను వంగదేశాన్ని పరిపాలించేవాడిని. నా పేరు సువీరుడు. నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించడంతో భార్యాసమేతంగా ఈ అడవిలో నివసిస్తున్నాను. దరిద్రం కంటే కష్టమేది ఉండదు. పుత్రశోకం కంటే దు:ఖం ఉండదు. అలాగే భార్యావియోగం కంటే సంతాపం వేరొకటి లేదు. అందువల్ల రాజ్యభ్రష్టుడనైనా… ఈ కారడవిలో ఉన్నంతలో సంతృప్తి పొందుతూ కుటుంబ సమేతంగా బతుకుతున్నాను. నాకు ఇద్దరు కుమార్తెలు. అందులో మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునకు ఇచ్చి, వాడి వద్ద కొంత దానం తీసుకున్నాను. దాంతో ఇప్పటి వరకు కాలక్షేపం చేస్తున్నాను” అని చెప్పగా… ”ఓ రాజా! నీవు ఎంతటి దరిద్రుడవైనా… ధర్మ సూక్షం ఆలోచించకుండా కన్యను అమ్ముకున్నావు. కన్య విక్రయం మహాపాతకం. కన్యను విక్రయించువాడు అసి పత్రవానమనే నరకాన్ని అనుభవిస్తాడు. ఆ ద్రవ్యాలతో చేసే వ్రతం ఫలించదు. కన్య విక్రయం చేసేవారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపిస్తారు. అలాగే కన్యను ధనమిచ్చి కొని, పెండ్లాడిన వారి గృహస్థధర్మాలు వ్యర్థమగుటయేకాకుండా, అతను మహా నరకం అనుభవిస్తాడు. కన్యను విక్రయించేవారికి ఎలాంటి ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి రాబోయే కార్తీక మాసంలో రెండో కుమార్తెకు శక్తికొలదీ బంగారు ఆభరణాలతో అలంకరించి, సదాచార సంపన్నుడికి, ధర్మబుద్ధిగలవాడికి కన్యాదానం చేయి. అట్లు చేసినట్లయితే గంగాస్నానం, అశ్వమేథయాగ ఫలాలను పొందుతావు. మొదటి కన్యను అమ్మిన పాప ఫలాన్ని తొలగించుకున్న వాడివవుతావు” అని రాజుకు హితోపదేశం చేశాడు. అందుకారాజు చిరునవ్వుతో… ”ఓ మునివర్యా! దేహసుఖం కంటే దానధర్మాలతో వచ్చిన ఫలం ఎక్కువా? తాను బతికుండగానే భార్యాబిడ్డలు, సిరిసంపదలతో సుఖంగా ఉండకుండా, చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కోసం ప్రస్తుతం ఉన్న అవకాశాలను చేతులారా జార విడుచుకోమంటారా? ధనం, బంగారం కలవాడే ప్రస్తుతం లోకంలో రాణించగలడు. కానీ, ముక్కుమూసుకుని, నోరుమూసుకుని, బక్కచిక్కి శల్యమైనవాడిని లోకం గుర్తిస్తుందా? గౌరవిస్తుందా? ఐహిక సుఖాలే గొప్పసుఖాలు. కాబట్టి నా రెండో బిడ్డను నేనడిగతినంత ధనం ఇచ్చే వారికే ఇచ్చి పెండ్లిచేస్తాను. కానీ, కన్యాదానం మాత్రం చేయను” అని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటలకు ఆ సన్యాసి ఆశ్చర్యపడి, తన దారిన తాను వెళ్లిపోయాడు. మరికొన్ని రోజులకు సువీరుడు చనిపోయాడు. వెంటనే యమ భటులు వచ్చి, అతన్ని తీసుకుపోయిరి. యమలోకంలో అసిపత్రవనం అనే నరకంలో పారేశారు. అక్కడ అనేక విధాలుగా బాధించారు. సువీరుడికి పూర్వికుడైన శ్రుతుకీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజల్ని పాలించి, ధర్మాత్ముడై మృతిచెంది, స్వర్గాన్ని పొందాడు. అయితే ఆయన వంశజుడైన సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల శ్రుతుకీర్తి కూడా స్వర్గం నుంచి నరకానికి వచ్చాడు.  అంతట శ్రుతకీర్తి ”నేను ఒకరికి ఉపకారం చేశానే తప్ప అపకారమెన్నడూ చేయలేదు. దానధర్మాలు, యజ్ఞయాగాదులు చేశాను. అయినా.. నాకు ఈ దుర్గతి ఎలా? ” అని నిండు కొలువులో యమధర్మ రాజును ప్రశ్నించాడు. వినయంగా ఇలా చెబుతున్నాడు…” ప్రభూ… నీవు సర్వజ్ఞుడవు. ధర్మమూర్తివి. బుద్ధిశాలివి. ప్రాణకోటిని తరతమ తారతమ్య బేధాలు లేకుండా సమానంగా చూస్తావు. నేనెన్నడూ పాపం చేయలేదు. అయితే నన్ను స్వర్గం నుంచి ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చారు? కారణమేమిటి?” అని ప్రశ్నించాడు. దానికి యమధర్మరాజు శ్రుతకీర్తిని చూచి ”ఓయీ… నీవు న్యాయమూర్తివి. ధర్మజ్ఞుడవే. నీవు ఎలాంటి దూరాచారం చేయలేదు. అయినా… నీ వంశీయుడైన సువీరుడు తన జేష్ఠ పుత్రికను అమ్ముకొన్నాడు. కన్యను అమ్ముకునే వారు, వారి పూర్వికులు ఎంతటి పుణ్యవంతులైనా… నరకాలను అనుభవించక తప్పదు. నీచజన్మలు ఎత్తవలసి ఉంటుంది. నీవు పుణ్యాత్ముడవే. అయితే నీకో మార్గం చెబుతాను. నీకు మానవ శరీరాన్ని ఇస్తాను. నీ వంశీయుడైన సువీరుడికి ఇంకో కుమార్తె ఉన్నది. ఆమె నర్మదానదీ తీరంలో తల్లివద్దే పెరుగుతున్నది. అక్కడకు పోయి, ఆ కన్యను వేద పండితుడు, శీలవంతుడికి కార్తీక మాసంలో సాలంకృతంగా కన్యాదానం చేయి. నీవు, మీవాళ్లు ఆ పుణ్యఫలంతో స్వర్గానికి వెళ్తారు” అని చెప్పాడు. ”పుత్రికాసంతానం లేనివారు తమ ద్రవ్యంతో కన్యాదానంచేసినా, విధిగా ఆంబోతుకు వివాహం చేసినా కన్యాదాన ఫలం వస్తుంది. కావున నీవు భూలోకానికి వెళ్లి నేను చెప్పినట్లు చేయి. ఆ కార్యం కారణంగా పితృగణమంతా తరిస్తారు” అని యముడు సెలవిచ్చెను.
శ్రుతకీర్తి యముడికి నమస్కరించి సెలవు తీసుకుని, నర్మదా నదీతీరంలో ఒక పర్ణకుటీరంలో నివసిస్తున్న సువీరుడి భార్యను, కుమార్తెను చూచి, సంతోషపడి, ఆమెతో అసలు విషయం చెప్పి, కార్తీక మాసంలో సువీరుడి కూతురిని కన్యాదానం చేశాడు. ఆ వెంటనే సువీరుడు, శ్రుతకీర్తి, వారి పూర్వీకులు పాపవిముక్తులై, స్వర్గలోకాన్ని చేరారు.” ఓ జనకమహారాజా! కార్తీకంలో కన్యాదానానికి అంతటి శక్తి ఉంది. అత్యంత పుణ్యఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి కార్తీకమాసంలో కన్యాదానం చేసేవాడు విష్ణుసాన్నిధ్యాన్ని పొందుతాడు” అని వివరించాడు.

ఇతి శ్రీ స్కాంధపురాణాంతర్గత, వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య: త్రయోదశాధ్యాయ సమాప్త:
పదమూడో రోజు పారాయణం

లక్ష్మి దేవి ఎక్కడ ఎక్కడ వుండదు అంటే

లక్ష్మి దేవి ఎక్కడ ఎక్కడ వుండదు అంటే 

లక్ష్మి దేవి ఎక్కడ ఎక్కడ వుండదు అంటే

భగవద్భాక్తులపై కోపగించే వారి గృహంలో లక్ష్మిదేవే కాదు. శ్రీ హరి కుడా ఉండదు. శంఖద్వని వినిపించని చోటా. తులసిని పూజించని చోట. శంఖరుని అర్చించని చోట.బ్రహ్మవేత్తలకు, అతిధులకు భోజన సత్కారాలు జరగని చోట.  లక్ష్మి దేవి నివసించదు. ఇల్లు కళ కళ లాడుతూ ఉండని  చోట. ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టిన చోట. విష్ణువును ఆరాధించకుండ. ఏకాదశి మరియు జన్మాష్టమి రోజులలో భోజనం చేసేవారి ఇంట లక్ష్మి నివసించదు. హృదయములో పవిత్రత లోపించిన, ఇతరులను హింసింస్తున్న. ఉత్తములను నిందిస్తున్న లక్ష్మి ఆ ఇంటిలోనుంచి పారిపోతుంది. అనవసరం గా గడ్డిపరకలను తెంచిన. చెట్లను కులగొట్టినా లక్ష్మి కటాక్షం లోపిస్తుంది. నిరాసావాధులను, సుర్యోదయ సమయంలో భోజనం చేసే వాని, తడి పాదాలతో నిద్రపోయేవారిని, వివస్త్రులై నిద్రపోయేవారిని, తలక్రిందులుగా మాట్లాడేవారిని, తమ తలకు రాసుకున్న నూనెను ఇతరులకు అంటించే వారిని కుడా లక్ష్మి వరించదు.పసుపక్షులను హింసించే చోట వుందనే వుండదు.సంపద మీద దురాస ఎక్కువగా కలవారి ఇంట వుండదు.
మరి లక్ష్మీ దేవి ఎక్కడ ఎక్కడ వుంటుంది అంటే :

శ్రీహరి దివ్యచరిత్ర, గుణగానం జరిగే చోట, సాలగ్రామం, తులసి, శంఖద్వని ఉన్నచోట , లక్ష్మి విరజిల్లుతుంది.

ఇలా శ్రీ హరి లక్ష్మీకటాక్షం ఎలా కలుగుతుందో, ఎలాకలగాదో చెప్పారు. అన్నిటి కంటే సంతృప్తి కి మించిన ధనం  ఎక్కువలేదు. దానితోనే సంతోషము కలుగుతుంది.  అప్పుడు ఎల్లవేళ  శ్రీ మహా లక్ష్మి కరుణ మనతోనే వుంటుంది. సంపద మన ఆదీనం లో ఉండాలి కాని, మనం సంపద ఆదీనం లో ఉండకూడదు. ఏకాస్త గర్వించిన, అహంకరము చూపిన  ఐశ్వర్యం జారిపోతుంది. సద్వినియోగమే సంపద పరమార్ధము. అది విస్మరించినా లక్ష్మి వీడిపోతుంది. ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం.  ఈరోజు ధనత్రయోదశి.  అందరకు ఇష్టమైన ధనలక్ష్మి కరుణ,  అనుగ్రహము కలగాలని కోరుకుంటున్నాను.

Monday, November 19, 2018

కార్తీకపురాణం 12 వ అధ్యాయం

కార్తీకపురాణం 12 వ అధ్యాయం

ద్వాదశి ప్రశంస, సాలగ్రామదాన మహిమ.
వశిష్టుడు తిరిగి ఇలా చెబుతున్నాడు… ”ఓ జనక మహారాజా! కార్తీక మాసంలో కార్తీక సోమవారం, కార్తీక ద్వాదశి, సాలగ్రామ మహిమలను గురించి వివరిస్తాను విను…” అని ఈ విధంగా చెప్పసాగాడు. ”కార్తిక సోమవారం రోజు పొద్దున్నే నిద్రలేచి, రోజువారీ విధులు నిర్వర్తించుకుని, నదికి వెళ్లి, స్నానం చేయాలి. ఆ తర్వాత శక్తికొద్దీ బ్రాహ్మణులకు దానమిచ్చి, ఆరోజంతా ఉపవాసముండాలి. సాయంకాలం శివాలయానికి గానీ, విష్ణువాలయానికి గానీ వెళ్లి, పూజించాలి. నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం భుజించాలి. ఈ విధంగా చేసేవారికి సకల సంపదలు కలగడమే కాకుండా, మోక్షం లభిస్తుంది. కార్తిక మాసంలో శనిత్రయోదశి గనక వస్తే… ఆ వ్రతం ఆచరిస్తే నూరు రెట్ల ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశిరోజున పూర్తిగా ఉపవాసం ఉండి, ఆ రాత్రి విష్ణువాలయానికి వెళ్లి, శ్రీహరిని మనసారా ధ్యానించి, ఆయన సన్నిధిలో పురాణ కాలక్షేపం చేసి, మర్నాడు బ్రాహ్మణ సమారాధన చేసినట్లయితే.. కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. ఈ విధంగా చేసినవారు సూర్యగ్రహణ సమయంలో గంగానదిలో స్నానం చేసినట్లయితే… కోటి మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసినదానికంటే అధిక ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ధ ద్వాదశినాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుంచి లేస్తాడు కాబట్టి, ఆ రోజు విష్ణువుకు అమిత ఇష్టమైన రోజు. ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి, ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి, దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చినట్లయితే… ఆ ఆవు శరీరంలో ఎన్ని రోమాలున్నాయ… అన్నేళ్లు వారు ఇంద్రలోక ప్రాప్తి పొందగలరు. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమిరోజున కంచుపాత్రలో ఆవునేతిని పోసి, దీపముంచిన వారు పూర్వజన్మలో చేసిన సకల పాపాలను పోగొట్టుకుంటారు. ద్వాదశిరోజు యజ్ఞోపవీతాలను దక్షిణతో బ్రాహ్మణుడికి దానమిచ్చినవారు ఇహపర లోకాల్లో సుఖాలను పొందగలరు. ద్వాదశిరోజున బంగారు తులసి చెట్టును, సాలగ్రామాన్ని బ్రాహ్మణుడికి దానమిచ్చిన నాలుగు సముద్రాల మధ్య ఉన్న భూమిని దానం చేసినంత ఫలితం కలుగుతుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథ ఉంది. చెబుతాను… శ్రద్ధగా ఆలకించు….” అని ఇలా చెప్పసాగాడు.
సాలగ్రామ దాన మహిమ
పూర్వము అఖండ గోదావరి నదీ తీరంలోని ఒక గ్రామంలో ఒక వైశ్యుడు నివసించేవాడు. వాడు దురాశపరుడై, నిత్యం డబ్బుగురించి ఆలోచించేవాడు. తాను అనుభవించకుండా, ఇతరులకు పెట్టకుండా, బీదలకు అన్నదానం, ధర్మాలు చేయకుండా, ఎప్పుడూ పర నిందలతో కాలం గడిపేవాడు. తానే గొప్ప శ్రీమంతుడినని విర్రవీగుచుండేవాడు. పరుల ధనం ఎలా అపహరించాలా? అనే ఆలోచనలతోనే కాలం గడిపేవాడు. అతడొకరోజు తన గ్రామానికి దగ్గర్లో ఉన్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుడికి తన వద్ద ఉన్న ధనాన్ని పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాడు. మరి కొంత కాలానికి తన సొమ్ము అడగగా… ఆ బ్రాహ్మణుడు ”అయ్యా! మీకు రావాల్సిన మొత్తాన్ని నెలరోజుల్లో ఇస్తాను. మీ రుణం తీర్చుకుంటాను. ఈ జన్మలో కాకున్నా… వచ్చే జన్మలో ఒక జంతువుగా పుట్టి అయినా… మీ రుణం తీర్చుకుంటాను” అని వేడుకొన్నాడు. దానికి ఆ వైశ్యుడు ”అలా వీల్లేదు. ఇప్పుడు నా సొమ్ము నాకిచ్చేయి. లేకపోతే నీ తలను నరికి ఇవ్వు” అని ఆవేశం కొద్దీ వెనకా ముందూ వెనకా ఆలోచించకుండా కత్తితో ఆ బ్రాహ్మణుడి కుత్తుకను కోశాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకుని చనిపోయాడు. దాంతో ఆ వైశ్యుడు భయపడి, అక్కడే ఉన్న రాజభటులు పట్టుకుంటారని భయపడి తన గ్రామానికి పారిపోయాడు. బ్రాహ్మణ హత్య మహాపాతకం కాబట్టి, అప్పటి నుంచి ఆ వైశ్యుడికి బ్రహ్మహత్యాపాపం ఆవహించింది. కుష్టువ్యాధి కలిగి నానా బాధలు పడుతూ కొన్నాళ్లకు చనిపోయాడు. వెంటనే యమదూతలు అతన్ని తీసుకుపోయి, రౌరవాది నరక కూపాల్లో పారేశారు. ఆ వైశ్యుడికి ఒక కొడుకున్నాడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరుకు తగ్గట్లుగానే తండ్రి సంపాదించిన ధనాన్ని దాన ధర్మాలకు వెచ్చించేవాడు. పుణ్యకార్యాలు ఆచరించేవాడు. నీడ కోసం చెట్లు నాటించడం, బావులు, చెరువులు తవ్వించడం చేశాడు. సకల జనులను సంతోషపెడుతూ మంచి కీర్తిని సంపాదించాడు. ఇలా ఉండగా… కొంతకాలానికి త్రిలోక సంచారి అయిన నారదుడు యమలోకాన్ని దర్శించి, భూలోకంలో ధర్మవీరుడి ఇంటికి వెళ్లాడు. ధర్మవీరుడు నారదమహర్షిని సాదరంగా ఆహ్వానించి, అర్ఘ్య పాద్యాదులు అర్పించాడు. చేతులు జోడించి ”ఓ మహానుభావా…! నా పుణ్యం కొద్ది నాకు మీ దర్శనం లభించింది. నేను ధన్యుడను. నా జన్మ తరించింది. నా ఇల్లు పావనమైంది. శక్తి కొలది నేను ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించండి” అని వేడుకొన్నాడు. అంతట నారదుడు చిరునవ్వు నవ్వుతూ… ”ఓ ధర్మవీరా! నేను నీకొక హితోపదేశం చేయాలని వచ్చాను. శ్రీ మహావిష్ణువుకు కార్తీకమాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన రోజు. ఆరోజున స్నాన, దాన, జపాదులు ఏవి చేసినా… అత్యంత ఫలం కలుగుతాయి. నాలుగు జాతులలో ఏ జాతివారైనా… స్త్రీ పురుషులనే బేదం లేకుండా… దొంగ అయినా, దొర అయినా, పతివ్రత అయినా, వ్యభిచారిణి అయినా… కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులా రాశిలో ఉండగా… నిష్టతో ఉపవాసముండాలి. సాలగ్రామదానం చేయాలి. అలా చేసినవారు తండ్రి రుణం తీర్చుకుంటారు. ఈ వ్రతం వల్ల కిందటి జన్మ, ఈ జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి. నీ తండ్రి యమలోకంలో మహానరక బాధలు అనుభవిస్తున్నాడు. అతన్ని ఉద్దరించేందుకు నీవు సాలగ్రామదానం చేయక తప్పదు.” అని చెప్పాడు. అంతట ధర్మవీరుడు నారదమహామునితో… ”మునివర్యా! నేను గోదానం, భూదానం, హిరణ్యదానం మొదలగు మహాదానాలన్నీ చేశాను. అలాంటి దానాలు చేసినా నా తండ్రి మోక్షాన్ని పొందకుండా నరకానికి వెళ్లినప్పుడు… ఈ సాలగ్రామ దానం చేస్తే ఆయన ఎలా ఉద్దరింపబడతాడు?” అని చెప్పాడు. అతని అవివేకానికి విచారించిన నారదుడు ఇలా చెబుతున్నాడు ”ఓ వైశ్యుడా! సాలగ్రామం శిలామాత్రమే అనుకుంటున్నావా? అది శిలకాదు. శ్రీహరి రూపం. అన్ని దానాల్లో సాలగ్రామదానం వల్ల కలిగే ఫలం గొప్పది. నీ తండ్రి నరక బాధ నుంచి విముక్తి పొందాలంటే ఈ దానం తప్పదు. మరో మార్గం లేదు” అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ధర్మవీరుడు ధనబలంతో సాలగ్రామ దానం చేయలేదు. కొంతకాలానికి అతను చనిపోయాడు. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టడం వల్ల అతను ఏడు జన్మలు పులిగా, మూడు జన్మలు కోతిగా, అయిదు జన్మలు ఎద్దుగా పుట్టి, పది జన్మలు స్త్రీగా పుట్టాడు. ఆ తర్వాత పది జన్మలు పందిగా జన్మించాడు. ఆ తర్వాత ఓ పేదబ్రాహ్మణుడి ఇంట్లో స్త్రీగా పుట్టాడు. ఆమె యవ్వనవతి అవ్వగానే… ఓ విధ్వంసుడికి ఇచ్చి పెండ్లి చేశారు. పెళ్లయిన కొంతకాలానికే ఆమె భర్త చనిపోయాడు. చిన్నతనంలోనే ఆమెకు అష్టకష్టాలు సంభవించాయి. తల్లిదండ్రులు, బంధువులు ఆమెను చూసి దు:ఖించసాగారు. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందుకు కలిగిందో తెలుసుకునేందుకు తన దివ్యదృష్టిని ఉపయోగించాడు. ఆ తర్వాత ఆమెతో సాలగ్రామ దానం చేయించాడు. ”నాకు బాలవైదవ్యం కారణమైన పూర్వజన్మ పాపాం నశించుగాక” అని సాలగ్రామ దానఫలాన్ని ధారబోయించాడు. ఆ రోజు కార్తీక సోమవారం కావడం వల్ల దాని ఫలంతో ఆమె భర్త పునర్జీవించాడు. పిదప ఆ నూతన దంపతులు చిరకాలం అన్యోన్యంగా మెలిగారు. ఆ తర్వాతి జన్మలో ఆమె మరో బ్రాహ్మడి ఇంట్లో కుమారుడిగా జన్మించాడు. నిత్యం సాలగ్రామ దానం చేస్తూ ముక్తిని పొందాడు. ”కాబట్టి ఓ జనక మహారాజా! శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసినట్లయితే… ఆ ఫలితం ఇంత అని చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ఆ సాలగ్రామ దానాన్ని నిత్యం ఆచరిస్తూ ఉండు” అని సెలవిచ్చాడు.


ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి పన్నెండవ అధ్యాయము
పన్నెండవ రోజు పారాయణము సమాప్తము.

Sunday, November 18, 2018

కార్తీకపురాణం 11వ అధ్యాయం

కార్తీకపురాణం 11వ అధ్యాయం

మంథరుడు - పురాణ మహిమ

తిరిగి వశిష్టుడు ఇలా చెబుతున్నారు… ”ఓ జనక మహారాజా! ఈ కార్తిక మాస వ్రతం మహత్యాన్ని గురించి ఎన్నో ఉదాహరణలు చెప్పాను. ఇంకా దీని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. ఈ నెలలో విష్ణుదేవుడిని అవిసె పూలతో పూజించినట్లయితే.. చాంద్రాయణ వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది. విష్ణు అర్చన తర్వాత పురాణ పఠనం చేసినా, చేయించినా, విన్నా, వినిపించినా… అలాంటి వారు వైకుంఠాన్ని పొందుతారు. దీన్ని గురించిన మరో ఇతిహాసాన్ని చెబుతాను. సావధానంగా విను… అని ఇలా చెప్పసాగారు…పూర్వము కళింగ రాజ్యంలో మంధరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఇతరుల ఇళ్లలో వంటలు చేస్తూ, అక్కడే భోజనం చేస్తూ, మద్యమాంసాలను సేవిస్తూ… తక్కువ జాతి సాంగత్యంలో గడపసాగాడు. ఆ కారణంగా స్నాన, జప, దీపారాధనలను పాటించకుండా, దురాచారుడిగా తయారయ్యాడు. అయితే… ఆయన భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతవంతురాలు, భర్త ఎంతటి దుర్మార్గుడైనా, పతియే ప్రత్యక్ష దైవమనే ధర్మాన్ని పాటించేది. విసుగు చెందక సకల ఉపచారాలు చేసేది. పతివ్రతాధర్మాన్ని నిర్వర్తిస్తుండేది. మంథరుడు ఇతరుల ఇళ్లలో వంటలు చేస్తూ, ఆదాయం సరిపోక వర్తకం కూడా చేయసాగాడు. అఖరికి దానివల్ల కూడా పొట్టగడవకపోవడంతో దొగతనాలు చేయడం ఆరంభించాడు. దారికాచి బాటసారుల్ని బెదిరించి, వారిదగ్గర ఉన్న ధనం, వస్తువులను అపహరించి జీవించసాగాడు. ఒక రోజు ఒక బ్రాహ్మణుడు అడవిదారిలో పోతుండగా… అతన్ని భయపెట్టి, కొంత ధనాన్ని అపహరించాడు. ఆ సమయంలో ఇద్దరిమధ్యా ముష్టియుద్ధం జరిగింది. అంతలో అక్కడకు ఇంకో కిరాతకుడు వచ్చి, ధనాశతో వారిద్దరినీ చంపేసి, ధనాన్ని తీసుకెళ్లాడు. అంతలో అక్కడ ఒక గుహ నుంచి పులి గాండ్రించుకుంటూ కిరాతకుడిపైన పడింది. కిరాతకుడు దాన్ని కూడా వధించాడు. అయితే పులి చావడానికి ముందు పంజాతో బలంగా కొట్టిన దెబ్బ ప్రభావం వల్ల కొంతసేపటికి తీవ్ర రక్తస్రావంతో అతనుకూడా చనిపోయాడు. కొద్దిక్షణాల వ్యవధిలో చనిపోయిన బ్రాహ్మడు, మంథరుడు, కిరాతకుడు నరకానికి వెళ్లారు. హత్యల కారణంగా వారంతా నరకంలో నానావిధాలైన శిక్షలను అనుభవించారు. మంధరుడు చనిపోయిన రోజు నుంచి అతని భార్య నిత్యం హరినామ స్మరణం చేస్తూ సదాచారవర్తినిగా భర్తను తలచుకుంటూ కాలం గడిపింది. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక రుషి రాగా… ఆమె గౌరవంగా అర్ఘ్యపాద్యాలను పూజించి ”స్వామీ! నేను దీనురాలను, నాకు భర్తగానీ, సంతతిగానీ లేదు. నేను సదా హరి నామాన్ని స్మరిస్తూ జీవిస్తున్నాను. నాకు మోక్షం లభించే మార్గం చూపండి” అని ప్రార్థించింది. ఆమె వినమ్రత, ఆచారాలకు సంతసించిన ఆ రుషి ”అమ్మా… ఈరోజు కార్తీక పౌర్ణమి. చాలా పవిత్రమైనది. ఈ రోజును వృథాచేయకు. ఈ రాత్రి దేవాలయంలో పురాణాలు చదువుతుఆరు. నేను చమురుతీసుకుని వస్తాను. నువ్వు ప్రమిదలు, వత్తులు తీసుకుని రా. దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలితాన్ని నీవు అందుకుంటావు” అని చెప్పారు. దానికి ఆమె సంతసించి, వెంటనే దేవాలయానికి వెళ్లి శుభ్రం చేసి, గోమయంతో అలికి, ముగ్గులు పెట్టి, తానే స్వయంగా వత్తి చేసి, రెండు వత్తులు వేసి, రుషి తెచ్చిన నూనెను ప్రమిదలో పోసి, దీపారాధన చేసింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లి తనకు కనిపించిన వారిని ”ఈ రోజు ఆలయంలో జరిగే పురాణ పఠనానికి తప్పకుండా రావాలి” అని ఆహ్వానించింది. ఆమె కూడా రాత్రి పురాణం విన్నది. ఆ తర్వాత కొంతకాలం విష్ణునామస్మరణతో జీవించి, మరణించింది. ఆమె పుణ్యాత్మురాలవ్వడం వల్ల విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠానికి తీసుకెళ్లారు. అయితే ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వల్ల కొంచెం దోషం కలిగింది. కొద్ది నిమిషాలు నరకంలో గడపాల్సి వచ్చింది. దీంతో మార్గమధ్యంలో యమలోకానికి తీసుకెళ్లారు. అక్కడ నరకంలో మరో ముగ్గురితో కలిసి బాధపడుతున్న భర్తను చూసి ఒక్క క్షణం దు:ఖించింది. విష్ణుదూతలతో ”ఓ విష్ణుదూతలారా! నా భర్త, ఆయనతోపాటు మరో ముగ్గురు నరకబాధలు అనుభవిస్తున్నారు. వారిని ఉద్దరించడమెలా?” అని కోరగా… విష్ణుదూతలు ఇలా చెబుతున్నారు.. ”అమ్మా.. నీ భర్త బ్రాహ్మణుడై కూడా స్నానసంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. రెండోవ్యక్తి కూడా బ్రాహ్మనుడే అయినా… ధనాశతో ప్రాణమిత్రుడిని చంపి ధనం అపహరించాడు. మూడోవాడు పులిజన్మను పూర్తిచేసుకున్నవాడు కాగా నాలుగో కిరాతకుడు. అతను అంతకు ముందు జన్మలో బ్రాహ్మణుడే” అని చెప్పారు. అతను అనేక అత్యాచారాలు చేసి, ద్వాదశిరోజున మధుమాంసాలను భక్షించి పాతకుడయ్యాడు. అందుకే వీరంతా నరకబాధలు పడుతున్నారని చెప్పారు. విష్ణుదూతలు చెప్పినది విని ఆమె దు:ఖించి ”ఓ పుణ్యాత్ములారా! నా భర్తతోపాటు మిగతా ముగ్గురిని కూడా ఉద్దరించే మార్గముందా?” అని ప్రార్థించింది. దీంతో విష్ణుదూతలు ”అమ్మా! కార్తీక శుద్ధ పౌర్ణమినాడు నీవు వత్తి చేసిన పుణ్యఫలాన్ని ధారపోస్తే వారు నరక బాధల నుంచి విముక్తులవుతారు” అని చెప్పారు. దీంతో ఆమె అదేవిధంగా తన పుణ్యఫలాన్ని ధారపోసింది. దీంతో వారంతా ఆమెతో కలిసి మిగతా నలుగురూ వైకుంఠానికి విమానమెక్కి విష్ణుదూతలతో బయలుదేరారు.
”ఓ జనక మహారాజా! చూశావా? కార్తీకమాసంలో పురాణాలు వినడం, దీపం వెలిగించడం వంటి ఫలితాలు ఎంతటి పుణ్యాన్నిస్తాయో?” అని వశిష్టులు మహారాజుకు చెప్పారు.


ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి పదకొండొవ అధ్యాయము
పదకొండొవ రోజు పారాయణము సమాప్తము.

కార్తీకపురాణం - 10 అధ్యాయం

కార్తీకపురాణం - 10 అధ్యాయం
అజామీళుని జన్మ వృత్తాంతం

అజామీళుని వృత్తాంతమంతా విన్న జనక మహారాజు వశిష్టుడితో ఇలా అడుగుతున్నారు… ”ఓ మహానుభావా.. అజామీళుడు ఎంతటి నీచుడైనా అంత్యకాలాన నారాయణ మంత్ర పఠనంతో విష్ణుసాన్నిధ్యాన్ని పొందిన తీరును చక్కగా వివరించారు. అయితే నాకో చిన్న సంశయం. గత జన్మ కర్మ బంధాలు ఈ జన్మలో వెంటాడుతాయన్నట్లు అజామీళుడు కూడా గత జన్మలో చేసుకున్న కర్మలే ఆయనకు మోక్షాన్ని కల్పించాయా?” అని ప్రశ్నించారు.. దానికి మునివర్యులు ”ఓ జనక మహారాజా! నీకు వచ్చిన సందేహమే యమదూతలకు కూడా వచ్చింది. ఆ వృత్తాంతం… అజామీళుడి జన్మ వృత్తాంతం చెబుతాను విను” అని ఇలా చెప్పసాగారు…
అజామీళుని విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకెళ్లాక యమ కింకరులు ధర్మరాజు వద్దకు వెళ్లారు. ”ప్రభూ! మీ ఆజ్ఞ ప్రకారం అజామీళుడిని తీసుకొచ్చేందుకు వెళ్లాం. అక్కడకు విష్ణుదూతలు వచ్చి, మాతో వాదించి అతన్ని పట్టుకెళ్లారు. చేసేది లేక మేము వట్టిచేతులతో తిరిగి వచ్చాం” అని భయకంపితులై విన్నవించుకున్నారు.
”అరెరె…! ఎంత పని జరిగింది? ఇంతకు ముందెన్నడూ ఇలా కాలేదే? దీనికి బలమైన కారణం ఉండొచ్చు” అని తన దివ్యదృష్టితో అజామీళుడి పూర్వజన్మ వృత్తాతం తెలుసుకున్నాడు. ”ఆహా…! అదీ సంగతి. నారాయణ మంత్రంతో అతను విష్ణుసాన్నిధ్యాన్ని పొందాడు” అని అతని పూర్వజన్మ వృత్తాతం చెప్పసాగాడు.
అజామీళుడు పూర్వజన్మలో మహారాష్ట్రలోని ఒక శివాలయంలో అర్చకుడిగా ఉండేవాడు. అతను అపురైపమైన అందం, సిరిసంపదలు, బలగర్వంతో శవారాధన చేయకుండా ఆలయానికి వచ్చే ధనాన్ని దొంగతనం చేస్తుండేవాడు. శివుడికి ధూపదీప నైవేద్యాలు పెట్టకుండా, దుష్ట సహవాసాలు మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండేవాడు. ఒక్కోసారి శివుడికెదురుగా పాదాలు పెట్టి పడుకునేవాడు. అతనికి ఓ పేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఏర్పడంది. ఆమె కూడా అందమైనది కావడంతో ఆమె భర్త చూసీచూడనట్లు వ్యవహరించేవాడు. అతను భిక్షాటనకు ఊరూరూ తిరుగుతూ ఏదో ఒకవేళకు ఇంటికి వచ్చేవాడు. ఒకనాడు పొరుగూరికి వెళ్లి, యాచన చేసిన బియ్యం, కూరలు నెత్తినబెట్టుకుని వచ్చి అలసటతో… ”నాకు ఈరోజు ఆకలి తీవ్రంగా ఉంది. త్వరగా వంటచేసి, వడ్డించు” అని భార్యను ఆజ్ఞాపించాడు. ఆమె అందుకు చీదరించుకుని, నిర్లక్ష్యంతో కాళ్లు కడుగుకొనేందుకు నీళ్లు కూడా ఇవ్వలేదు. అతని వంక కన్నెత్తైనా చూడలేదు. తన ప్రియుడిపై మనస్సుగలదై భర్తను నిర్లక్ష్యం చేసింది. ఇది భర్త కోపానికి దారి తీసింది. దీంతో అతను కోపంతో ఓ కర్రతో బాదాడు. ఆమె ఆ కర్రను లాక్కొని, భర్తను రెండింతలు ఎక్కువ కొట్టి, ఇంటి బయట పారేసి, తలుపులు మూసేసింది. అతను చేసేదిలేక, భార్యపై విసుగు చెంది, దేశాటనకు వెళ్లిపోయాడు. భర్త ఇంటినుంచి వెళ్లిపోవడంతో సంతోషించిన ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుమీద కూర్చుంది.
అటుగా వెళ్తున్న ఓ రజకుడిని పిలిచి… ”ఓయీ… నువ్వు ఈ రాత్రికి నా దగ్గరకు రా. నా కోరిక తీర్చు” అని కోరింది. దానికి అతను ”అమ్మా! నువ్వు బ్రాహ్మణ పడతివి. నేను రజకుడిని. మీరు అలా చేయడం ధర్మం కాదు. నేను ఆ పాపపు పనిని చేయలేదు” అని బుద్ధి చెప్పి వెళ్లిపోయాడు. ఆమె ఆ రజకుడి అమాయకత్వానికి లోలోపల నవ్వుకుని, ఆ గ్రామ శివార్చకుడి (అజామీళుడి పూర్వజన్మ) దగ్గరకు వెళ్లింది. వయ్యారాలు వలుకబోస్తూ… తన కామవాంఛ తీర్చమని పరిపరివిధాలా బతిమాలింది. ఆ రాత్రంతా అతనితో గడిపింది. ఉదయం ఇంటికి తిరిగి వచ్చి… ”అయ్యో! నేనెంతటి పాపానికి ఒడిగట్టాను? అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను వెళ్లగొట్టి, క్షణికమైన కామవాంఛకు లోనై… మహాపరాధం చేశాను” అని పశ్చాత్తాపపడింది. ఒక కూలీవాడిని పిలిచి, కొంత ధనమిచ్చి, తన భర్తను వెతికి తీసుకురమ్మని పంపింది. కొన్ని రోజులు గడిచాక ఆమె భర్త ఇంటికి తిరిగిరాగా… పాదాలపై పడి తన తప్పులను క్షమించమని వేడుకుంది. అప్పటి నుంచి మంచి నడవడికతో భర్త అనురాగాలను సంపాదించింది.
కొంతకాలానికి ఆమెతో కామక్రీడలో పాల్గొన్న శివార్చకుడు వింత వ్యాధితో రోజురోజుకీ క్షీణిస్తూ మరణించాడు. అతను రౌరవాది నరకాల బారిన పడి, అనేక బాధలు అనుభవించి, మళ్లీ నరజన్మ ఎత్తాడు. సత్యవ్రతుడనే బ్రాహ్మణోత్తముని కొడుకుగా పుట్టాడు. గత జన్మలో ఆ బ్రాహ్మణుడు చేసిన కార్తీక స్నానాల వల్ల అతనికి తిరి బ్రాహ్మణ జన్మ ప్రాప్తించింది. అతనే అజామీళుడు. ఇక ఆ బ్రాహ్మణ మహిళకూడా కొంతకాలానికి చనిపోయి, అనేక నరకబాధలు అనుభవించింది. ఆ తర్వాత ఓ హరిజనుడి ఇంట పుట్టింది. ఆమె జాతకం ప్రకారం తండ్రికి గండం ఉందని తేలడంతో… అతను ఆమెను అడవిలో వదలగా… అక్కడ ఒక ఎరుకలవాడు ఆమెను పెంచాడు. ఆ అమ్మాయే పెరిగి, పెద్దదై అజామీళుడిని మోహించింది. కులాలు వేరుకావడంతో కులసంకరం చేసి, ఇద్దరూ కలిసిపోయారు. అజామీళుడు ఈ జన్మలో కులసంకరం చేసినా… కేవలం అంత్యకాలాన నారాయణ మంత్రం పఠించినందుకు ఆయన విష్ణుసాన్నిధ్యాన్ని పొందాడని యమధర్మరాజు యమభటులకు వివరించిన తీరును జనక మహారాజుకు వశిష్టుడు చెప్పెను.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి పదవ అధ్యాయము
పదవ రోజు పారాయణము సమాప్తము.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Friday, November 16, 2018

కార్తీకపురాణం - 9 అధ్యాయం

కార్తీకపురాణం - 9 అధ్యాయం

కార్తీకపురాణం - 9 అధ్యాయం

విష్ణు దూతలు-యమదూతల వివాదం

అజామీళుడిని తీసుకెళ్తున్న విష్ణుదూతలతో యమదూతలు వాగ్వాదానికి దిగారు. విష్ణుదూతలిలా అంటున్నారు… ”ఓయీ యమదూతలారా. మేం విష్ణు దూతలం. వైకుంఠం నుంచి వచ్చాం. మీ ప్రభువైన యముడు ఎవరిని తీసుకురమ్మని మిమ్మల్ని పంపాడు?” అని ప్రశ్నించారు. దానికి వారు ”ఓ విష్ణుదూతలారా… మానవుడు చేసే పాపపుణ్యాలకు సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం, ధనంజయాది వాయువులు, రాత్రింబవళ్లు, సంధ్యాకాలం సాక్షులుగా ఉండి, ప్రతిరోజూ మా ప్రభువుకు విన్నవించుకుంటారు. మా ప్రభువు వారి కార్యకలాపాలను చిత్రగుప్తుడి ద్వారా మాకు చూపించి, ఆ మనిషి అవసానదశలో మమ్మల్ని పంపుతారు” అని చెప్పుకొచ్చారు. పాపుల గురించి విష్ణుదూతలకు యమదూతలు ఇలా వివరిస్తున్నారు… ”అయ్యా… అసలు పాపులు అనే పదానికి నరకంలో ప్రత్యేక నిర్వచనాలున్నాయి. వేదోక్త సదాచారములు విడిచి వేద శాస్త్రములు నిందించు వారు, గోహత్య, బ్రహ్మ హత్యాది మహాపాపాలు చేసినవారు, పర స్త్రీలను కామించిన వారు, పరాన్న భుక్కులు, తల్లిదండ్రులను – గురువులను – బంధువులను- కుల వృతిని తిట్టి హింసించు వారు, జీవ హింస చేయు వారు, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పిడించు వారును, జారత్వం చొరత్వంచే భ్రష్టులగు వారు, ఇతరుల ఆస్తిని స్వాహా చేయు వారును, చేసిన మేలు మరచిన కృతఘ్నులు, పెండిండ్లు శుభ కార్యములు జరగనివ్వక అడ్డుతగిలే వారు పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమ ధర్మరాజు గారి ఆజ్ఞ” అని చెప్పుకొచ్చారు. తమ సంవాదానిన కొనసాగిస్తూ… ”ఈ అజామీళుడు బ్రాహ్మణుడై పుట్టి, దురాచారాలకు లోనై, కులభ్రష్టుడై జీవ హింసలు చేసి, కామాంధుడి ప్రవర్తించాడు. వావి వరసలు లేకుండా కూతురువరస యువతితో సంబంధం పెట్టుకున్న పాపాత్ముడు. వీడిని విష్ణులోకానికి ఎలా తీసుకెళ్తారు?” అని ప్రశ్నించగా… విష్ణుదూతలిలా చెబుతున్నారు. ”ఓ యమకింకరులారా! మీరెంత అవివేకులు? మీకు సూక్షధర్మాలు తెలియవు. ధర్మసూక్షాలు ఎలా ఉంటాయో చెబుతాం వినండి. సజ్జనులతో సహవాసము చేయువారు, జపదాన ధర్మములు చేయువారు- అన్నదానం, కన్యాదానం, గోదానం, సాలగ్రామ దానం చేయువారు, అనాథ ప్రేత సంస్కాములు చేయువారు, తులసి వనము పెంచువారు, తటాకములు తవ్వించువారు, శివ కేశవులను పూజించు వారు, సదా హరి నామ స్మరణ చేయువారు, మరణ కాలమందు ‘నారాయణా’యని శ్రీహరిని గాని, ‘శివ’ అని ఆ పరమశివుని గాని స్మరించు వారు, తెలిసిగాని తెలుయక గాని మరే రూపమున గాని హరి నమ స్మరణ చెవిన బడిన వారును పుణ్యాత్ములు! కాబట్టి అజా మీళుడు ఎంత పాపత్ముడైనాను మరణకాలమున ‘నారాయణా’అని పలికాడు” అందుకే విష్ణుసాన్నిద్ధ్యానికి అతను అన్నివిధాలా అర్హుడు” అని వివరించారు. అజామీళుడికి విష్ణుదూతల సంభాషణ ఆశ్చర్యాన్ని కలిగించింది. ”ఓ విష్ణుదూతలారా! పుట్టిన నాటి నుంచి నేటి వరకు శ్రీమన్నారాయణ పుజగాని వ్రతములు గాని, ధర్మములుగాని చేసి యెరుగను. నవ మాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణ మిల్లలేదు. వర్ణాశ్ర మాములు విడిచి కుల భ్రష్టుడనై, నీచకుల కాంతలతో సంసారము చేసితిని. నా కుమారుని యందున్న ప్రేమచో ‘నారాయణా’ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధలనుంచి రక్షించి వైకుంఠానికి తీసుకెళ్తున్నారు. ఆహా! నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వ జన్మ సుకృతము, నా తల్లి తండ్రుల పుణ్య ఫలమే నన్ను రక్షించినది” అని పలుకుతూ… సంతోషంగా విమానమెక్కి వైకుంఠానికి వెళ్లడు.”కాబట్టి ఓ జనక మహారాజా! తెలిసిగానీ, తెలియక గానీ నిప్పును ముట్టినప్పుడు బొబ్బలెక్కడం, బాధకలగడం ఎంత నిజమో… శ్రీహరిని స్మరించినంతనే పాపాలు నశించి, మోక్షాన్ని పొందుతారనడం అంతే కద్దు” అని వివరించారు.
ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి నవమధ్యాయ: – తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తం.

Thursday, November 15, 2018

Birth of kamadhenu - గోమాత-జననం

Birth of Kamadhenu గోమాత జననం

Birth of kamadhenu గోమాత జననం

ఆవు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మణంలో ఉంది.
దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెము అమృతమును త్రాగారు. త్రాగిన తరువాత వారు ప్రసన్నమయ్యారు. ఆ సమయములో వారి శ్వాస ద్వారా సుగంధము వెలువడి అంతటా ప్రసరించినది. ఆ శ్వాస నుండి ఒక్క ఆవు జన్మించినది.  సుగంధము ద్వారా జన్మించుట వలన దక్షప్రజాపతి దానికి ‘సురభి’అని పేరు పెట్టారు. సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి. అందుకనే సురభిని గోవంశమునకు మాతగా, జననిగా పరిగణిస్తారు. ఋగ్వేదంలో వేదంలో 4వ కాండలో 12వ సూక్తం గోసూక్తంగా గోమాత యొక్క మహత్యం వివరించబడింది. శ్రీసూక్తం, పురుష సూక్తం, మన్యు సూక్తం లాంటి పవిత్ర సూక్తాలతోపాటు గోసూక్తం కూడా చెప్పబడింది. గోవు రుద్రులకు తల్లిగా, వసువులకు పుత్రికగా, ఆదిత్యులకు సోదరిగా, నెయ్యి రూపాన అమృతంగా చెప్పబడింది. ఋగ్వేదంలో ఆవును ‘‘అఘణ్య’’ అన్నారు. సముద్ర మధనము నుండి దేవతల కార్యసిద్ధికై, సాక్షాత్తు సురభి బయల్వెడలినది. సంతోషముగా ఉన్నది, కపిల వర్ణముగలది, పొదుగు బరువు చేత నెమ్మది, నెమ్మదిగా అలలపై నడుస్తూ వచ్చుచున్న కామధేనువును చూచిన దేవతలంతా గొప్పకాంతిగల ఆ ఆవుపై పుష్పములు కురిపించిరి. అపుడు అనేక విధములు వాధ్యములు, తూర్యములు మ్రోగింపబడినవి. లోకములో గోసంతతి వ్యాపించడానికి ఆమెయే ఆధారం. ఆ సురభిరోమకూపాల నుంచి కొన్ని లక్షల సంఖ్యలో గోవులు పుట్టాయి. వాటి మగ సంతతి వృషభాలు. ‘‘గావః విశ్వస్య మాతరః గవా మాంగేషు తిష్ఠంతి భువనాని చతుర్దశ’’
ఆవు విశ్వజనులందరికీ తల్లి వంటిది.
గోవు నందు చతుర్దశ భువనాలున్నాయని వేదం చెబుతుంది. అంటే గోవు పృథ్వీ రూపమని అర్థం. క్షీర సాగరమధన సమయంలో నంది, శుభద్ర, సురభి, సుశీల, బహుళ అనే అయిదు గోవులు ఉద్భవించాయని భవిష్యపురాణం తెలియజేస్తుంది. వీటినే కామధేనువులు అంటారు. వంద గోవుల చేత కూడివున్న ఆ ధేనువు, సురభిని నీటి మధ్య నుండి తీసుకొని వచ్చిరి. ఆ గోవులు దట్టమైన నీలిరంగులోనూ, నలుపు రంగులోనూ, ధూమ్రవర్ణములోను, బభ్రు వర్ణములోను, శ్యామ వర్ణములోనూ, ఎరుపు రంగు, పింగళ (చిత్ర) వర్ణములోనూ ఉండినవి.  స్కాంద పురాణము.
గోశబ్దము స్వర్గమునకు, బాణమునకు, పశువునకు, వాక్కునకును, వజ్రాయుధమునకును, దిక్కునకును, నేత్రమునకును, కిరణమునకును, భూమికిని, నీళ్ళకును పేరు. ‘‘ధేనునా మస్మి కామధుక్" అని గీతలో శ్రీకృష్ణుడు నేనే గోవునని చెప్పుకున్నాడు.
గోవు లక్ష్మీ స్వరూపం.
దీనికి ఒక పురాణ గాధ ఉంది.
దేవతలందరూ వచ్చి గోవుతో తల్లీ మేమందరం నీ శరీరంలో నివసించడానికి కొంచెం భాగం ఇవ్వమని ప్రార్థిస్తే గోవు దేవతలందరికి భాగం ఇవ్వడం జరిగింది.
సురభి ఒక్కసారి తపస్సునారంభించనది.
బ్రహ్మ దేవుడు ఆ తపస్సునకు మెచ్చి సంతుష్టుడయ్యారు.
సురభికి అమరత్వమును ప్రసాదించారు. త్రిలోకముల కన్నా పైన ఉండే స్వర్గమును వరముగా ఇచ్చారు. దీనిని స్వర్గ గోలోకమనే పేరుతొ పిలుస్తారు. గోలోకములో సురభి నిత్యమూ నివసిస్తుంది, ఈమె కన్యలు, సుకన్యలు భూలోకములో నివసిస్తారు. ఈ గోలోకమునకు అధిపతి గోవిందుడు అనగా శ్రీ కృష్ణుడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ‘గోప్రేమికుడు’ అని అంతటా ప్రాచుర్యమైనదే ! స్పర్శ మాత్రము చేత గోవులు సర్వ పాపముల నుండి మానవులను విముక్తులను చేస్తాయి. ప్రతి దినమూ స్నానం చేసి గోవును స్పృశించినవాడు సర్వపాపాల నుండి విముక్తుడౌతాడు. గోమయములో లక్ష్మీ దేవి, గోమూత్రములో గంగాదేవి నివాసముంటారు. గోమూత్రము, గోమయాలతో నేల పరిశుద్ధము, పరిపుష్ఠము అవుతుంది. గోమయమును అగ్నితో శుద్ధి చేసిన యెడల ఆ భస్మమే విభూతి యగును. ప్రతిదినము ఆవులకు నీరు త్రాగించి గడ్డిని మేతగా తినిపించేవారికి అశ్వమేధ యజ్ఞం చేసినంత చేసిన పుణ్యం వస్తుంది. ‘‘ఒక గోవు తన జీవితకాలంలో సగటున 25వేల మందికి ఆకలి తీరుస్తుందని చెబుతూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని చెప్పారు. మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం, వాటితోపాటు కొంత సమయం గడపటంవల్ల, మన శరీరంలో వున్న అనారోగ్యాన్ని, ఆ గోవు ముక్కులోవున్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది, తరువాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని, అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది, ఆ పాలు తాగడంవల్ల మన వ్యాధి నయం అవుతుంది. గోమాత - కీర్తనం శ్రవణం దానం, ధర్మం, గోరక్షణం, గోరక్షణ ప్రోత్సాహం, గోరక్షణ ప్రోత్సాహక ప్రేరణం… అన్నీ పుణ్యప్రదమైనవే.

       జై గోమాత జైజై గోమాతగో మాత పాదాలకు శతకోటి వందనాలు

శివలింగం గురించి వివరణ

శివలింగం గురించి వివరణ

శివలింగం గురించి వివరణ

శివుడిని మనం అనేక రూపాల్లో ఆరాధన చేస్తాం .ఏ దేవతారాదనైనా శాస్త్రం రెండు రకాలుగా విభజించింది. సాకార రూపం, నిరాకార రూపం అని. సాకారము కానీ,నిరాకారము కానీ ఏకైక స్వరూపం శివ లింగం. అందుకే శివ లింగాన్ని అరూప రూపి లేదా అవ్యక్త వ్యక్తం అన్నారు. శివ అనగా శాంతము (ఇంకా అనేక అర్థాలున్నాయ్ మంగలం, చతుర్దమ్, తాప ఉపశమనం, etc). లింగం అనగా గుర్తు.  శివలిగం అంటే శాంతికి, మంగలమునకు గుర్తు. శివ లింగం ఈ సకల సృష్టి కి గుర్తు.అందుకే లింగానికి అభిషేక సమయంలో పఠించే రుద్రాధ్యాయా నికి ముందు "ఆపాతల నభాస్థలాన్త్ భువన బ్రహ్మాండ మావి స్ఫురత్జ్యోతి స్పాటిక లింగ" అన్నారు. పాతలం నుండి ఆకాశం వరకు వ్యాపించివున్న జ్యోతి లింగాన్ని ధ్యానం చేస్తాము. అంటే ఈ సర్వ సృష్టి కి గుర్తు లింగం.అందుకే ఈ సృష్టిలో ఏదైనా లింగాకారంగా ఉంటుంది.భూమి, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, వాటి కక్షలు, పాలపుంతలు, block hole కి ఆకారం కనుక్కుంటే అది,సమస్త సృష్టి లింగాకారంగానే ఉంటుంది. ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్పాలి అంటే మనలో వుండే జీవుడు కూడా లింగాకారంగా నే ఉంటాడు."అదో నిష్ట్యా వితస్థాన్తి నాభ్య ముపరి తిష్ఠతి జ్వాల మాలకులంబాతి".మన నాభి దగ్గర చిటకన వేలు పెట్టి జానెడు దూరం నాభి పై భాగాస్నా పెడితే మన బొటన వేలు ఎక్కడ తాకుతూ వుంతుందో అక్కడే వడ్ల గింజ కోన భాగంలో 10 వ వంతు , అంత చిన్నగా  జీవుడు దీపం రూపంలో  ఉంటాడు అని వేదం.ఆ జీవుడు కూడా లింగకారియే ఎందుకంటే దీపం లా అని చెప్పింది వేదం క్కబట్టి దీపం ఏ ఆకారంలో వెలుగుతుంది లింగాకారం.i.e jevudu కూడా లింగమే అందుకే వీర శైవ సంప్రదాయంలో అక్కడ (జీవుడు వుండే స్థానంలో)లింగం తాకే లాగా మెడలో వేసుకుంటారు.అలా వేసుకుంటే వారు శివమయం అయ్యారు అని గుర్తు.

శివలింగం అని మాములు గా అంటున్నాం కానీ ఇందులో మూడు భాగాలు నిక్షిప్తం అయి ఉన్నాయి అవి బ్రహ్మ పీఠం,పానవట్టం, లింగము అని.బ్రహ్మ పీఠం అనగా పానవట్టం నిలపడానికి ఉంచే పీఠం.లింగ రూపాన్ని బట్టి (మనకు చాలా రకాలైన లింగాలు ఉన్నాయి)దీనిని బయటకు గాని, లోపలికి గాని ఉంచటం జరుగుతుంది. ఉదహణకు సహస్ర లింగాన్ని పెడితే బ్రహ్మ పీఠం బయటకు ఉండాలి, ఉమ మహేశ్వర లింగం ,నగరేశ్వర లింగం అయితే బ్రహ్మ పీఠం లోపలికి ఉంటుంది.ఈ శివలింగం పెట్టె పీఠం బ్రహ్మకు ప్రతీక.పా నవట్టం విష్ణువు స్వరూపం అని చెప్తారు.కాబట్టే పరమ శివ భక్తుడు విష్ణు ద్వేషి అయిన రావణుడు విష్ణు స్వరూపమైన పానవట్టం లేకుండా ఆరాధన చేసేవాడు అని పురాణోక్తి.ఇప్పటికి కొన్ని పూర్వ వీర శైవ దేవాలయాలు చూస్తే పానవట్టం ఉండదు.ఇకపోతే లింగం సాక్షాత్ గా పరమ శివ స్వరూపం.అంటే మనం శివలింగం అంటే పరమేశ్వరుడు అని ఆరాధన చేస్తున్నాం కానీ ఇందులో బ్రహ్మ ,విష్ణు,మహేశ్వర ఆరాధన జరుగుతుంది.ఏ పూజలోనైన (అర్చకుడు బ్రహ్మ,శివార్చన ఐతే చేసేవాడు విష్ణువు,విష్ణూవు అర్చన అయితే చేసేవాడు శివుడు),ఏ గ్రంధములలో నైనా(రామాయణంలో చూస్తే రాముడు విష్ణువు,హనుమ శివుడు,జాంబవంతుడు బ్రహ్మ),వీరు ముగ్గురు లేకుండా వుండరు. శివలింగం యొక్క ఇంకొక రహస్యం లింగం పరమేశ్వరుడు,పానవట్టం అమ్మవారు ఇద్దరి కలయిక శివలింగం.అనగా ప్రకృతి పురుషుల కలయిక. శివలింగంలో లింగం  పదార్థం నకు.పానవట్టం శక్తి కి గుర్తు .పదార్థం శక్తి కలయిక శివలింగం.అంటే సృష్టి మొత్తం పదార్థం (matter) శక్తి(స్థితి శక్తి,గతి శక్తి)(energy) కలయిక. ఇలా అనేక నిర్వచనాలు ఉన్నాయి.కానీ ఇప్పటికి ఇవి తెలుసుకున్నాం వీటిని బాగా ఆలోచన(తత్వం ఆలోచనామృతం) చేయండి ,ధ్యానం చేయండి ఇంకా అనేకమైన శాస్త్రీయవిషయాలు మీకు  తెలుస్తాయి అన్నింటిని ఇక్కడ పెట్టడం కష్టం.

శివలింగ నిర్మాణం:
శివ లింగ నిర్మాణము ను బట్టి అది ఏ లింగమో చెబుతారు. దాదాపు గా సామాన్య మునుష్యులు(తప శక్తి లేని వారు) ప్రతిష్ట చేసే లింగాలకు బ్రహ్మ పీఠం, పానవట్టం ,లింగం ఒకే ఎత్తులో ఉంటాయ్. కానీ ఆగమాల్లో ఆ లింగ నిర్మాణాన్ని బట్టి ఆ లింగం ధ్యాన లింగమో, రుద్ర లింగమో, అఘోర లింగమో, అభయ లింగమో(నిల్చినీ అభయహస్తం ఇచ్చే లింగమో),భోగ లింగమో,..నిర్ణయం చేస్తారు.కొన్ని చోట్ల లింగము పానవట్టం కంటే రెండింతలు ఉంటుంది దానిని జ్ఞాన లింగంగా చెప్తారు ఇలా అనేక లింగాలు ఉన్నాయి.మీరు ప్రముఖ శైవ క్షేత్రాలకు వెళ్ళినపుడు ఉన్న అనేక లింగాలు గమనించండి.వాటి పేర్లు రాసుకోండి మీకు ఒక అవగాహన వస్తుంది. ఇవి కాక చేసిన పాపముల ప్రాయశ్చిత్తమునకు ఏవేవీ ఎంత పరిమాణంలో ఉన్న లింగాలను ప్రతిష్ట చేయాలో చెబుతారు.ఇలా అనేక లింగముల నిర్మాణాన్ని శిల్పశాస్త్రం, ఆగమ శాస్త్రాలు నిర్ణయం చేస్తాయి. ఇవి కాక పంచ భూత లింగలు(పృథ్వీ, జల, వాయు, ఆకాశ, అగ్ని లింగాలు) అని ఉన్నాయి.మాములుగా ఎత్తుగా గుండ్రంగా వుండే లింగాకారం, వెడల్పుగాముక్కోణాకారంగా, పంచకోణాకారంగా, అష్ట కొనాకారంగా, భగకారంగ (యోని అకృతిలో) అవి పంచ భూత లింగాలు.వీటిని శ్రీశైల దేవాలయం వెనుక భాగాన, శ్రీకాళహస్తి లో చూడవచ్చూ.ఇవి కాక ఇంకా 12 రకాల లింగాలు ఉన్నాయి సహస్ర లింగం, బాణా లింగం వంటివి యెన్నో ఉన్నాయి. ఈ లింగకార నిర్మాణం అనేది గొప్ప శాస్త్రం మరియు వీటిని తప శక్తి  ద్వారా అర్థం చేసుకోగలం. వీటి నిర్మాణం ఇలాగే ఎందుకు జరగాలి అనే దానికి కూడా శాస్త్రం సమాధానం చెబుతుంది.మనకు ఆ శాస్త్రీయ దృష్టి లేక తెలుసుకోలేక పోతున్నాము. సరే శివ లింగ తత్వం, శివ లింగ నిర్మాణం ఎలా వున్నా మనం శివలింగారాధన ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలి. ఇక్కడ ఆరాధన మొత్తం చెప్పకున్న ఆరాధనలో వచ్చే లోపాలు మాత్రం వివరిస్తాను.

1.ఇతర దేవతారధనకు లింగారాధనకు ప్రధాన బేధం ఉంది ఇతర ఆరాధన ల వల్ల సాలోక్య(ఎవరిని ఆరాధన చేస్తే వారి లోకం ప్రాప్తించటం ex:విష్ణువు-వైకుంఠం, కృష్ణుడు-రాధ-గోలోకం, సాకార శివుడు- కైలాసం), సారూప్య (ఎవరిని ఆరాధన చేస్తే వారి వంటి వేషం), సామీప్య( ఎవరిని ఆరాధన చేస్తే వారితో కలిసి దగ్గర గా తిరిగే అదృష్టం) స్థితులు లభిస్తాయి. కానీ లింగారాధన చేస్తే సాక్షాత్తుగా తానే శివుడు అవుతాడు .అంతే కాదు ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలి అంటే శివుడు కానీ వాడు శివుణ్ణి అర్చన చేయలేడు. వాడిలో శివ తేజస్సు ఉంటేనే, వాడు శివార్చన చేయగలడు అని శాస్త్రం"న రుద్రో రద్రమర్చయేత్". అందుకే మన శాస్త్రం శివార్చన చేసే వారికి నియమోల్లంఘనాన్ని అంగీకరించింది.అంటే మన సంప్రదాయంలో ""కాషాయ దండ మాత్రేణ యతి పూజ్యో న సంశయ:"" అని సన్యాసి కనిపిస్తే ఎవరైనా నమస్కరించవలసిందే అని కానీ శామ్భవ దీక్షలు ,పాశుపత దీక్షలో ఉండి నిరంతర శివార్చన ,శివాభిషేకం చేసే వారు సన్యాసులకు నమస్కారం చేయరు.ఎందుకంటే వారు శివుడే అయి వుంటారు కాబట్టి.

2. మొదట పానవట్టం నకు పూజ చేసిన తర్వాతనే లింగ పూజ చేయాలి

3. శివలింగాభిషేకం చేసేటప్పుడు ఒక్క లింగాన్ని పెట్టి అభిషేకం చేయవద్దు(సాలగ్రామం తో కలిపి అభిషేకం చేయవచ్చూ)

4. శివ లింగం పై ఒక మారేడు దలన్నాయిన, పువ్వునైన, గంధము నైనా పెట్టి మాత్రమే అభిషేకం ప్రారంభిచాలి.

5. అభిషేక జలములకు అమృత ముద్ర ,గరుడ ముద్ర చూపినప్పుడే ఆ జలములు అభిషేకమునకు పనికి వస్తాయి.

6. అభిషేక జలములను మహాన్యాసం కానీ, లఘు న్యాసం కానీ, అర్చకులు మాత్రమే తొక్కవచ్చూ .మిగతా వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అభిషేక జలములకు గాని,ఈశ్వర నిర్మాల్యాన్ని గాని తొక్క కూడదు.

7.కనీసం లఘు న్యాసమైన చేసుకోకుండా శివ లింగాభిషేకం చేయకూడదు.

8. పంచామృత అభిషేకం లో ప్రతి ఒక్క పదార్థం తర్వాత శుద్ధ జలములతో అభిషేకం చేయాలి.

9.పానవట్టం నకు  కూడా అభిషేకం చేయాలి(కొందరు మొత్తం లింగం మీద మాత్రమే నీరు పోస్తారు.పానవట్టం పార్వతి అని గుర్తుంచుకోవాలి.
శివలింగం గూర్చి,శివ లింగ నిర్మాణం గురించి ఆగమాల్లో చాలా శాస్త్రీయంగా ,వైజ్ఞానికంగా చెప్పారు.వేదాలు ముఖ్యన్గా రుద్రము (నమక చమకం) శివ తత్వాన్ని వర్ణన చేశాయి. శివాభిషేకం అంటే ఏమిటి? ఎలా చేయాలి?రుద్రాధ్యాయ అంతరార్థం ఏమిటి?మనం తెలియక చేసే పొరపాట్లు ఏమిటి తర్వాత చూద్దాం. ఇలా శివలింగ తత్వం గురుంచి ఎంతైనా చెప్పుకోవచ్చూ. ఎప్పుడైనా equipment సహకరిస్తే చక్కగా వీడియో చేసి పెడతాను.

శివోహం శివోహం శివోహం
సశేషం(ఇది ఎంత చెప్పినా పూర్తి అవదు)
సూర్య - వేదమయీ.

Wednesday, November 14, 2018

కార్తీకపురాణం - 8 అధ్యాయం

*కార్తీకపురాణం - 8 అధ్యాయం*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*హరినామస్మరణం*
☘☘☘☘☘☘☘☘☘
వశిష్టుడు చెప్పిన దంతా విన్న జనకుడు ఇలా అడుగుతున్నాడు… ”మహానుభావా! మీరు చెప్పిన ధర్మాలన్నింటినీ శ్రద్ధగా వింటున్నాను. అందులో ధర్మం చాలా సూక్షంగా, పుణ్యం సులభంగా కనిపిస్తోంది. నదీస్నానం, దీపదానం, ఫలదానం, అన్నదానం, వస్త్రదానం వంటి విషయాలను గురించి చెప్పారు. ఇలాంటి స్వల్ప ధర్మాలతో మోక్షం లభిస్తుండగా… వేదోక్తంగా యజ్ఞయాగాదులు చేసినగానీ పాపాలు పోవని మీలాంటి ముని శ్రేష్టులే చెబుతున్నారు. మరి మీరు ఇది సూక్ష్మంలో మోక్షంగా చెబుతుండం నాకైతే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దుర్మార్గులు, వర్ణ సంకరులైనవారు రౌరవాది నరకాలకు పోకుండా తేలిగ్గా మోక్షాన్ని పొందుతున్నారు. ఇదంతా వజ్రపు కొండను గోటితో పెకిలించడం వంటిదే కాదా? దీని మర్మమేమిటి? నాకు సవివరంగా చెప్పండి” అని ప్రార్థించాడు. అంతట వశిష్టుల వారు చిరునవ్వు నవ్వి . ‘జనక మహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుక మైనదే, నేను వేద వేదంగములను కూడా పఠించాను. వాటిల్లోనూ సూక్ష్మ మార్గాలున్నాయి. అవి సాత్విక, రాజస, తామసాలు అని పిలిచే మూడు రకాల ధర్మాలున్నాయి. సాత్వికమంటే… దేశ కాల పాత్రలు మూడు సమాన సమయంలో సత్వ గుణం జనించి ఫలితాన్ని పరమేశ్వరుడికి అర్పిస్తాం. మనోవాక్కాయ కర్మలతో ఒనర్చే ధర్మం అధర్మంపై ఆదిక్యత పొందుతుంది. ఉదాహరణకు తామ్రవర్ణ నది సముద్రంలో కలిసిన తావులో స్వాతికర్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి ధగధగ మెరిసి, ముత్యమయ్యే విధంగా సాత్వికత వహించి, సాత్విక ధర్మం ఆచరిస్తూ గంగ,యమున, గోదావరి, కృష్ణ నదుల పుష్కరాలు మొదలు పుణ్యకాలాల్లో దేవాలయాల్లో వేదాలను పఠించి, సదాచారుడై, కటుంబీకుడైన బ్రాహ్మణుడికి ఎంత స్వల్ప దానం చేసినా… లేక ఆ నదీ తీరంలో ఉన్న దేవాలయంలో జపతపాదులను చేయుట విశేష ఫలితాలనిస్తుంది. ఇక రాజస ధర్మం అంటే ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులతో చేసే ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతుకమై కష్టసుఖాలను కలిగిస్తుంది. తామస ధర్మమనగా… శాస్త్రోక్త విధులను విడిచి, దేశకాల పాత్రలు సమకూడని సమయంలో డాంబిక చరణార్థం చేసేది. ఆ ధర్మం ఫలాన్ని ఇవ్వదు. దేశకాల పాత్రము సమ కూడిన పుడు తెలిసి గాని తెలియకగాని యే స్వల్ప ధర్మం చేసిననూ గొప్ప ఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్నా నారాయుణుని నామము, తెలిసి గాని, తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక యితిహాసము కలదు’ అని ఇలా చెప్పసాగారు.

🙏_*ఆజా మీళుని కథ_*🙏

పూర్వ కాలంలో కన్యాకుబ్జం అనే నగరంలో నాలుగు వేదాలు చదివిన బ్రాహ్మడు ఒకడుండేవాడు. అతని పేరు సత్య వ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశి అయిన భార్య ఉంది. ఆ దంపతులు అన్యోన్యత, ప్రేమ కలిగి అపూర్వ దంపతులు అనే పేరు తెచ్చుకున్నారు. వారికి చాలాకాలానికి లేకలేక ఒక కొడుకు పుట్టాడు. వారు ఆ పిల్లాడిని గారాబంగా పెంచి, అజామిళుకుడని పేరు పెట్టారు. అతను గారాబంగా పెరగడం వల్ల పెద్దలను నిర్లక్ష్యం చేస్తూ దుష్ట సహవాసాలు చేయసాగాడు. విద్యను అభ్యసించక, బ్రాహ్మణ ధర్మాలను పాటించక సంచరిచేవాడు. అలా కొంతకాలం తర్వాత యవ్వనవంతుడై కామాంధుడయ్యాడు. మంచిచెడ్డలు మరిచి, యజ్ఞోపవీతం తెంచి, మద్యంసేవించడం, ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి, నిరంతరం ఆమెతోనే కామ క్రీడల్లో తేలియాడుచుండేవాడు. ఇంటికి రాకుండా, తల్లిదండ్రులను మరిచి, ఆమె ఇంట్లోనే భోజనం చేస్తూ ఉండేవాడు. అతి గారాబం వల్ల ఈ దుష్పరిణామాలు ఎదురయ్యాయి. చిన్నపిల్లల్ని చిన్నతనం నుంచి అదుపాజ్ఞల్లో పెట్టకపోవడం వల్ల ఈ దుస్థితి దాపురించింది. అజామీళుడు కులభ్రష్టుడు అయ్యాడు.
కుల బహిష్కరణతో అతను మరింత కిరాతకుడిగా మారాడు. వేట వల్ల పక్షులను, జంతువులను చంపుతూ అదే వృత్తిలో జీవించసాగాడు. ఒక రోజున అజామీలుడు, అతని ప్రేయసి అడవిలో వేటాడుతూ తేనె పట్టు తీసేందుకు ఆమె చెట్టుపైకెక్కి ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందింది. అజామీళుడు ఆమెపైపడి కాసేపు ఏడ్చి, ఆ తర్వాత అడవిలోనే దహనం చేసి, ఇంటికి తిరిగి వెళ్లాడు. అప్పటికే ఆ ఎరుకల మహిళకు ఒక కుమార్తె ఉండడంతో, అజామీళుడు ఆమెను పెంచసాగాడు. ఆమెకాస్తా యుక్తవయసుకు వచ్చేసరికి అజామీళుడు కామంతో కళ్లు మూసుకుపోయి, ఆమెను చేపట్టాడు. ఆమెతో కామక్రీడల్లో తేలియాడుచుండేవాడు. వీరికి ఇద్దరు కొడుకులు పుట్టారు. ఆ ఇద్దరూ పురిటిలోనే చనిపోయారు. ఆ తర్వాత ఆమె మరలా గర్భందాల్చి ఓ కుమారుడిని కన్నది. వారిద్దరూ ఆ బాలుడికి నారాయణ అని పేరు పెట్టి పిలవసాగారు. ఒక్క క్షణమైనా ఆ బాలుడిని విడవకుండా, ఎక్కడకు వెళ్లినా… తన వెంట తీసుకెల్తూ… నారాయణా అని ప్రేమతో సాకుచుండిరి. ఇలా కొంతకాలం గడిచాక అజామీళుడి శరీరం పటుత్వం కోల్పోయింది. రోగస్తుడయ్యాడు. మంచం పట్టి కాటికి కాలుచాచాడు. ఒకరోజు భయంకరాకారాలతో, పాశాయుధాలతో యమభటులు ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి అజామీళుడు భయపడి కుమారుడిపై ఉన్న వాత్సల్యంతో ప్రాణాలు విడువలేక… నారాయణా… నారాయణా… అని పిలుస్తూ ప్రాణాలు విడిచాడు. అజామీళుడి నోట నారాయణ శబ్దం రాగానే యమభటులు గడగడా వణికారు. అదే వేళకు దివ్య మంగళకారులు, శంకచక్ర గధాధరులూ అయిన శ్రీమహావిష్ణువు దూతలు విమానంలో అక్కడకు వచ్చి, ”ఓ యమ భటులారా! వీడు మావాడు. మేం వైకుంఠౄనికి తీసుకెళ్లడానికి వచ్చాం” అని చెప్పి, అజామీళుడిని విమానమెక్కించి తీసుకుపోయారు. యమదూతలు వారితో ”అయ్యా… వీడు పరమ దుర్మార్గుడు. వీడు నరకానికి వెళ్లడమే తగినది” అని చెప్పగా… విష్ణుదూతలు అతను చనిపోవడానికి ముందు నారాయణ పదాన్ని ఉచ్చరించాన్ని ఊటంకించి, ఆ పాపాలన్నీ ఆ నామ జపంతో తొలగిపోయాయని, అతను ఇప్పుడు పునీతుడని చెప్పుకొచ్చారు. ”’సంకీర్తనారాయణ శబ్దమాత్రం విముక్త్య దు:ఖా సుఖినోభవంతు” అన్నట్లు అజామీళుడు విష్ణుసాన్నిధ్యాన్ని పొందాడని వశిష్టుడు జనకమహారాజుకు వివరించారు.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి ఎనిమిదో అధ్యాయం, ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తం

ALL COVID 19 ITEMS AVAILABLE

  ALL COVID 19 ITEMS AVAILABLE  

STARS