Wednesday, January 23, 2019

శ్రీ గరుడ పురాణము

శ్రీ గరుడ పురాణము

ఒక కల్పాంత ప్రళయ కాలములో లోకములన్నియు నశించి జగమంతయు ఏకార్ణవ మై పోయెను. స్థావరములు లేవు. జంగమములు లేవు, సూర్య చంద్రులు లేరు, జగత్తులు లేవు, బ్రహ్మ లేదు అంతయు సర్వ శూన్యముగా నుండెను. అంతటను మహాంధకారము వ్యాపించి యుండెను. ఆ చీకటి కావల ఏదో ఒక మహా జ్యోతి. అది స్వయం ప్రకాశకమై వెలుగు చుండెను. అదియే సర్వ జగత్కారణ మైన మహస్సు.
ఆ జ్యోతి స్వరూపుడైన భగవానుని సంకల్ప బలము వలన ఆ మహా జల నిధిలో ఒక పెద్ద అండము (గ్రుడ్డు ) తేలు చుండెను. అది కొంత కాలమునకు చితికి రెండు చెక్కలయ్యెను. ఒకటి నేలగాను, మరొకటి ఆకాశముగాను అయ్యెను. ఆ యండము నుండి గరుత్మంతుని రూపములో నారాయణుడు ఆవిర్భవించెను. అతని నాభి కమలము నుండి బ్రహ్మ ఉదయించెను. అతడేమి చేయవలెనో తోచక దిక్కులు చూచు చుండగా "తప తప "అను మాటలు విన వచ్చెను. అంతట నతడు చుట్టును చూడగా తనను సృష్టించిన గరుడ రూపుడైన నారాయణుడు కనిపించెను. ఆ మూర్తినే అతడు ధ్యానించుచు కొన్ని వేల యేండ్లు తపము చేసి మానసిక శక్తిని సంపాదించెను. నారాయణుడతనిని సృష్టి చేయుమని యాదేశించెను.

బ్రహ్మ మనస్సంకల్పముతో ముందు సనక సనంద నాదులను సృజించాగా వారు సంసారము నందు వైరాగ్యము గలవారై తపమునకు బోయిరి. అప్పుడు ఈ చరాచర సృష్టి చేయుట తన యొక్కని వల్ల సాధ్యము గాదని, దక్ష మరీచి కశ్యపాది ప్రజా పతులను సృజించి, వారి వారికి తగిన భార్యలను గూడ సృష్టించి యిచ్చి, మీరు సృష్టిని వ్యాపింప జేయుడని యాదేశించెను. వారు తమ తండ్రి యాజ్ఞను శిరసావహించి సృష్టిని కొన సాగించిరి.
కశ్యప పుత్రుడైన గరుత్మంతుడు.

కశ్యపునికి చాలామంది భార్యలు గలరు. వారిలో వినత , కద్రువ అనే వారిద్దరు. వారిద్దరిలో కద్రువకు సవతి మచ్చరము హెచ్చు. కాని పతిని సేవించుటలో మాత్రము ఎవరి కెవరును తీసిపోరు. వినత సాదు స్వభావము కలది. ఆమె, గరుడ రూపుడైన శ్రీమన్నారాయణుడే సృష్టికి ఆది పురుషుడని విని అటువంటి కుమారుడు కావలెనని శ్రీహరిని గురించి తపము చేసెను. నారాయణు డామెను అనుగ్రహించి నీ గర్భమున గరుడుడుగా జన్మింతునని వరమిచ్చెను. ఆమె సంతోష భరితురాలయ్యేను.

ఆమె కొన్నాళ్ళకు గర్భవతి అయ్యెను. ఒకనాడు కద్రువ, వినతలు క్షీర సాగర తీరమునకు విహారమునకు బోయిరి. అక్కడ ఉచ్చైశ్శ్రవము కనబడెను. దానిని చూచి కద్రువ "గుఱ్ఱము శరీర మంతయు తెలుపే కాని తోక మాత్రము నున్న " దనెను. వినత " అదేమి ? అట్లనుచున్నావు ? తోక కూడా తెల్లగా నున్నది కదా ?" అనెను. కద్రువ , "కాదు నలుపే నల్లగా నున్నచో నీవు నాకు దాస్యము చేయవలెను. తెల్లగా నున్నచో నేను నీకు దాస్యము చేసెదను " అనెను. వినత " అయినచో పోయి చూతము రమ్మ "నెను. కద్రువ " ఇప్పటికే సంధ్యా కాలమైనది .మన భర్తకు కావలసినవి చూడవద్దా? నడువుము.

 రేపు ప్రొద్దున చూత" మని చేయిపట్టి తీసుకొని పోయెను. ఆ రాత్రి తన కుమారులైన వాసుకి తక్షక ప్రముఖులైన సర్ప రాజులను పిలిచి, "మీలో నల్లనివారు రేపు ఉదయమున ఉచ్చైశ్శ్రవము తోక పట్టుకుని వ్రేలాడుచు నల్లగా  కనబడునట్లు చేయు " డనెను. "విషయమే" మని వారడుగగా, జరిగినది చెప్పెను. వారిది అన్యాయమనిరి. ఆపని మేము చేయము అనిరి. ఆమె వారిని సర్పయాగాములో నశింపు చేసెను.

వినతకు దాస్యములో నుండగానే గరుత్మంతుడు జన్మించెను. అతనిని గూడ కద్రువ దాసీ కొడుకు గానే చూచెడిది. తన పిల్లలను (సర్పములను ) వీపు మీద నెక్కించుకుని త్రిప్పి తీసుకుని రమ్మని యాజ్ఞా పించెడిది గరుడుడు వారి నెక్కించుకుని సూర్య మండలము దాకా ఎగిరెడి వాడు. వారు ఆ సూర్యుని వేడికి కమిలి పోయెడి వారు. ఆ రోజున పాపము గరుడునికి ఉపవాసమే .సవతి తల్లి కోపముతో తిండి పెట్టెడిది కాదు. ఒకనాడు గరుడుడు తన తల్లి దగ్గరకు పోయి," మనకీ దురవస్థయే" మని ప్రశ్నించెను. ఆమె సర్వమును వినిపించెను. గరుడుడు కద్రువ దగ్గరకు వెళ్లి " ఏమిచ్చినచో నీవు నా తల్లిని దాస్య విముక్తి రాలీని చేసేద " నని యడిగెను. ఆమె " దేవలోకము నుండి అమృత భాండమును దెచ్చి ఇచ్చినచో నీ తల్లిని విడుతు " ననెను.

గరుడుడు తండ్రియగు కశ్యపు నొద్దకు వెళ్లి, తన తల్లి దాస్యమును, దాని విముక్తికి చేయవలసిన కార్యమును చెప్పి, ఇన్నాళ్ళును సరియైన ఆహారము లేక కృశించి యున్నాను. నాకు కడుపు నిండా భోజనము పెట్టు మని యడిగెను. కశ్యపుడు సముద్ర తీరమున విస్తరించు చున్న మ్లేచ్చ జాతిని భక్షింపు మనగా గరుడు డట్లు చేసెను. వారిలో చెడిన బ్రాహ్మణుడు ఒకడుండి గరుడని గొంతులో అడ్డుపడెను. వారికొరకు ఆమ్లేచ్చులను విడిచి పుచ్చెను. కశ్యపుడు గజ కచ్చపములు పోరాడుచున్నవి, వానిని దినుమనగా ఆ రెండింటిని రెండు కాళ్ళతో పట్టుకుని పోవుచు ఎక్కడ పెట్టుకుని తినవలెనని వెదుకుచు జంబూ వృక్షపు కొమ్మపై వ్రాలెను. అది విరిగెను. దానిపై వాల ఖిల్యాది మునులు బొటన వ్రేలంత ప్రమాణము గలవారుండి తపము చేసికొను చుండిరి అది తెలిసికొని ఆ కొమ్మను ముక్కుతో పట్టుకుని పదిలముగా మేరు శిఖరముపై దింపి తాను మరొక వైపున గూర్చుండి గజకచ్చపములను భక్షించెను. ఆ తరువాత దేవలోకమునకు వెళ్లి, అమృత కుంభమును దెచ్చు చుండగా రక్షకులు అడ్డగించిరి. వారిని గెలిచి వచ్చు చుండగా ఇంద్రుడు వచ్చి ఎదిరించి పోరాడెను.కాని గరుడుని గెలువలేక వజ్రాయుధమును ప్రయోగించెను. అది గూడా అతనిని ఏమియు చేయలేక పోయెను. అప్పుడు ఇంద్రుడు గరుడునితో " దేవతలకు సర్వస్వ మైన యీ యమ్రుతమును పాములకు పోయుట మంచిది కాదు. నీ ప్రయత్నము విరమింపు

ALL COVID 19 ITEMS AVAILABLE

  ALL COVID 19 ITEMS AVAILABLE  

STARS