Wednesday, February 6, 2019

శ్రీ గరుడ పురాణము

శ్రీ గరుడ పురాణము


ఈ కృష్ణ ద్వైపాయనుడు బ్రహ్మ శాసనము మీద వేదములను నాలుగుగా విభజించి పైల, జైమిని, సుమంతు, వైశంపాయనులను శిష్యులకు భోదించి, అష్టాదశ పురాణములను రచించిరో మహర్షణునకు (సూతునికి ) బోధించి లోకములో వ్యాపింప జేసెను .


శ్రీ హరి దశావతారములు

1 .మత్స్యావతారము

వైవస్వత మను వొకనాడు నదిలో సూర్యునికి అర్ఘ్య మిచ్చు చుండగా ఒక చేప పిల్ల అతని చేతిలో బడెను. అది పెరిగి పెద్ద దగుచుండగా గంగాళము లోను, చెరువులోను, సరస్సులోను వేసెను. అప్పుడా చేప మనువుతో " ప్రళయ కాలమున ఒక నావ వచ్చును. దానిలో సప్త మహర్షులను నీవును ఎక్కి కూర్చుండుడు. ప్రళయాంతము వరకును ఆ నావను మహా సముద్రములో నా కొమ్మునకు గట్టుకుని లాగుకొని పోవుచునే యుందు, " నని చెప్పెను. మనువట్లే చేసి ఆ ప్రళయమును దాటెను. మరల బ్రహ్మ సృష్టి చేయుటకు పూను కొన్నప్పుడు హయగ్రీవుడను రాక్షసుడు (ఇతనినే సోమకాసురుడని కూడా అందురు) వేదముల నపహరించి సముద్రములో దాగి యుండగా శ్రీ మన్నారాయణుడు మత్స్యావతారమును మరల ధరించి, వానిని సంహరించి వేదములను మరల బ్రహ్మ దగ్గరకు చేర్చెను.

2 . కూర్మావతారము

దూర్వాసుని శాపముచే ఇంద్రుని సంపద లన్నియు సముద్రములో గలిసిపోగా, విష్ణు మూర్తి సలహా మీద దేవ దానవులు సముద్రమును మదించిరి. ఈ పాల సముద్రమును మదించుట కారంబించినపుడు కవ్వముగా వేసిన మందర పర్వతము మునిగిపోసాగెను. అప్పుడు నారాయణుడు కూర్మావతారమును ధరించి దాని క్రింద ఆధారముగా నిలువబడెను. దానితో సముద్ర మధనము జరిగి సర్వ వస్తువులను, అమృతమును పుట్టెను.

3 . వరాహావతారము
హిరణ్యాక్షుడు దేవతలను గెలిచి స్వర్గ మాక్రమించిన ప్పుడు అతనిని యజ్ఞ వరాహ రూపముతో సంహరించెను.

4 . నృసింహావతారము

అతని సోదరుడు హిరణ్య కశిపుడు తరువాత దేవలోకము నాక్రమించి యజ్ఞ భాగములను కాజేయగా నార సింహ రూపము ధరించి అతనిని సంహరించెను.

5 .వామనావతారము

బలి చక్రవర్తి ఇంద్రుడై దేవతలను స్వర్గము నుండి తరిమి వేయగా శ్రీ హరి వామనుడై పుట్టి, బలిని మూడడుగుల నేల యడిగి, వామనుడు అవామనుడై రెండడుగులలో భూమ్యాకాశముల నాక్రమించి అతనిని పాతాళమునకు త్రొక్కి వేసెను .

6 .పరశురాముడు

శ్రీ హరి తన అంశము తో జమదగ్నికి పరశురాముడై పుట్టి మదాంధులైన రాజులను ఇరువది యొక్క సారులు దండ యాత్రలు చేసి సంహరించెను. చివరికి దశరధ రాముని చేతిలో ఓడి తపమునకు బోయెను.

7 . శ్రీరాముడు

రావణ కుంభ కర్ణులను సంహరించుట కై దేవతలు ప్రార్ధించిన మీదట దశరధునకు రామునిగా పుట్టి, సీతను పెండ్లాడి, సీతా లక్ష్మణులతో అరణ్య వాసము చేసి అనేక రాక్షసులను వధించెను. రావణుడు సీత నెత్తికొన పోగా సుగ్రీవుని సహాయముతో లంకకు వెళ్లి రావణ కుంభ కర్ణాది రాక్షసులను సంహరించి, అయోధ్యకు వచ్చి పట్టము గట్టు కొనెను. లోకాపవాద మునకు భయపడి సీతను అడవిలో వదలగా ఆమె వాల్మీకి ఆశ్రమమునకు జేరెను. అప్పటికే గర్భవతి యైన సేత, అక్కడ కుశలవులను ఇద్దరు కొడుకులను గనెను. రాముడు పదునొక్క వేల యేండ్లు రాజ్యము చేసి కుశునికి పట్టాభిషేకము చేసి, సీతా సమేతుడై అయోధ్యా పుర వాసులతో సహా పరమ పదమునకు వేంచేసెను .

8 .శ్రీ కృష్ణావతారము

ఇరువది ఎనిమిదవ ద్వాపర యుగములో అధర్మ ప్రవృత్తు లైన రాజుల వలన భూభారము పెరిగినప్పుడు భూదేవి కోరికపై శ్రీ హరి, కృష్ణావతారము నెత్తెను. దేవకీ వసుదేవులకు అష్టమ గర్భమున జన్మించి, వ్రేపల్లెలో నంద యశోదల యింట పెరిగి బాల్య క్రీడలచే వారిని అలరించి, దుష్ట రాక్షసులను సంహరించెను.

ALL COVID 19 ITEMS AVAILABLE

  ALL COVID 19 ITEMS AVAILABLE  

STARS