Tuesday, January 22, 2019

శ్రీ గరుడ పురాణము

శ్రీ గరుడ పురాణము

పరిచయము : గరుడ పురాణము అనగానే చాలామంది ,అదేదో అశుభ పురాణ మనియు, ఎవరో చనిపోయినప్పుడే తప్ప వట్టి రోజులలో చదువకూడదనియు ఒక దురభిప్రాయము లోకములో నాటుకు పోయినది. కాని అది సరియైనది కాదు. ఇది, విష్ణు మహత్యమును దెలుపు వైష్ణవ పురాణము. నారద పురాణములో దీనిని గురించి - " మరీచే శృణు వచ్మద్య పురాణం గారుడం శుభమ్. గరుడా యాబ్ర వీత్ పృష్నో భగవాన్ గరుడాసనః" అని శుభమును గలిగించు పురాణముగా చెప్ప బడినది .

గారుడ కల్పములో విశ్వాండము నుండి గరుడుడు జన్మించుటను, అతని చరిత్రమును, పురస్కరించుకుని ఈ గరుడ పురాణము వెలసేనని మత్స్య పురాణములో చెప్పబడినది. అగ్ని పురాణము వలెననే ఈ పురాణము గూడా విజ్ఞాన సర్వస్వమని చెప్పవచ్చును. దీనిలో అనేక విషయములున్నవి. అన్ని పురాణములలో వలెనె దీనిలోను బ్రహ్మాదుల సృష్టి, వారు చేసిన ప్రతి సృష్టి, వంశములు, మన్వంతరములు, వంశములలోని ప్రసిద్దులైన రాజుల కధలు ఉన్నవి. యుగ ధర్మములు, పూజావిదానములు విష్ణుని దశావతారములు, అనేక ధర్మములు, ఆయుర్వేదము, చికిత్సా విధానములు, చంద శ్శాస్త్ర ప్రశంశ, వ్యాకరణము, గీతా సారాంశము మొదలగునవి అన్నియు వర్ణింప బడినవి. ఈ పురాణములో పూర్వ ఖండము ఉత్తర ఖండము అని యున్నవి. ఉత్తర ఖండములోని ప్రధమ భాగము ప్రేత కల్పము అని చెప్పబడును. చనిపోయిన వారి ఆత్మ శాంతి కై చేయదగిన కార్యము లన్నియు అందులో చెప్పబడినవి. కావున దానిని ఆ పది రోజులలో చదువుట ఆచారముగా నున్నది. తక్కిన భాగములన్నియు పవిత్రములో అన్ని పురాణముల వలెనె ఎప్పుడు కావలసిన అప్పుడు ఇంటిలో చదువుకొనుటకు వీలుగా నున్నవే. నైమిశారణ్యము లోని  శౌనకాది మునీంద్రులు సూతు నడుగగా, వారి కతడీ గరుడ పురాణము నిట్లు వివరించెను.

ROYAL KINGDOM GREEN HILLS

ROYAL KINGDOM GREEN HILLS Premium Frams, Tadkal, Sangareddy  Pin 8977111729

STARS

gtag('config', 'UA-93893754-1');