Sunday, January 27, 2019

శ్రీ గరుడ పురాణము

శ్రీ గరుడ పురాణము

గరుడుని పుట్టుక


1 .దేవ యజ్ఞము : దీనినే వైశ్వ దేవ మందురు. గృహస్థులు గార్హ పత్యాగ్నిలో దేవతల నుద్దేశించి చేయుదురు. బ్రహ్మ చారులైనచో లౌకికమైన అగ్ని లేనే అగ్ని కార్యము చేయుదురు. (గృహస్థులు చేయునది మాత్రమే వైశ్వ దేవము) శూద్రులకు నమస్కారమే దేవ యజ్ఞ ఫలము నిచ్చును.


2 . పితృ యజ్ఞము : ఇది తల్లి దండ్రులు లేనివారు చేయునది. పితృ  వర్గమును, మాతృ వర్గమును చెప్పుచు స్వదాకారముతో జలముతో గాని, తిలలు గలిపిన జలముతో గాని తర్పణము చేయుటే పితృ యజ్ఞము. తండ్రి లేని వానికే తర్పణము చేయు అధికార ముండును. తండ్రి జీవించి యున్నప్పుడు తల్లి లేని వానికి గూడ తర్పణము చేయు అధికారము లేదని కొందరి మతము .

3 . భూత యజ్ఞము : గృహస్థుడు తాను భోజనము చేయుటకు ముందు ఇంటి పరిసరములలో తిరుగు కాకులకు ఇతర జంతులకును ఆహారము పెట్టుటయే భూత బలి. ఇది యెవ్వరైనను భూత దయ గలవారు చేయవచ్చును .

4 . మనుష్య యజ్ఞము : ఇంటికి వచ్చిన అతిదులను ,అభ్యాగతులను , సత్కరించి భోజనము పెట్టుట ,లేదా సాముహిక సమారాధనలు (అన్నదానములు) జరుగునపుడు యధాశక్తిగా ధనమును గాని వస్తు సంభారములను గాని ఇచ్చి సహకరించుట .

5 .బ్రహ్మ యజ్ఞము : ఋగ్వేదము ,యజుర్వేదము ,సామవేదము , అధర్వణ వేదము అను నాల్గింటిలో తమ శాఖకు చెందిన వేద భాగమును అధ్యయనము చేయుట , లేదా ! అధ్యయనము చేసిన దానిని పునశ్చరణము చేయుట బ్రహ్మ యజ్ఞ మనబడును. శూద్రాది వర్ణముల వారు బ్రహ్మ జ్ఞానులైన ఋషులు రచించిన పురాణములను ధర్మ శాస్త్రములను చదువుట లేక వినుట బ్రహ్మ యజ్ఞ మగును.

బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ప్రతి దినము ఉదయమునను., మద్యాహ్నమునను, సాయంకాలమునను మంత్ర యుక్తముగా సంధ్యో పాసనము చేయవలెను. " అహరహ స్సంధ్యా ముపాసీత " అని పెద్దల యాదేశము. శూద్రాది వర్ణములవారు ఉదయముననే స్నానము చేసి జగత్కర్మ సాక్షి యైన సూర్యునికి నమస్కారము చేసి ధ్యానించి నచో అది సంధ్యా వందన మగును. సాయంకాలము కూడా ఇట్లే చేయవలెను .

దానములు - ధర్మములు

దానములు వేరు, ధర్మములు వేరు దాన మనగా ఇచ్చెడి వస్తువు నందు మమత్వమును విడిచి ఇతరుల కిచ్చునది . ధర్మమనగా ప్రజోపయోగార్ధ మై చేయు ఇష్టా పూర్త రూపమైనది. దిగుడు బావులు, మంచినీటి నూతులు చెరువులు త్రవ్వించుట, దేవాలయ నిర్మాణము, ఉద్యానవనములు, పండ్ల తోటలు నాటించుట మొదలగు కార్యములు ధర్మములోనికి వచ్చును. అగ్నిహొత్రము, తపస్సు, సత్య వ్రతము, వేదాధ్యయనము, అతిధి మర్యాద, వైశ్వదేవము ఇట్టి వానిని ఇష్టము లందురు.

సూర్య, చంద్ర గ్రహణ సమయములలో ఇచ్చు దానము వలన దాత స్వర్గాది పుణ్య లోకములను బొందును. దేశమును, కాలమును, పాత్రతను (యోగ్యతను) గమనించి ఇచ్చిన దానము కోటి గుణిత మగును. కర్కాటక, మకర సంక్రమణము లందును అమావశ్య,పూర్ణిమాది పర్వములందును చేసెడి దానము విశేష ఫలము నిచ్చును. దాత తూర్పు ముఖముగా కూర్చుండి సంకల్పము, గోత్రనామములతో జెప్పి దాన మీయవలెను. పుచ్చుకొనువాడు ఉత్తరాభి ముఖుడై స్వీకరింపవలెను. అట్లు చేసినచో దాతకు ఆయుర్దాయము పెరుగును. గ్రహీతకు పుచ్చుకున్నది అక్షయ మగును.

మహాదానములు పది 

శ్లో || కనకా శ్వతి లానాగా దాసీరధ మహీ గృహాః ||
కన్యాచ కపిలా దేను: మహా దానాని వైదశ ||

తా || బంగారము, గుఱ్ఱము, తిలలు, ఏనుగులు,దాసీ జనము, రధములు, భూమి, గృహములు, కన్యక నల్లని ధేనువు వీనిని మహా దానము లనిరి. ఇవి పది. దేవతలకు గాని, బ్రాహ్మణులకు గాని, గురువులకు గాని, తల్లి దండ్రులకు గాని ఇచ్చెదనని వాగ్దానము చేసిన దానిని ఇయ్యక ఎగ గొట్టినచో వంశ నాశనము జరుగును. ప్రతి గ్రహీత నుండి ఏదో లాభము నాశించి దాన మిచ్చినచో అది నిష్ప్రయోజన మగును. ప్రతి గ్రహీత నుద్దేశించి దానము చేయుచు, ఆ దాన ధారను భూమిపై విడిచినచో ఆ దాన ఫలము మహా సాగరము కన్నా అనంతమైనది యగును. గౌతమీ, గంగా, గయా, ప్రయాగాది తీర్ధము లందిట్టి దానములు విశేష ఫలముల నిచ్చును. వైవస్వత మన్వంతరము లోని వ్యాసులు

ఇప్పుడు జరుగుచున్నది వైవస్వత మన్వంతరములో ఇరువది యెనిమిదవ మహాయాగము. అందులోను కలియుగము వ్యాసుడు జన్మించి వేదాలు నాలుగుగా విభజించి, పదునెనిమిది పురాణములు రచించినది, దీనికి వెనుక ద్వాపర యుగములోనే గతించిన ఇరువది యేడు మహాయాగములలోను ద్వాపరములందు ఇరువది యేడుగురు వ్యాసులు జనియించిరి. ప్రతి కలియుగములో ను మానవుల శక్తి సామర్ద్యములు పూర్వ యుగములలో కంటే అల్పముగా నుండును. వారు అనంతములైన వేదములను అధ్యయనము చేయలేరు. అందు నిక్షిప్తమైన నిగూఢ ధర్మములను గ్రహించి ఆచరింప లేరు. అందుచేత ప్రతి మహాయాగము లోను ఒక వ్యాసుడు జనించి ఆ వేద రాశిని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అను నాలుగు విభాగములు చేసి ఒక్కొక్క శాఖను కొన్ని వంశముల బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణముల వారు అధ్యయనము చేయవలెనని నియమించినారు. అంతే కాదు; ఆవేదాలలోని ధర్మములను భోదించుటకై పదునెనిమిది పురాణములను, పదునెనిమిది ఉప పురాణములును వెలసినవి. గతించిన ఇరువది యేడు ద్వాపర యుగములలోను జన్మించిన వ్యాసులు వీరు :
మొదటి మహాయుగమున ద్వాపరములోని వ్యాసుడు స్వాయుంభువ మనువు

రెండవ ద్వాపరములో                                                      ప్రజాపతి
మూడవ ద్వాపరములో                                                   ఉశ నసుడు
నాలుగవ ద్వాపరములో                                                  బృహస్పతి
ఐదవ ద్వాపరములో                                                       సవితృడు
ఆరవ ద్వాపరములో                                                       మృత్యువు
ఏడవ ద్వాపరములో                                                       ఇంద్రుడు
ఎనిమిదవ ద్వాపరములో                                                వసిష్టుడు
తొమ్మిదవ ద్వాపరములో                                                సారస్వతుడు
పదవ ద్వాపరములో                                                       త్రిధాముడు
పదునొకండవ ద్వాపరములో                                           త్రివృషుడు
పండ్రెండవ ద్వాపరములో                                               శత తేజుడు
పదమూడవ ద్వాపరములో                                            ధర్ముడు
పదునాలుగవ ద్వాపరములో                                          తరక్షుడు
పదునైదవ ద్వాపరములో                                                త్ర్యారుణి
పదునారవ ద్వాపరములో                                               ధనంజయుడు
పదునేడవ ద్వాపరములో                                                కృతంజయుడు
పదునెనిమిదవ ద్వాపరములో                                         ఋతంజయుడు
పందొమ్మిదవ ద్వాపరములో                                            భరద్వాజుడు
ఇరువదవ ద్వాపరములో                                                 గౌతముడు
ఇరువదొక్కటవ ద్వాపరములో                                          రాజశ్రవుడు
ఇరువది రెండవ ద్వాపరములో                                         శుష్మాయణుడు
ఇరువది మూడవ ద్వాపరములో                                       తృణబిందుడు
ఇరువది నాలుగవ ద్వాపరములో                                      వాల్మీకి
ఇరువది ఐదవ ద్వాపరములో                                           శక్తి
ఇరువది యారవ ద్వాపరములో                                        పరాశరుడు
ఇరువది యేడవ ద్వాపరములో                                         జాతూకర్ణుడు
ఇరువది ఎనిమిదవ ద్వాపరములో                                    కృష్ణ ద్వైపాయనుడు

ఈ కృష్ణ ద్వైపాయనుడు బ్రహ్మ శాసనము మీద వేదములను నాలుగుగా విభజించి పైల, జైమిని, సుమంతు, వైశంపాయనులను శిష్యులకు భోదించి, అష్టాదశ పురాణములను రచించిరో మహర్షణునకు (సూతునికి ) బోధించి లోకములో వ్యాపింప జేసెను .

Saturday, January 26, 2019

26th JANUARY REPUBLIC DAY 70th meghala technologies

26th JANUARY REPUBLIC DAY

Republic Day

India celebrates the Republic Day every year on the 26th of January since 1950 when Constitution of India came into force. Republic Day in India is of great importance in the history as it tells us all about each and every struggle of Indian freedom. People who were fighting for Independence of India took a pledge on the same day in 1930 at the banks of River Ravi in Lahore to achieve a complete independence (Poorna Swarajya) of India, which came true in the year 1947 on 15th of August.

Thursday, January 24, 2019

శ్రీ గరుడ పురాణము

శ్రీ గరుడ పురాణము

" మనెను. దానికి గరుడుడు " నా తల్లి దాస్య విముక్తి కై ఈ పని చేయుచున్నాను. దీనిని నా సవతి తల్లికి ఇచ్చినచో నా తల్లి విముక్తురాలగును." అనెను . " ఐనచో నీవు దీనిని నీ సవతి తల్లికిమ్ము ఆమె, నీ తల్లికి దాస్య విముక్తి యైనదని చెప్పగానే, అదృశ్య రూపుడనై వచ్చి ఈ యమృత కలశమును గొని పోయెదను. దీనికి నీవంగీకరింపుము" అనెను. గరుడుడు ఒప్పుకొనెను. అమృత భాండమును కద్రువ చేతిలో బెట్టి, " మా తల్లికి దాస్య విముక్తి కలిగినట్లే కదా !" అనగా ఆమె అవుననెను. వెంటనే ఆమె చేతిలోని అమృత కలశము అదృశ్య మై పోయెను. అనగా ఇంద్రుడపహరించెను.

ఈ విధముగా తల్లికి స్వాతంత్ర్యము కలిగించిన గరుడుడు తల్లి దీవెనలు పొంది తండ్రి దగ్గరకు వెళ్లి విషయము నంతను వివరించెను. ఆయన తన కుమారుని పరాక్రమ విశేషములకు సంతోషించి," కుమారా ! ఆది పురుషుడైన శ్రీమన్నారాయణుని గూర్చి తపము చేసి యనుగ్రహము సంపాదింపుము. ధర్మవర్తనుడవై యుండుము. నీకు త్రిలోక ము లందును ఎదురుండదు." అని చెప్పెను. తండ్రి హిత భోదను విని గరుడుడు శ్రీ హరిని గూర్చి తీవ్రమైన తపము చేసెను. చాలాకాలము అట్లు చేయ శ్రీనాధుడు ప్రత్యక్షమై "గరుడా ! నీ భక్తికి మెచ్చినాను. నీవు నాకు వాహనమై యుండి నేను చెప్పిన పనులు నిర్వర్తింపు చుండుము." అని వరమిచ్చి తనకు వాహనముగా జేసికొనెను.

 గరుడుని గర్వ భంగము

ఒకప్పుడు గరుత్మంతునికి, తాను మహా బలవంతుడనని గర్వము కలిగెను. తాను తక్కువవాడా ? గజ కచ్చపములను చెరియొక కాలితో పట్టుకొని కొన్ని యోజనముల దూరము ఎగురుట, అంతమంది రక్షకులను గెలిచి దేవలోకమున నున్న అమృతమును దెచ్చుట, ఇంద్రుని వజ్రాయుధమునకు బెదర కుండుట సామాన్య విషయములా ? అవన్నియు ఎందుకు ? సకల బ్రహ్మాండ భాండములను తన కడుపులో బెట్టుకున్న ఆ శ్రీ మహా విష్ణువును అనాయాసముగా వహించుచు లోకములన్నియు దిరుగుచున్న తన కంటే బలవంతుడీ చతుర్దశ భువనములలో ఇంకెవడున్నాడని గర్వ పడ సాగెను. దానితో అందరిని కొంత చులకనగా జూచుచు ప్రవర్తింప జొచ్చెను. ఇది నారాయణుని దృష్టిలో బడినది . ఇతనికెట్లయినను గర్వ భంగము చేయవలెనని సంకల్పించెను.

ఒకనాడు నారదాది మునులు శ్రీ పతిని దర్శించుటకై వచ్చిరి. విష్ణుమూర్తి వారితో మాటలాడుచు అలవోకగా ప్రక్కనున్న గరుడునిపై చేయి వేసెను. మునులతో మాధవుని సంభాషణ సాగుచుండెను. గరుడునికి విష్ణుమూర్తి చేయి భరించ లేనంత బరువుగా నుండెను. ప్రాణములు కడ బట్టు చుండెను. సంభాషణ ఎంతసేపు సాగినదో కాని గరుడు డీలోపున ప్రాణ వశిష్టు డయ్యెను. ఎప్పటికో మునులు సెలవు దీసుకుని వెళ్ళిరి. శ్రీ హరి అప్పుడా చేయి గరుడుని మీద నుండి తీసెను. గరుడప్పటికే సొమ్మసిల్లి పడిపోయెను.

శ్రీ హరి అతనిని మృదువుగా సృశించెను. గరుడుడా స్పర్శతో తేరుకుని, విష్ణు మూర్తి పాదములపై బడి," ఓ మహాపురుషుడా ! నీకన్న సృష్టిలో అధికు లెవ్వరును లేరు ఈ పరమార్ధమును గ్రహింపలేక గర్వాందుడనైన నాకు సరియైన పాటమును చెప్పితివి, నా యాపరాధమును మన్నింపు " మని వేడుకొనెను. శ్రీ హరి ప్రసన్నుడయ్యెను 

నవగ్రహములు - రత్నములు

సూర్యాది నవగ్రహములకును తొమ్మిది విధములైన రత్నములు నిర్దేశింప బడినవి .ఆకాశములో నున్న ఈ గ్రహముల కాంతులు సరిగా మనపై ప్రసరింపక పోవచ్చును. ఆ కాంతులు మన శరీరముపై బడినచో అనేక అనారోగ్యములు తొలగుటయే కాక ,ఆయా గ్రహములు విషమ స్థానములందున్నచో సత్ఫలితములను, మంచి స్థానము లందున్నచో విశేష ఫలములను కలిగించును. అందుచేత నవరత్నముల ఉంగరములను ధరించుట నవగ్రహ ప్రీతి కొరకే అని గ్రహింప వలెను. ఆయా గ్రహములకు చెప్పబడిన రత్నములు క్రింద నీయబడు చున్నవి .

1 .సూర్యుడు -- పద్మరాగము (కెంపు)
2 . చంద్రుడు -- ముత్యము
3 .అంగారకుడు - పగడము
4 .బుధుడు -- ఆకుపచ్చ
5 .గురుడు --పుష్యరాగము (గరుడ పచ్చ )
6 .శుక్రుడు --వజ్రము
7 .శని -- నీలము (ఇంద్ర నీలము )
8 .రాహువు - గోమేధికము
9 . కేతువు -- వైడూర్యము
పంచ మహా యజ్ఞములు
"యజ ఆరాధనే ", అను ధాతువు నుండి పుట్టినది యజ్ఞ శబ్దము పృధ్విలో పుట్టిన ప్రతి మానవుడు ను ప్రతి దినమును ఈ యజ్ఞములు ఆచరించ వలెను. ఈ యజ్ఞములు ఐదు .1 . దేవ యజ్ఞము  2 . పిత్రు యజ్ఞము  3 . భూత యజ్ఞము  4 . మనుష్య యజ్ఞము 5 . బ్రహ్మ యజ్ఞము .

Wednesday, January 23, 2019

శ్రీ గరుడ పురాణము

శ్రీ గరుడ పురాణము

ఒక కల్పాంత ప్రళయ కాలములో లోకములన్నియు నశించి జగమంతయు ఏకార్ణవ మై పోయెను. స్థావరములు లేవు. జంగమములు లేవు, సూర్య చంద్రులు లేరు, జగత్తులు లేవు, బ్రహ్మ లేదు అంతయు సర్వ శూన్యముగా నుండెను. అంతటను మహాంధకారము వ్యాపించి యుండెను. ఆ చీకటి కావల ఏదో ఒక మహా జ్యోతి. అది స్వయం ప్రకాశకమై వెలుగు చుండెను. అదియే సర్వ జగత్కారణ మైన మహస్సు.
ఆ జ్యోతి స్వరూపుడైన భగవానుని సంకల్ప బలము వలన ఆ మహా జల నిధిలో ఒక పెద్ద అండము (గ్రుడ్డు ) తేలు చుండెను. అది కొంత కాలమునకు చితికి రెండు చెక్కలయ్యెను. ఒకటి నేలగాను, మరొకటి ఆకాశముగాను అయ్యెను. ఆ యండము నుండి గరుత్మంతుని రూపములో నారాయణుడు ఆవిర్భవించెను. అతని నాభి కమలము నుండి బ్రహ్మ ఉదయించెను. అతడేమి చేయవలెనో తోచక దిక్కులు చూచు చుండగా "తప తప "అను మాటలు విన వచ్చెను. అంతట నతడు చుట్టును చూడగా తనను సృష్టించిన గరుడ రూపుడైన నారాయణుడు కనిపించెను. ఆ మూర్తినే అతడు ధ్యానించుచు కొన్ని వేల యేండ్లు తపము చేసి మానసిక శక్తిని సంపాదించెను. నారాయణుడతనిని సృష్టి చేయుమని యాదేశించెను.

బ్రహ్మ మనస్సంకల్పముతో ముందు సనక సనంద నాదులను సృజించాగా వారు సంసారము నందు వైరాగ్యము గలవారై తపమునకు బోయిరి. అప్పుడు ఈ చరాచర సృష్టి చేయుట తన యొక్కని వల్ల సాధ్యము గాదని, దక్ష మరీచి కశ్యపాది ప్రజా పతులను సృజించి, వారి వారికి తగిన భార్యలను గూడ సృష్టించి యిచ్చి, మీరు సృష్టిని వ్యాపింప జేయుడని యాదేశించెను. వారు తమ తండ్రి యాజ్ఞను శిరసావహించి సృష్టిని కొన సాగించిరి.
కశ్యప పుత్రుడైన గరుత్మంతుడు.

కశ్యపునికి చాలామంది భార్యలు గలరు. వారిలో వినత , కద్రువ అనే వారిద్దరు. వారిద్దరిలో కద్రువకు సవతి మచ్చరము హెచ్చు. కాని పతిని సేవించుటలో మాత్రము ఎవరి కెవరును తీసిపోరు. వినత సాదు స్వభావము కలది. ఆమె, గరుడ రూపుడైన శ్రీమన్నారాయణుడే సృష్టికి ఆది పురుషుడని విని అటువంటి కుమారుడు కావలెనని శ్రీహరిని గురించి తపము చేసెను. నారాయణు డామెను అనుగ్రహించి నీ గర్భమున గరుడుడుగా జన్మింతునని వరమిచ్చెను. ఆమె సంతోష భరితురాలయ్యేను.

ఆమె కొన్నాళ్ళకు గర్భవతి అయ్యెను. ఒకనాడు కద్రువ, వినతలు క్షీర సాగర తీరమునకు విహారమునకు బోయిరి. అక్కడ ఉచ్చైశ్శ్రవము కనబడెను. దానిని చూచి కద్రువ "గుఱ్ఱము శరీర మంతయు తెలుపే కాని తోక మాత్రము నున్న " దనెను. వినత " అదేమి ? అట్లనుచున్నావు ? తోక కూడా తెల్లగా నున్నది కదా ?" అనెను. కద్రువ , "కాదు నలుపే నల్లగా నున్నచో నీవు నాకు దాస్యము చేయవలెను. తెల్లగా నున్నచో నేను నీకు దాస్యము చేసెదను " అనెను. వినత " అయినచో పోయి చూతము రమ్మ "నెను. కద్రువ " ఇప్పటికే సంధ్యా కాలమైనది .మన భర్తకు కావలసినవి చూడవద్దా? నడువుము.

 రేపు ప్రొద్దున చూత" మని చేయిపట్టి తీసుకొని పోయెను. ఆ రాత్రి తన కుమారులైన వాసుకి తక్షక ప్రముఖులైన సర్ప రాజులను పిలిచి, "మీలో నల్లనివారు రేపు ఉదయమున ఉచ్చైశ్శ్రవము తోక పట్టుకుని వ్రేలాడుచు నల్లగా  కనబడునట్లు చేయు " డనెను. "విషయమే" మని వారడుగగా, జరిగినది చెప్పెను. వారిది అన్యాయమనిరి. ఆపని మేము చేయము అనిరి. ఆమె వారిని సర్పయాగాములో నశింపు చేసెను.

వినతకు దాస్యములో నుండగానే గరుత్మంతుడు జన్మించెను. అతనిని గూడ కద్రువ దాసీ కొడుకు గానే చూచెడిది. తన పిల్లలను (సర్పములను ) వీపు మీద నెక్కించుకుని త్రిప్పి తీసుకుని రమ్మని యాజ్ఞా పించెడిది గరుడుడు వారి నెక్కించుకుని సూర్య మండలము దాకా ఎగిరెడి వాడు. వారు ఆ సూర్యుని వేడికి కమిలి పోయెడి వారు. ఆ రోజున పాపము గరుడునికి ఉపవాసమే .సవతి తల్లి కోపముతో తిండి పెట్టెడిది కాదు. ఒకనాడు గరుడుడు తన తల్లి దగ్గరకు పోయి," మనకీ దురవస్థయే" మని ప్రశ్నించెను. ఆమె సర్వమును వినిపించెను. గరుడుడు కద్రువ దగ్గరకు వెళ్లి " ఏమిచ్చినచో నీవు నా తల్లిని దాస్య విముక్తి రాలీని చేసేద " నని యడిగెను. ఆమె " దేవలోకము నుండి అమృత భాండమును దెచ్చి ఇచ్చినచో నీ తల్లిని విడుతు " ననెను.

గరుడుడు తండ్రియగు కశ్యపు నొద్దకు వెళ్లి, తన తల్లి దాస్యమును, దాని విముక్తికి చేయవలసిన కార్యమును చెప్పి, ఇన్నాళ్ళును సరియైన ఆహారము లేక కృశించి యున్నాను. నాకు కడుపు నిండా భోజనము పెట్టు మని యడిగెను. కశ్యపుడు సముద్ర తీరమున విస్తరించు చున్న మ్లేచ్చ జాతిని భక్షింపు మనగా గరుడు డట్లు చేసెను. వారిలో చెడిన బ్రాహ్మణుడు ఒకడుండి గరుడని గొంతులో అడ్డుపడెను. వారికొరకు ఆమ్లేచ్చులను విడిచి పుచ్చెను. కశ్యపుడు గజ కచ్చపములు పోరాడుచున్నవి, వానిని దినుమనగా ఆ రెండింటిని రెండు కాళ్ళతో పట్టుకుని పోవుచు ఎక్కడ పెట్టుకుని తినవలెనని వెదుకుచు జంబూ వృక్షపు కొమ్మపై వ్రాలెను. అది విరిగెను. దానిపై వాల ఖిల్యాది మునులు బొటన వ్రేలంత ప్రమాణము గలవారుండి తపము చేసికొను చుండిరి అది తెలిసికొని ఆ కొమ్మను ముక్కుతో పట్టుకుని పదిలముగా మేరు శిఖరముపై దింపి తాను మరొక వైపున గూర్చుండి గజకచ్చపములను భక్షించెను. ఆ తరువాత దేవలోకమునకు వెళ్లి, అమృత కుంభమును దెచ్చు చుండగా రక్షకులు అడ్డగించిరి. వారిని గెలిచి వచ్చు చుండగా ఇంద్రుడు వచ్చి ఎదిరించి పోరాడెను.కాని గరుడుని గెలువలేక వజ్రాయుధమును ప్రయోగించెను. అది గూడా అతనిని ఏమియు చేయలేక పోయెను. అప్పుడు ఇంద్రుడు గరుడునితో " దేవతలకు సర్వస్వ మైన యీ యమ్రుతమును పాములకు పోయుట మంచిది కాదు. నీ ప్రయత్నము విరమింపు

Tuesday, January 22, 2019

శ్రీ గరుడ పురాణము

శ్రీ గరుడ పురాణము

పరిచయము : గరుడ పురాణము అనగానే చాలామంది ,అదేదో అశుభ పురాణ మనియు, ఎవరో చనిపోయినప్పుడే తప్ప వట్టి రోజులలో చదువకూడదనియు ఒక దురభిప్రాయము లోకములో నాటుకు పోయినది. కాని అది సరియైనది కాదు. ఇది, విష్ణు మహత్యమును దెలుపు వైష్ణవ పురాణము. నారద పురాణములో దీనిని గురించి - " మరీచే శృణు వచ్మద్య పురాణం గారుడం శుభమ్. గరుడా యాబ్ర వీత్ పృష్నో భగవాన్ గరుడాసనః" అని శుభమును గలిగించు పురాణముగా చెప్ప బడినది .

గారుడ కల్పములో విశ్వాండము నుండి గరుడుడు జన్మించుటను, అతని చరిత్రమును, పురస్కరించుకుని ఈ గరుడ పురాణము వెలసేనని మత్స్య పురాణములో చెప్పబడినది. అగ్ని పురాణము వలెననే ఈ పురాణము గూడా విజ్ఞాన సర్వస్వమని చెప్పవచ్చును. దీనిలో అనేక విషయములున్నవి. అన్ని పురాణములలో వలెనె దీనిలోను బ్రహ్మాదుల సృష్టి, వారు చేసిన ప్రతి సృష్టి, వంశములు, మన్వంతరములు, వంశములలోని ప్రసిద్దులైన రాజుల కధలు ఉన్నవి. యుగ ధర్మములు, పూజావిదానములు విష్ణుని దశావతారములు, అనేక ధర్మములు, ఆయుర్వేదము, చికిత్సా విధానములు, చంద శ్శాస్త్ర ప్రశంశ, వ్యాకరణము, గీతా సారాంశము మొదలగునవి అన్నియు వర్ణింప బడినవి. ఈ పురాణములో పూర్వ ఖండము ఉత్తర ఖండము అని యున్నవి. ఉత్తర ఖండములోని ప్రధమ భాగము ప్రేత కల్పము అని చెప్పబడును. చనిపోయిన వారి ఆత్మ శాంతి కై చేయదగిన కార్యము లన్నియు అందులో చెప్పబడినవి. కావున దానిని ఆ పది రోజులలో చదువుట ఆచారముగా నున్నది. తక్కిన భాగములన్నియు పవిత్రములో అన్ని పురాణముల వలెనె ఎప్పుడు కావలసిన అప్పుడు ఇంటిలో చదువుకొనుటకు వీలుగా నున్నవే. నైమిశారణ్యము లోని  శౌనకాది మునీంద్రులు సూతు నడుగగా, వారి కతడీ గరుడ పురాణము నిట్లు వివరించెను.

Monday, January 14, 2019

తిరుప్పావై ముప్పయివ 30 పాశురం

తిరుప్పావై  ముప్పయివ 30 పాశురం

తిరుప్పావై  ముప్పయివ 30 పాశురం

        వఞ్గక్కడల్ కడైన్ద మాడవనై క్కేశవనై
        త్తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళ్ళై యార్ శేన్ణిఱైఞ్ఙ
        అఞ్గప్పఱైకోణ్ణవాత్తై, యణిపుదువై
        పైఙ్గమలత్తణ్దెరియల్ పట్టర్ పిరాన్ కొదైశొన్న
        శజ్ఞత్తమిళ్ మాలై ముప్పుదుమ్ తప్పామే
        ఇఙ్గిప్పరిశురైప్పా రీరిరణ్దు మాల్వరైత్తోళ్
        శేఙ్గిణ్ తిరుముగుత్తు చ్చెల్వ త్తిరుమాలాల్
        ఎఙ్గమ్ తిరువరుళ్ పెత్తుఇంబరువరెమ్బావాయ్
        అణ్దాల్ తిరువడిగళే శరణమ్

భావం
       ఓడలుగల పాల సముద్రమును దేవతలకోసం మధించి, వారికి అమృతాన్ని ప్రసాదించినవాడును, బ్రహ్మరుద్రాదులకు ప్రభువైనట్టి నారాయణుని చంద్రముఖలైన గోపికలు ఆలంకృతులై చేరి, మంగళాశాసనము చేసి, గోకులమునందు 'పఱై' అను వంకతో స్వామీ కై౦కర్యమును పొందారు. వీరు పొందిన యీ కై౦కర్య విధమునంతను అలంకారమైన శ్రీవిల్లిపుత్తూరులో అవతరించినట్టియును, తామర పూసల మాలలను ధరించిన పేరియాళ్ళార్ల (విష్ణుచిత్తుల) పుత్రికయైన గోదాదేవి (అండాళ్ తల్లి) సాయించింది. ఇది గోపికలు గుంపులు గుంపులుగ కూడి అనుభవించిన ప్రబంధమై, ద్రావిడ భాషలో పాశురరూపంగా ప్రవహించింది. ఈ ముప్పుది పాశురాలను ఒక్కటిని కూడా విడువకుండ యీ సంసారమున అనుసంధి౦చువారు గొప్ప పర్వతవలెనున్న నాల్గు భుజములును ఆశ్రిత వాత్సల్యముచే ఎఱ్ఱబారిన కనుదోయిగల శ్రీముఖమును. ఉభయ విభూతి ఐశ్వర్యములందునుగల శ్రియ: పతియొక్క సాటిలేని దివ్య కృపను పొంది, బ్రహ్మనందముతో కూడినవారై యుండగలరు. శ్రీ గోదా రంగనాథుల అవ్యాజకృపచే యీ 'తిరుప్పావై' ద్రవిడ దివ్య ప్రబంధమును తెలుగున' శ్రీసూక్తిమాలిక' గ' ప్రవహింపచేసి పాడించుకున్న వారి దివ్యవాత్సల్యమునకు యీ దాసుడు రంగనాథుడు ఆజన్మ కృతజ్ఞతాంజలులు ఘటిస్తున్నాడు.
        *శ్రీ సూక్తి మాలిక సంపూర్ణమ్*   
        *శ్రీ అండాళ్ దివ్య తిరువడిగళే శరణమ్*

    అవతారిక 
ఇది ధనుర్మాస వ్రతంలోని 30వ (మాలిక) ఈ వ్రతాన్ని చేసినవారికి లభించే ఫలాన్ని గూర్చి వివరించిన (మాలిక). ఎన్నడో ద్వాపర యుగంలో వ్రేపల్లెలోని గోపికలాచరించిన కాత్యాయనీ వ్రతాన్ని శ్రీ అండాళ్ తల్లి కలియుగంలో తానాచరించి తరించింది. ఈ 30 రోజుల వ్రతానుష్టానం వలన _ భక్తి ప్రవత్తులతో భగవంతుని సాన్నిధ్యాన్ని పొందవచ్చునని నిరూపించింది తల్లి. అత్యంత నిష్టతో ఆచరించిన యీ వ్రతంవలన అజ్ఞానులు సైతం భగవత్సాక్షాత్కారాన్ని పొందగలరని నిరూపించింది. తాను అనుసరించి, యితరులచే అనుసరింపచేసి మార్గదర్శుకురాలై, ఆచార్య పురుషకారాన్ని వహించి మనబోటివారలను తరింపచేయ సమకట్టి, తల్లి మనకనుగ్రహించినదీ వ్రతాన్ని. ఈ 'తిరుప్పావై' దివ్య ప్రపందాన్ని అనుసంధించి మనమూ తరిద్దా౦! అమ్మా ఋణాన్ని తీర్చుకొందాం శ్రీ సూక్తి మాలికలు పాడుకుందాం!
        *(శంకరాభరణము _ ఝుంపెతాళము)*

    ప.     శ్రీసూక్తి మాలిక! ఆనంద డోలిక!
        కేశవుని వ్రతకల్ప ద్రవిడ సుమ మాలిక!
    అ..ప..    పాశురపు పేటిక ముప్పుదుల కానుక!
        ఆశువుగ గోదపాడిన గీతమాలిక!
 
    1. చ..    పాలకడలిక ఓడలున్నను సురలకై
        లీలగ మధించిన కేశువుని జేరి
        గొల్లెతలు చంద్రముఖులా యలంకృతులు
        నల్లనయ్యకు కృపా పాత్రులైన విధమ్ము
        ఉల్లమలరగ గోద గీతముల పాడినది
        శ్రీ సూక్తి మాలిక......

    2.చ..    ఈ పాశురమ్ములను ముప్పదిని విడువక
        గోపాల సన్నిధిని నిత్యమనుసధింప
        గోపదేవుని పూర్ణా కృపగల్గు గాక! యని
        గోపతిని కొలిచిన విష్ణుచిత్తుని తనయ
        శ్రీ పాదములే మనకు శరణమని చూపినది.
        శ్రీ సూక్తి మాలిక! ఆనంద డోలిక!
        కేశవుని వ్రతకల్ప ద్రవిడమును మాలిక!

    *(పుష్పములతో ఈ క్రింది కృష్ణాష్టోత్తర, గోదాష్టోత్తర శతనామములు చెప్పుచూ హృదయమును పుష్పమును చూపిస్తూ దానియందు ప్రేమనింపి అర్చన చేయాలి)*

ఓం   కేశవాయ నమః             ఓం వాసుదేవాయ నమః
ఓం   నారాయణాయ నమః      ఓం ప్రధ్యుమ్నాయ నమః
ఓం  మాధవాయ నమః           ఓం అనిరుద్దాయ నమః
ఓం  గోవిన్డాయ నమః              ఓం పురుషోత్తమాయ నమః
ఓం విష్ణువే నమః                   ఓం అధోక్షజాయ నమః
ఓం మధుసూదనాయ నమః    ఓం నారసింహియ నమః
ఓం  త్రివిక్రమాయ నమః          ఓం అచ్యుతాయ నమః
ఓం వామనాయ నమః            ఓం జనార్దనాయ నమః
ఓం శ్రీ ధరాయ నమః               ఓం ఉపేంద్రాయ నమః
ఓం హృషీకేశాయ నమః           ఓం హరయే నమః
ఓం పద్మనాభాయ నమః          ఓం శ్రీ కృపాయ నమః
ఓం దామోదరాయ నమః          ఓం  సంకర్షణాయ నమః

Sunday, January 13, 2019

తిరుప్పావై ఇరవై తొమ్మిదవ 29 రోజు పాశురం

తిరుప్పావై ఇరవై తొమ్మిదవ 29
రోజు పాశురం


తిరుప్పావై రేపటి ఇరవై తొమ్మిదవ 29 రోజు పాశురం
        శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు ఉన్    
        పొత్తామరై యడియే పోత్తుమ్ పోరుళ్ కేళాయ్;
        పెత్తమ్మేయ్ త్తుణ్ణు జ్కులత్తిన్ పిఱన్ద నీ,
        కుత్తేవల్గెళై క్కోళ్వామల్ పోకాదు; 
        ఇతైప్పఱై కోళ్వానన్దుకాణ్ గొవిన్దా:
        ఎత్తైక్కు  మేళేళు పిఱవిక్కుమ్, ఉన్దన్నో
        డుత్తోమే యావో మునక్కే నామాళ్ శేయ్ వోమ్,
        మత్తైనజ్కా మఞ్గళ్ మాత్తేలో రెమ్బావాయ్

భావం

ఓ స్వామీ! శ్రీకృష్ణా! నీ పాదారవింద దాసులమగు మేము మిక్కిలి వేకువనే లేచి, నీ సన్నిధికి వచ్చి, నిన్ను దర్శించి నీ సుందర తిరివడులకు మంగళాశాసనము చేయుటే మాకు పరమావధి, ఎందుకనగా పశువులను మేపి మా జీవిక నడుపుకొను అజ్ఞానులమైన మేము చేసే అంతరంగ సేవలను నీవు స్వీకరించకుండ వుండరాదు. ఏలన నీవు మా గోల్లకులములో జన్మించి మా కులమును , మమ్ములను ధన్యులను చేసినవాడవు , ఓ గోవిందా! పుండరీకాక్షా! మేము నీ వద్దకు 'పఱ' అను వాద్యమును పొందుటకు రాలేదు. అది ఒక నిమిత్తమే! వ్రతమూ నిమిత్తమే! మేము ఏడేడు జన్మముల వరకును మరియు యీ కాలతత్వముండు వరకును నీకు అనవార్యశేషభూతులమై నీతోడ చేరి, నీ దాస్యమును చేయుచచుండువారము కామా? మా యందు , యితరములై ఆపేక్షలేవైన యున్నచో వానిని తొలగించి మమ్ము కృపజూడుము స్వామీ! సదా నీ సేవలను మాకోసగమును అని వ్రత ఫలమును అండాళ్ తల్లి వివరించింది. 

   అవతారిక 

భగవత్ప్రాప్తిని పొందగోరేవారందరూ ఆ చరించదగిన యీ ధనుర్మాస వ్రతంలో గోపికలు భక్తీ, ప్రపత్తులే ముఖ్యమని నిరూపించారు. అజ్ఞానులైనను నిశ్చల భక్తి ప్రపత్తులతో భగవంతుని చేరవచ్చనేది నిర్వివాదంగా నిరూపించారు. ఇప్పుడీ పాశురంలో వ్రత ఫలాన్ని చెబుతున్నారు. వ్రతాన్ని ఒక నిమిత్తంగా చేసుకుని 'పఱ' అనే వాద్యాన్ని పొందాలని తాహతహలాడారు గోపికలు ఇప్పటివరకు . కాని యీ పాశురంలో 'పఱ' నిమిత్తమని నిజానికి శ్రీకృష్ణుని సాన్నిధ్యమూ, అతని నిరంతర సేవకే యీ ప్రయత్నమంతా అని స్పష్టం చేశారు. అండాళ్ తల్లితో కూడిన గోపికలు.

(ధర్మవతిరాగము _ అదితాళము)
       
     ప...    నీ సన్నిధియే కావలె స్వామీ!
        నీ సంపెసేనమె మాకు పరమావధి స్వామీ!
    అ..ప..    నీ సేవకై వేకువజామున నిలిచి
        నీ సుందర తిరువడులకు మంగళమనగ
     
    చ..     పనుల మేపి జీవిక నడిపెడి మా 
        పశుప కులమునన్ బుట్టిన స్వామీ!
        ఈశ ! మా అంతరంగ సేవలను
        ఆశల జేయ నిరాకరింపకుమ!
        నీ సన్నిధియే కావలె స్వామీ!

    చ..    కాదుసుమా! వాద్యముకై వ్రతము     
        అదియొక నేపమగు నోచ నీ వ్రతము
        బంధము వీడక యేడేడు జన్మల
        అందరము కై౦కర్యము చేతుము
        విందువో గోవిందా! మనవిని __ మా
        యందన్య కామనలను పోగొట్టుము.

ROYAL KINGDOM GREEN HILLS

ROYAL KINGDOM GREEN HILLS Premium Frams, Tadkal, Sangareddy  Pin 8977111729

STARS

gtag('config', 'UA-93893754-1');