సౌందర్య లహరి-Soundarya Lahari 5వ శ్లోకము
పరస్పర ఆకర్షణ - సహకారము
శ్లోll 5.హరి స్త్వా మారాధ్య ప్రణత జనసౌభాగ్య జననీం
పురా నారీ భూత్వా పురరిపు మపి క్షోభ మనయత్
స్మరో పి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా
మునీనా మప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్ll
తా ; అమ్మా ! లోకములకు సౌభాగ్య ప్రదురాలవు అయిన నీ అభయము వలన విష్ణుమూర్తి స్త్రీ అవతారము ఎత్తి పరమ శివుని కూడా ప్రభావితము చేసెను కదా , అటులనే మన్మధుడు కూడా నిన్ను పూజించి రతీదేవికి ఇష్ట సఖుడే కాక మునుల మనస్సులు కూడా మోహ పెట్టుటకు సరి అయిన వ్యక్తి అయినాడు కదా !
జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 2000 సార్లు ప్రతి రోజు 8 రోజులు జపం చేసి పొంగల్ (పప్పుతో కలిపి వండిన అన్నం) అమ్మకు నివేదిస్తే, స్త్రీ పురుషుల మధ్య పరస్పర ఆకర్షణ, సహకారము పెంపొంది తద్వారా ప్రేమ అనుభూతమవుతుంది అని చెప్పబడింది.
SLOKA -5
Attracting of Sexes to Each Other
Haris tvam aradhya pranata-jana-saubhagya-jananim Pura nari bhutva Pura-ripum api ksobham anayat; Smaro'pi tvam natva rati-nayana-lehyena vapusha Muninam apyantah prabhavati hi mohaya mahatam.
You who grant all the good things, to those who bow at your feet, was worshiped by the lord Vishnu, who took the pretty lovable feminine form, and could move the mind of he who burnt the cities, and make him fall in love with him. And the god of love, manmatha, took the form which is like nectar, drunk by the eyes by rathi his wife, after venerating you, was able to create passion, even in the mind of sages the great.
Chanting procedure and Nivedyam ( offerings to the Lord) :
If one chants this verse 2000 times every day for 8 days, and cooks Pongal (made from dhal) as nivedhyam, it is said that one can attract the other sex and make love out of it.