Sunday, January 27, 2019

శ్రీ గరుడ పురాణము

శ్రీ గరుడ పురాణము

గరుడుని పుట్టుక


1 .దేవ యజ్ఞము : దీనినే వైశ్వ దేవ మందురు. గృహస్థులు గార్హ పత్యాగ్నిలో దేవతల నుద్దేశించి చేయుదురు. బ్రహ్మ చారులైనచో లౌకికమైన అగ్ని లేనే అగ్ని కార్యము చేయుదురు. (గృహస్థులు చేయునది మాత్రమే వైశ్వ దేవము) శూద్రులకు నమస్కారమే దేవ యజ్ఞ ఫలము నిచ్చును.


2 . పితృ యజ్ఞము : ఇది తల్లి దండ్రులు లేనివారు చేయునది. పితృ  వర్గమును, మాతృ వర్గమును చెప్పుచు స్వదాకారముతో జలముతో గాని, తిలలు గలిపిన జలముతో గాని తర్పణము చేయుటే పితృ యజ్ఞము. తండ్రి లేని వానికే తర్పణము చేయు అధికార ముండును. తండ్రి జీవించి యున్నప్పుడు తల్లి లేని వానికి గూడ తర్పణము చేయు అధికారము లేదని కొందరి మతము .

3 . భూత యజ్ఞము : గృహస్థుడు తాను భోజనము చేయుటకు ముందు ఇంటి పరిసరములలో తిరుగు కాకులకు ఇతర జంతులకును ఆహారము పెట్టుటయే భూత బలి. ఇది యెవ్వరైనను భూత దయ గలవారు చేయవచ్చును .

4 . మనుష్య యజ్ఞము : ఇంటికి వచ్చిన అతిదులను ,అభ్యాగతులను , సత్కరించి భోజనము పెట్టుట ,లేదా సాముహిక సమారాధనలు (అన్నదానములు) జరుగునపుడు యధాశక్తిగా ధనమును గాని వస్తు సంభారములను గాని ఇచ్చి సహకరించుట .

5 .బ్రహ్మ యజ్ఞము : ఋగ్వేదము ,యజుర్వేదము ,సామవేదము , అధర్వణ వేదము అను నాల్గింటిలో తమ శాఖకు చెందిన వేద భాగమును అధ్యయనము చేయుట , లేదా ! అధ్యయనము చేసిన దానిని పునశ్చరణము చేయుట బ్రహ్మ యజ్ఞ మనబడును. శూద్రాది వర్ణముల వారు బ్రహ్మ జ్ఞానులైన ఋషులు రచించిన పురాణములను ధర్మ శాస్త్రములను చదువుట లేక వినుట బ్రహ్మ యజ్ఞ మగును.

బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ప్రతి దినము ఉదయమునను., మద్యాహ్నమునను, సాయంకాలమునను మంత్ర యుక్తముగా సంధ్యో పాసనము చేయవలెను. " అహరహ స్సంధ్యా ముపాసీత " అని పెద్దల యాదేశము. శూద్రాది వర్ణములవారు ఉదయముననే స్నానము చేసి జగత్కర్మ సాక్షి యైన సూర్యునికి నమస్కారము చేసి ధ్యానించి నచో అది సంధ్యా వందన మగును. సాయంకాలము కూడా ఇట్లే చేయవలెను .

దానములు - ధర్మములు

దానములు వేరు, ధర్మములు వేరు దాన మనగా ఇచ్చెడి వస్తువు నందు మమత్వమును విడిచి ఇతరుల కిచ్చునది . ధర్మమనగా ప్రజోపయోగార్ధ మై చేయు ఇష్టా పూర్త రూపమైనది. దిగుడు బావులు, మంచినీటి నూతులు చెరువులు త్రవ్వించుట, దేవాలయ నిర్మాణము, ఉద్యానవనములు, పండ్ల తోటలు నాటించుట మొదలగు కార్యములు ధర్మములోనికి వచ్చును. అగ్నిహొత్రము, తపస్సు, సత్య వ్రతము, వేదాధ్యయనము, అతిధి మర్యాద, వైశ్వదేవము ఇట్టి వానిని ఇష్టము లందురు.

సూర్య, చంద్ర గ్రహణ సమయములలో ఇచ్చు దానము వలన దాత స్వర్గాది పుణ్య లోకములను బొందును. దేశమును, కాలమును, పాత్రతను (యోగ్యతను) గమనించి ఇచ్చిన దానము కోటి గుణిత మగును. కర్కాటక, మకర సంక్రమణము లందును అమావశ్య,పూర్ణిమాది పర్వములందును చేసెడి దానము విశేష ఫలము నిచ్చును. దాత తూర్పు ముఖముగా కూర్చుండి సంకల్పము, గోత్రనామములతో జెప్పి దాన మీయవలెను. పుచ్చుకొనువాడు ఉత్తరాభి ముఖుడై స్వీకరింపవలెను. అట్లు చేసినచో దాతకు ఆయుర్దాయము పెరుగును. గ్రహీతకు పుచ్చుకున్నది అక్షయ మగును.

మహాదానములు పది 

శ్లో || కనకా శ్వతి లానాగా దాసీరధ మహీ గృహాః ||
కన్యాచ కపిలా దేను: మహా దానాని వైదశ ||

తా || బంగారము, గుఱ్ఱము, తిలలు, ఏనుగులు,దాసీ జనము, రధములు, భూమి, గృహములు, కన్యక నల్లని ధేనువు వీనిని మహా దానము లనిరి. ఇవి పది. దేవతలకు గాని, బ్రాహ్మణులకు గాని, గురువులకు గాని, తల్లి దండ్రులకు గాని ఇచ్చెదనని వాగ్దానము చేసిన దానిని ఇయ్యక ఎగ గొట్టినచో వంశ నాశనము జరుగును. ప్రతి గ్రహీత నుండి ఏదో లాభము నాశించి దాన మిచ్చినచో అది నిష్ప్రయోజన మగును. ప్రతి గ్రహీత నుద్దేశించి దానము చేయుచు, ఆ దాన ధారను భూమిపై విడిచినచో ఆ దాన ఫలము మహా సాగరము కన్నా అనంతమైనది యగును. గౌతమీ, గంగా, గయా, ప్రయాగాది తీర్ధము లందిట్టి దానములు విశేష ఫలముల నిచ్చును. వైవస్వత మన్వంతరము లోని వ్యాసులు

ఇప్పుడు జరుగుచున్నది వైవస్వత మన్వంతరములో ఇరువది యెనిమిదవ మహాయాగము. అందులోను కలియుగము వ్యాసుడు జన్మించి వేదాలు నాలుగుగా విభజించి, పదునెనిమిది పురాణములు రచించినది, దీనికి వెనుక ద్వాపర యుగములోనే గతించిన ఇరువది యేడు మహాయాగములలోను ద్వాపరములందు ఇరువది యేడుగురు వ్యాసులు జనియించిరి. ప్రతి కలియుగములో ను మానవుల శక్తి సామర్ద్యములు పూర్వ యుగములలో కంటే అల్పముగా నుండును. వారు అనంతములైన వేదములను అధ్యయనము చేయలేరు. అందు నిక్షిప్తమైన నిగూఢ ధర్మములను గ్రహించి ఆచరింప లేరు. అందుచేత ప్రతి మహాయాగము లోను ఒక వ్యాసుడు జనించి ఆ వేద రాశిని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అను నాలుగు విభాగములు చేసి ఒక్కొక్క శాఖను కొన్ని వంశముల బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణముల వారు అధ్యయనము చేయవలెనని నియమించినారు. అంతే కాదు; ఆవేదాలలోని ధర్మములను భోదించుటకై పదునెనిమిది పురాణములను, పదునెనిమిది ఉప పురాణములును వెలసినవి. గతించిన ఇరువది యేడు ద్వాపర యుగములలోను జన్మించిన వ్యాసులు వీరు :
మొదటి మహాయుగమున ద్వాపరములోని వ్యాసుడు స్వాయుంభువ మనువు

రెండవ ద్వాపరములో                                                      ప్రజాపతి
మూడవ ద్వాపరములో                                                   ఉశ నసుడు
నాలుగవ ద్వాపరములో                                                  బృహస్పతి
ఐదవ ద్వాపరములో                                                       సవితృడు
ఆరవ ద్వాపరములో                                                       మృత్యువు
ఏడవ ద్వాపరములో                                                       ఇంద్రుడు
ఎనిమిదవ ద్వాపరములో                                                వసిష్టుడు
తొమ్మిదవ ద్వాపరములో                                                సారస్వతుడు
పదవ ద్వాపరములో                                                       త్రిధాముడు
పదునొకండవ ద్వాపరములో                                           త్రివృషుడు
పండ్రెండవ ద్వాపరములో                                               శత తేజుడు
పదమూడవ ద్వాపరములో                                            ధర్ముడు
పదునాలుగవ ద్వాపరములో                                          తరక్షుడు
పదునైదవ ద్వాపరములో                                                త్ర్యారుణి
పదునారవ ద్వాపరములో                                               ధనంజయుడు
పదునేడవ ద్వాపరములో                                                కృతంజయుడు
పదునెనిమిదవ ద్వాపరములో                                         ఋతంజయుడు
పందొమ్మిదవ ద్వాపరములో                                            భరద్వాజుడు
ఇరువదవ ద్వాపరములో                                                 గౌతముడు
ఇరువదొక్కటవ ద్వాపరములో                                          రాజశ్రవుడు
ఇరువది రెండవ ద్వాపరములో                                         శుష్మాయణుడు
ఇరువది మూడవ ద్వాపరములో                                       తృణబిందుడు
ఇరువది నాలుగవ ద్వాపరములో                                      వాల్మీకి
ఇరువది ఐదవ ద్వాపరములో                                           శక్తి
ఇరువది యారవ ద్వాపరములో                                        పరాశరుడు
ఇరువది యేడవ ద్వాపరములో                                         జాతూకర్ణుడు
ఇరువది ఎనిమిదవ ద్వాపరములో                                    కృష్ణ ద్వైపాయనుడు

ఈ కృష్ణ ద్వైపాయనుడు బ్రహ్మ శాసనము మీద వేదములను నాలుగుగా విభజించి పైల, జైమిని, సుమంతు, వైశంపాయనులను శిష్యులకు భోదించి, అష్టాదశ పురాణములను రచించిరో మహర్షణునకు (సూతునికి ) బోధించి లోకములో వ్యాపింప జేసెను .

ALL COVID 19 ITEMS AVAILABLE

  ALL COVID 19 ITEMS AVAILABLE  

STARS