తిరుప్పావై ఇరవై తొమ్మిదవ 29
రోజు పాశురం
రోజు పాశురం
శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు ఉన్
పొత్తామరై యడియే పోత్తుమ్ పోరుళ్ కేళాయ్;
పెత్తమ్మేయ్ త్తుణ్ణు జ్కులత్తిన్ పిఱన్ద నీ,
కుత్తేవల్గెళై క్కోళ్వామల్ పోకాదు;
ఇతైప్పఱై కోళ్వానన్దుకాణ్ గొవిన్దా:
ఎత్తైక్కు మేళేళు పిఱవిక్కుమ్, ఉన్దన్నో
డుత్తోమే యావో మునక్కే నామాళ్ శేయ్ వోమ్,
మత్తైనజ్కా మఞ్గళ్ మాత్తేలో రెమ్బావాయ్
భావం
ఓ స్వామీ! శ్రీకృష్ణా! నీ పాదారవింద దాసులమగు మేము మిక్కిలి వేకువనే లేచి, నీ సన్నిధికి వచ్చి, నిన్ను దర్శించి నీ సుందర తిరివడులకు మంగళాశాసనము చేయుటే మాకు పరమావధి, ఎందుకనగా పశువులను మేపి మా జీవిక నడుపుకొను అజ్ఞానులమైన మేము చేసే అంతరంగ సేవలను నీవు స్వీకరించకుండ వుండరాదు. ఏలన నీవు మా గోల్లకులములో జన్మించి మా కులమును , మమ్ములను ధన్యులను చేసినవాడవు , ఓ గోవిందా! పుండరీకాక్షా! మేము నీ వద్దకు 'పఱ' అను వాద్యమును పొందుటకు రాలేదు. అది ఒక నిమిత్తమే! వ్రతమూ నిమిత్తమే! మేము ఏడేడు జన్మముల వరకును మరియు యీ కాలతత్వముండు వరకును నీకు అనవార్యశేషభూతులమై నీతోడ చేరి, నీ దాస్యమును చేయుచచుండువారము కామా? మా యందు , యితరములై ఆపేక్షలేవైన యున్నచో వానిని తొలగించి మమ్ము కృపజూడుము స్వామీ! సదా నీ సేవలను మాకోసగమును అని వ్రత ఫలమును అండాళ్ తల్లి వివరించింది.
అవతారిక
భగవత్ప్రాప్తిని పొందగోరేవారందరూ ఆ చరించదగిన యీ ధనుర్మాస వ్రతంలో గోపికలు భక్తీ, ప్రపత్తులే ముఖ్యమని నిరూపించారు. అజ్ఞానులైనను నిశ్చల భక్తి ప్రపత్తులతో భగవంతుని చేరవచ్చనేది నిర్వివాదంగా నిరూపించారు. ఇప్పుడీ పాశురంలో వ్రత ఫలాన్ని చెబుతున్నారు. వ్రతాన్ని ఒక నిమిత్తంగా చేసుకుని 'పఱ' అనే వాద్యాన్ని పొందాలని తాహతహలాడారు గోపికలు ఇప్పటివరకు . కాని యీ పాశురంలో 'పఱ' నిమిత్తమని నిజానికి శ్రీకృష్ణుని సాన్నిధ్యమూ, అతని నిరంతర సేవకే యీ ప్రయత్నమంతా అని స్పష్టం చేశారు. అండాళ్ తల్లితో కూడిన గోపికలు.
(ధర్మవతిరాగము _ అదితాళము)
ప... నీ సన్నిధియే కావలె స్వామీ!
నీ సంపెసేనమె మాకు పరమావధి స్వామీ!
అ..ప.. నీ సేవకై వేకువజామున నిలిచి
నీ సుందర తిరువడులకు మంగళమనగ
చ.. పనుల మేపి జీవిక నడిపెడి మా
పశుప కులమునన్ బుట్టిన స్వామీ!
ఈశ ! మా అంతరంగ సేవలను
ఆశల జేయ నిరాకరింపకుమ!
నీ సన్నిధియే కావలె స్వామీ!
చ.. కాదుసుమా! వాద్యముకై వ్రతము
అదియొక నేపమగు నోచ నీ వ్రతము
బంధము వీడక యేడేడు జన్మల
అందరము కై౦కర్యము చేతుము
విందువో గోవిందా! మనవిని __ మా
యందన్య కామనలను పోగొట్టుము.