తిరుప్పావై ఇరువది ఒకటవ పాశుర అనుసందానము
ఏత్త కలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప
మాత్తాదే పాల్ శొరియుం వళ్ళల్ పెరుం పశుక్కళ్
ఆత్త ప్పడైత్తాన్ మగనే! అఱివుఱాయ్
ఊత్త ముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్
తోత్తమాయ్ నిర్ఱ శుడరే! తుయిల్ ఎరాయ్
మాత్త్తార్ ఉనక్కు వలి తొలైందు ఉన్-వాశఱ్కణ్
ఆత్తాదు వందు ఉన్-అడిపణియుమా పోలే
పోత్తియాం వందోం పుగరందు-ఏలోర్ ఎంబావాయ్
భావం
పొదుగు క్రిందనుంచిన కడవలు చరచరనిండి, పొంగిపొరలునట్లు ఆగక, పాలు స్రవించు అసంఖ్యాకములగు, ఉదారములగు బలసిన ఆవులుగల నందగోపుని కుమారుడా ! మేల్కొనుము. ప్రమాణదార్థ్యముగల మహామహిమ సంపన్నా ! ఈ లోకములో ఆవిర్భవించిన జ్యోతిస్వరూపా ! నిద్రనుంచి లెమ్ము, శతృవులు నీ పరాక్రమమునకు లొంగి మేముకూడా నిన్ను వీడియుండలేక నీ పాదములనే స్తుతించి మంగళాశాసనము చేయుటకై వచ్చితిమి.
అవతారిక
గోపికలు పురుషాకార భూతురాలగు నీలాదేవిని మేల్కొలిపిరి. ఆమె మేల్కొని 'నేను మీలో ఒకదానిని కదా ! నన్ను ఆశ్రయించిన మీకు ఎన్నడును లోపము ఉండదు. రండి. మనమందరము కలసి శ్రీ కృష్ణుని మేల్కొలిపి అర్థింతుము.' అని తాను శ్రీ కృష్ణ భగవానుని సమీపమునకు వారిని తోడ్కొనిపోయి 'నీ గుణములకు ఓడి వచ్చినారము, అనుగ్రహింపుము'. అని ఈ పాశురమున నీలాదేవి గోపికలతో కూడి శ్రీ కృష్ణుని అర్థించుచున్నది.