Monday, January 7, 2019

తిరుప్పావై ఇరవై మూడో 23 రోజు పాశురం

తిరుప్పావై ఇరవై మూడో 23 రోజు పాశురం

తిరుప్పావై ఇరవై మూడో 23 రోజు పాశురం

    మారి మలై ముళఞ్జిల్ మన్నిక్కిడన్దుఱఙ్గుమ్ 
    శీరియు శిఙ్గ మఱివిత్తు త్తీ విళిత్తు 
    వేరి మయిర్ పొఙ్గ వెప్పాడుమ్ పేర్ న్దు దఱి
    మూరి నిమిర్ న్దు ముళఙ్గిప్పుఱప్పట్టు
    పోదరు మాపోలే; నీ పూవైప్పూవణ్ణా! ఉన్ 
    కోయిల్ నిన్ఱిఙ్గనే పోన్దరుళి, కోప్పుడైయ 
    శీరియ శిఙ్గాసనత్తిరున్దు, యామ్ వన్ద 
    కారియమారాయ్ న్దరుళే లో రెమ్బావాయ్.

భావం 

వర్షా కాలములో చలనము లేకుండ పర్వత గుహలో ముడుచుకొని పరుండి నిద్రించుచున్న సింహము మేల్కొని, తీక్షణమైన తన చూపులతో నలుదెసలా పరికించినట్లును, పరిమళముగల తన జూలునిక్కబొడుచునట్లు అటునిటు దొర్లి, లేచి తన శరీరమును బాగుగ సాగదీసి, ఒళ్లు విరుచుకొని ఒక్క పెట్టున గర్జించి, గుహనుంచి రాజఠీవితో బయటకు వచ్చిన విధంగా అతసీ పుష్పపు రంగును కలిగిన ఓ స్వామీ! నీవు నీ భవనము నుండి ఆ సింహరాజము రీతిని వచ్చి, మనోహరంగా అలంకరింపబడిన యీ దివ్య సింహాసనమును అలంకరించవలె! అటుపై మేము వచ్చిన కార్యము ఎరుగవలె! ఎరిగి మా అభీష్టాన్ని అనుగ్రహించవలె!' అని స్వామిని గోపికలతో కూడిన ఆండాళ్ తల్లి తమ మనోభీష్టాన్ని తెలియజేసింది.

   అవతారిక

    'మమ్మల్ని కటాక్షింపవయ్యా!' అని ఎంత వేడినా పలుకకున్నవానిని చూచి, నీళాదేవి నాశ్రయించి ఆమె ద్వారా తన్ను చేరదామని యత్నిస్తున్న గోపికలు పడే శ్రమను చూచిన స్వామి 'అయ్యో! వీరినెంత బాధపెట్టితిని . వీరికి ముందుగనే, నేను కావలసినవి యిచ్చి వుండవలసినది. అని ఎంతో కలత చెందాడు, 'నావారినే నేను ఉపేక్షించాను. దినులై అర్ధించేటట్లు చేశాన' ని  ఎంతో బాధపడిన స్వామికి రామాయణ కాలంలో రాక్షసులనుంచి మునులను కాపాడటంలో ఆలసించిన ఘట్టం మనసులో మెదిలింది. ఆనాడు వారిని కష్టపేట్టినట్లుగానే నేడు యీ గోపకన్యలను కష్టపెడితినని కలత చెందాడు స్వామి. వెంటనే 'మీకేమికావలె' నని అడిగాడు. తప్పక మీ మనోభీష్టాన్ని తీరుస్తున్నాడు. 'మాకే కామనలు లేవు స్వామీ! నీవు నీ భవనము నుండి వచ్చి యీ సింహసనమున వేంచేయగా నీ సౌందర్యమును చూడగోరుదుమ' నిరి .అదే యీ (పాశురంలో) వర్ణితము.

        అసావేరి రాగము __ అదితాళము

    ప..    రారా! మా స్వామి రారా!
        తీరుగ మముజూచి కృపసేయగ రార!
        రార! మా స్వామి రారా!

    అ.ప..    లేర! శయన గృహమును వీడి రావేర!
        వర సింహసనమును జేర రావేర!
 
    చ....    గిరి గుహల శయనించి మేల్కొను సింహమై _ కే
        సరముల విదిలించి నలుదెసలు పరికించి
        గర్జించి అలసత __ విసర్జించి ఆరుదేరు
        వీర సింహము వోలె వేవేగ రావేర'

    చ..     అతసీ సుమము వంటి తిర మేనుగల స్వామి
        ఈ తడవు నీశయన మందిరము వీడవే!
        పూత సింహాసన మ్మధివసింపగ రావె!
        ఆశ్రితుల మనవి విని కరుణింపగ రావె!

ROYAL KINGDOM GREEN HILLS

ROYAL KINGDOM GREEN HILLS Premium Frams, Tadkal, Sangareddy  Pin 8977111729

STARS

gtag('config', 'UA-93893754-1');