Thursday, March 28, 2019

గరుడ పురాణము - సంపూర్ణం

గరుడ పురాణము - సంపూర్ణం

8 .శ్రీ కృష్ణావతారము
ఇరువది ఎనిమిదవ ద్వాపర యుగములో అధర్మ ప్రవృత్తు లైన రాజుల వలన భూభారము పెరిగినప్పుడు భూదేవి కోరికపై శ్రీ హరి, కృష్ణావతారము నెత్తెను. దేవకీ వసుదేవులకు అష్టమ గర్భమున జన్మించి, వ్రేపల్లెలో నంద యశోదల యింట పెరిగి బాల్య క్రీడలచే వారిని అలరించి, దుష్ట రాక్షసులను సంహరించెను. మధురా పురమునకు పోయి కంసుని సంహరించి, మాతామహుని రాజ్యమున నిలిపి, బలరామునితో గలిసి శత్రువులను నిర్మూలించెను. రుక్మిణ్యాది అష్ట మహిషులను వివాహ మాడెను. నరకుని జంపి 16000 మందిని వాని చెర నుండి విడిపించి పెండ్లాడెను. ద్వారకా నగరమును నిర్మించి బార్యా పుత్ర బంధు మిత్ర పరివారముతో నూట పాతిక యేండ్లు భూలోకమున నివసించెను. భారత యుద్దములో పాండవుల పక్షమున నుండి అధర్మ పరులను నాశనము చేసెను. తరువాత యాదవులు మదించి అధర్మముగా ప్రవర్తించు చుండగా ముసలము వంకతో వారిని గూడా సంహరించి తాను పరమ పదమునకు చేరెను .

9 బుద్దావతారము
ఒకప్పుడు రాక్షసులు విజ్రుంభించి దేవలోకము పై దండెత్తి దేవతల నోడించి తరిమివేసిరి, దేవతలు ప్రార్ధింపగా మాధవుడు, మాయా మోహ స్వరూపముతో శుద్దో దనుని కుమారుడుగా జన్మించెను. వేద విరుద్దములైన బోధలతో రాక్షసుల నందరును సమ్మోహ పరచి వారిని వేద బాహ్యులను జేసెను. ఒక్క రాక్షసులనే కాక భూలోక వాసులను గూడా భ్రమింపజేసెను. రాక్షసులు పాషండులై బలమును తేజమును కోల్పోయిరి. అప్పుడు దేవతలు వారి నోడించి స్వర్గమును చేజిక్కించు కొనిరి.

10 కల్క్యవ తారము
బుద్దుని బోధనల ప్రభావము భూలోకమున రాజులపై ప్రసరించును. వారు ధర్మ పరులై ప్రజా కంటకులై ప్రవర్తింతురు. ప్రజలు కూడా అన్యాయ ప్రవర్తనులై వేద కర్మల నాచరింపక యుందురు. అప్పుడు కలియుగములో విష్ణు యశుడను వానికి శ్రీ హరి, కల్కి రూపముతో జన్మించును. ధర్మమును తిరిగి ప్రతిష్టించును. ఈ దశావతారముల కధను విన్నవారికి అనంతమైన పుణ్యము గలుగును. శ్రీ మన్నారాయణుడింకను ఎన్నో అవతారము లెత్తెను. అవి యన్నియు ధర్మ సంస్థాపనము చేయుటకే యని గ్రహింపవలెను.
ఇది గరుడ పురాణము సంపూర్ణం

Wednesday, March 27, 2019

Jeevan labh

JEEVAN LABH

Jeevan labh

Just  Pay  16 years take one Crore Maturiy 25th years

KONIJETI SATYANARAYANA 
(M) 8374734234
EMAIL: konijetilic@Rediffmail.com

Tuesday, March 26, 2019

గరుడ పురాణము - 11

గరుడ పురాణము -  11

4 . నృసింహావతారము
అతని సోదరుడు హిరణ్య కశిపుడు తరువాత దేవలోకము నాక్రమించి యజ్ఞ భాగములను కాజేయగా నార సింహ రూపము ధరించి అతనిని సంహరించెను.

5 .వామనావతారము
బలి చక్రవర్తి ఇంద్రుడై దేవతలను స్వర్గము నుండి తరిమి వేయగా శ్రీ హరి వామనుడై పుట్టి, బలిని మూడడుగుల నేల యడిగి, వామనుడు అవామనుడై రెండడుగులలో భూమ్యాకాశముల నాక్రమించి అతనిని పాతాళమునకు త్రొక్కి వేసెను.

6 .పరశురాముడు
శ్రీ హరి తన అంశము తో జమదగ్నికి పరశురాముడై పుట్టి మదాంధులైన రాజులను ఇరువది యొక్క సారులు దండ యాత్రలు చేసి సంహరించెను. చివరికి దశరధ రాముని చేతిలో ఓడి తపమునకు బోయెను.

7 . శ్రీరాముడు
రావణ కుంభ కర్ణులను సంహరించుట కై దేవతలు ప్రార్ధించిన మీదట దశరధునకు రామునిగా పుట్టి, సీతను పెండ్లాడి, సీతా లక్ష్మణులతో అరణ్య వాసము చేసి అనేక రాక్షసులను వధించెను. రావణుడు సీత నెత్తికొన పోగా సుగ్రీవుని సహాయముతో లంకకు వెళ్లి రావణ కుంభ కర్ణాది రాక్షసులను సంహరించి, అయోధ్యకు వచ్చి పట్టము గట్టు కొనెను. లోకాపవాద మునకు భయపడి సీతను అడవిలో వదలగా ఆమె వాల్మీకి ఆశ్రమమునకు జేరెను. అప్పటికే గర్భవతి యైన సేత, అక్కడ కుశలవులను ఇద్దరు కొడుకులను గనెను. రాముడు పదునొక్క వేల యేండ్లు రాజ్యము చేసి కుశునికి పట్టాభిషేకము చేసి, సీతా సమేతుడై అయోధ్యా పుర వాసులతో సహా పరమ పదమునకు వేంచేసెను.

Monday, March 25, 2019

JEEVAN UMANG

JEEVAN UMANG

JEEVAN UMANG

Sum Assured 15Lakhs
Just pay 120000 for 15years.
KONIJETI SATYANARAYANA 
(M) 8374734234   EMAIL: konijetilic@Rediffmail.com

Thursday, March 21, 2019

కామాదహనము హోళీ HOLI

కామాదహనము హోళీ HOLI 

కామాదహనము హోళీ HOLI
హోళీప్రాముఖ్యత ...
వివిధ రాష్ట్రాలలో హోళీ సంబరాలు 
హోలిక దహన్: హోలీ భోగి మంటలు
హోళీ పండుగ ముందురోజు కాముని దహనం చేస్తారు. ఈ విధానం హోళీ ముందురోజు చలిమంటలు వేయడానికి కూడా పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ పండుగ యొక్క ప్రధాన ఘట్టం మండుచున్న హోలీ మంటలు లేదా హోలీక. అంతేకాక కొందరి ఉద్దేశ్యం ప్రకారం రాక్షసి హోలిక, హోలక మరియు రాక్షసుల దహనం లేదా మదన్‌ను దహనం అని సంప్రదాయ హోలీ మంటల మూలాన్ని తెలుపుతాయి. హిందూ పురాణాల ప్రకారం భక్త ప్రహ్లాదున్ని చంపడానికి ప్రయత్నం చేసిన హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి దహనానికి సంకేతంగా సంప్రదాయ భోగి మంటలను నిర్వహిస్తారు. ఎలాగంటే విజయదశమి రోజున రావణుడిని ప్రతిమను దహనం చేసినట్లుగా ఈ పండుగ రోజు కూడా ప్రతిమను దహనం చేస్తారు, ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో రాక్షసుల పరాక్రమం హోలిక దహనంతో అంతమయిందని దీని అర్థం, బ్రజ ప్రాంతాలలో, కర్రలను కుప్పగా పోగు చేసి ప్రజలు ఎక్కువగా తిరిగే కూడళ్ళలో లేదా వీధి చివరలో ప్రతిమలను దహనం చేస్తారు. సంప్రదాయమైన పూజలు అయిన తరువాత ప్రజలు మంటలకు ప్రదక్షిణ లు చేస్తారు. తరువాత రోజు ఈ విజయాన్ని దుల్‍‌హెండి రోజుగా ఘనంగా జరపుకొంటారు. హోళీ విశ్వవ్యాప్తంగా ప్రకాశించే రంగుల పండుగ. ఈ పండుగ రోజున, తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా ప్రకాశిస్తాయి. అక్కడ వివిధ రకాల రంగుల ఉత్పత్తి అయ్యి వృద్ధిపొంది , వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇదే ఈ పండుగ విశేషం. పురాణ కథలతో పాటుగా హోళీ పండుగ వెనుక మరో పరమార్థం ఉంది. హోళీ పాడుగాను వసంత ఋతువు ఆగమనంగా పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఇది చలికాలం తొలగిపౌఇ ఎండాకాలం ఆరంభానికి నాంది ప్రస్థావన వంటిది. హోళీ పండుగను సాధారణంగా "ఫాల్గుణి పూర్ణిమ'' నాడు జరుపుకుంటారు. ఇలా ఒక ఋతువు వెళ్ళి మరో ఋతువు వచ్చే సమయంలో ముఖ్యంగా శీతాకాలం 'చలి' వెళ్ళిపోయి ఎండాకాలం 'వేడి' వచ్చే సమయంలో ఉష్ణోగ్రతల తేడావల్ల చర్మం  చిట్లుతుంది. రంగులు ఆ చిట్లటం వల్ల కలిగే చికాకును తగ్గిస్తాయి. వైష్ణవములో, రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు, చాలా కాలం తపస్సు చేసి, తనను చంపడం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మచే వరం పొందాడు. ఇతడిని "పగలు లేదా రాత్రి సమయంలో, ఇంటి లోపల లేదా బయట, భూమిపైన లేదా ఆకాశంలో, మనుషుల వలన, జంతువుల వలన, అస్త్రములు, శస్త్రములచే చావు లేకుండా వరాన్ని పొందాడు. దానితో అతడికి దురహంకారం పెరిగి, స్వర్గం మరియు భూమిపై దాడి చేశాడు. ప్రజలు దేవుళ్ళని ఆరాధించడం మాని, తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు. దీనికి విరుద్ధంగా, హిరణ్యకశ్యపుడి సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. ఇతడి నోటిలో విషం పోస్తే, అది అమృతంగా మారింది. ఏనుగులచే తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించ గలిగాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా, ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము. భగవంతుడైన విష్ణువు నరసింహ అవతారంలో (సగం మనిషి మరియు సగం సింహం) వచ్చి హిరణ్యకశ్యపుడిని సంధ్యా సమయంలో (పగలు లేదా రాత్రి కాని) అతని ఇంటి గడప మెట్లపై (లోపల లేదా ఇంటి బయట కాదు) తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకొని (ఆకాశంలో లేదా భూమి పైన కాదు) మరియు తన యొక్క పంజాతో చీల్చి చెండాడినాడు (అస్త్రాలు లేదా శస్త్రాలచే కాకుండా).
రాధ మరియు గోపికల హోళీ : ఈ పండుగను భగవంతుడైన కృష్ణుడి పెరిగిన ప్రాంతాలైన మథుర మరియు బృందావనంలలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు (ప్రతి సంవత్సరం రంగపంచమి రోజున భగవంతుడైన కృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు). భగవంతుడైన కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. కృష్ణుడు తన తల్లితో అతని యొక్క నల్లని శరీర రంగు మరియు రాధ యొక్క శరీర రంగు మధ్య వ్యత్యాసం గురించి ఫిర్యాదు చేశాడని నమ్ముతారు. కృష్ణుడి తల్లి రాధ ముఖానికి రంగు పూయాలని నిర్ణయించుకుంది. అధికారికంగా ఈ ఉత్సవాలు వసంతఋతువులో అంటే ప్రేమ వికసించే మాసంలో జరుపుకుంటారు. హోలీ పుట్టుక వివరాల గురించి వేరొక కథ ఉంది. ఈ కథ ప్రేమ దేవుడైన కామదేవుడు గురించి తెలుపుతుంది. పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా శివుని తపస్సును భంగపరచడానికి అతనిపై పూల బాణం వదిలిన కామదేవుని శరీరాన్ని శివుడు నాశనం చేసాడు. తరువాత శివుడు, తన త్రినేత్రాన్ని తెరిచి, కామదేవుని శరీరాన్ని బూడిద చేశాడు. కామదేవుని భార్య రతి కోరికమేరకు శివుడు కామదేవుడిని మళ్ళీ బ్రతికిస్తాడు కానీ భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేక పూరితప్రేమ ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బ్రతికిస్తాడు. ఈ సంఘటన వలన హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకొంటారు.
దేశంలో వివిధ ప్రాంతా ల్లో హోళీ వేడుకలు..
ఒరిస్సా : ఒరిస్సాలోని జగన్నాథ, పూరీ ఆలయాలలో కృష్ణుడు, రాధ విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు జరిపించి ఆ తరువాత వేడుకలు ప్రారంభిస్తారు.
గుజరాత్ : గుజరాత్ లో ఈ పండగను అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా మంటలు వేసి దాని చుట్టూ చేరి నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ ఆనందిస్తారు. అందరూ పెద్ద మైదానం లాంటి ప్రదేశం వద్ద గుమికూడి సామూహికంగా కూడా మంటలు వేస్తారు. ఈ మంటల్లో ఇంట్లో ఉన్న పాత చెక్కసామానులన్నీ తీసుకొచ్చి వేస్తారు.
మహారాష్ట్ర : మహారాష్ట్రలో హోళీక దిష్టిబొమ్మను దహనం చేస్తారు. హోళీ  వేడుకకు ఒక వారం ముందు యవకులు ఇంటింటికి తిరిగి పాత చెక్క సామానులు సేకరిస్తారు. ఉదయం వేసిన మంటలు సాయంత్రం దాకా మండుతూనే ఉంటాయి. అంత పెద్ద ఎత్తున మంటలు వేస్తారు. ఈ మంటలకు ప్రత్యేకంగా చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తారు.
మణిపూర్ : మణిపూర్ లో ఓ ఆచారం ఉంది. మగపిల్లలు ఆడపిల్లలకు డబ్బులు ఇస్తేనే ఆడపిల్లలు వారి మీద రంగులు చల్లుతారు. రాత్రి సమయంలో చిన్నాపెద్దా అందరూ కలిసి ఒక చోట చేరి మంటల చుట్టూ తిరుగుతూ నృత్యం చేస్తారు. ఇక్కడ వారం రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. చివరిరోజు కృష్ణుడి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు.
కాశ్మీర్ : సైనికుల పహారాలో, తుపాకుల చప్పళ్ళతో ఉద్రిక్తంగా ఉండే అందాల కాశ్మీర్ లో సైనికులతో సహా అందరూ హోళీ ఉత్సవాలలో పాల్గొంటారు. ఆటపాటలతో రంగు నీటిని ఒకరిమీద మరొకరు చల్లుకుంటారు.
ఉత్తర ప్రదేశ్ :            లఠ్ మార్ హోళీ
ఉత్తర ప్రదేశ్ లోని మథురకు దగ్గరగా ఉన్న బర్సన అనే ఊళ్ళో హోళీని వెరైటీగా జరుపుకుంటారు. అక్కడ హోళీ సందర్భంగా మహిళలు మగవారిని లాఠీలతో పిచ్చ కొట్టుడు కొడతారన్న మాట. దీన్నే వారు లఠ్ మార్ హోలీ అని ముద్దుగా పిలుచుకుంటారు.  లఠ్ అంటే లాటీ అని అర్థమట. దీనికి ఓ ప్రత్యేక కారణముంది. పురాణ కాలములో చిలిపి క్రిష్ణుడు, తనకెంతో ఇష్టమైన రాధ గ్రామానికి వచ్చి, అక్కడ ఆమెను, ఆమె స్నేహితురాళ్ళను ఆటపట్టించాడట. దీనిని తప్పుగా భావించిన ఆ గ్రామం మహిళలు, కర్రలతో క్రిష్ణయ్యను వెంట తరిమారట. అప్పటినుండి, ఈ పండగ ఇలా జరుపుకోవాడం జరుగుతోంది. పక్కనే ఉన్న క్రిష్ణుడి గ్రామం, నంద్‌గావ్ నుండి మగవారు హోళీ ఆడడానికి ఈ గ్రామం రావడం,  హుషారుగా హోళీ పాటలు పాడడం, ఆడవారిని రెచ్చగొట్టడం వారిచేతిలో లాఠీ దెబ్బలు తినడం ఆనవాయితీ అన్న మాట.  కాకపోతే, ఆడవారు కొట్టే దెబ్బలను వారు ఢాలు వంటి దానిని ఉపయోగించి తప్పించుకోవచ్చు.  ఆడవారు కూడా వారిని ఢాలు మీదనే ఎక్కువగా కొడతారు. ఈ హోళీకి అక్కడ ఒక నెల రోజుల ముందు నుండే ప్రిపరేషన్ జరుగుతుంది.  అత్తలు తమ కోడళ్ళకు ఆ నెల రోజు మంచి పౌష్టిక ఆహారం పెడతారట, బాగా కొట్టడానికి.  ఇక్కడ కొట్టడం అనేది వారిని గాయపరచడానికి కాడు, వారి పట్ల తమ ప్రేమను చెప్పడానికి మాత్రమే అని చెబుతారు గ్రామస్తులు. ఇలాంటిదే మరో హోళీ హర్యానాలో జరుగుతుంది. దాని పేరు “కరోర్ మార్” హోళీ. ఇక్కడ వదినలు (మరదళ్ళూ కూడానేమో)  మరిదిని (బావను కూడా అని నా అనుకోలు) పిచ్చ కొట్టుడు కొట్టడం స్పెషాలిటీ.  సంవత్సరమంతా వారు తమ మీద వేసిన జోకులకూ సెటైర్లకూ, టీజింగులకు ఆరోజు కసి తీర్చుకుంటారన్న మాట.  ఇది కేవలం కుటుంబమంతా తమ విభేదాలను మర్చిపోయి,  కలిసి మెలసి జీవించడనికి చేసుకునే పండగ అని, ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయమనీ చెబుతున్నారు. విశేషమేమిటంటే, లాఠ్ మార్ హోళీ లా ఇక్కడ మగవారు ఢాలు లాంటివి తెచ్చుకోరు, ఆదవారు కూడా కేవలం దెబ్బలు తగలకుండ కొట్టడం అనే కాన్సెప్టును ఫాలో అవ్వరు. ఏది దొరికితే అది అడ్డుపెట్టుకొని తప్పించుకోవాలి, లేదా తన్నులు తినాలి.

Wednesday, March 20, 2019

గరుడ పురాణము - 10

గరుడ పురాణము - 10

ఇరువది ఐదవ ద్వాపరములో
శక్తి
ఇరువది యారవ ద్వాపరములో
పరాశరుడు
ఇరువది యేడవ ద్వాపరములో
జాతూకర్ణుడు
ఇరువది ఎనిమిదవ ద్వాపరములో
కృష్ణ ద్వైపాయనుడు
ఈ కృష్ణ ద్వైపాయనుడు బ్రహ్మ శాసనము మీద వేదములను నాలుగుగా విభజించి పైల, జైమిని, సుమంతు, వైశంపాయనులను శిష్యులకు భోదించి, అష్టాదశ పురాణములను రచించిరో మహర్షణునకు (సూతునికి ) బోధించి లోకములో వ్యాపింప జేసెను .
శ్రీ హరి దశావతారములు

1 .మత్స్యావతారము
వైవస్వత మను వొకనాడు నదిలో సూర్యునికి అర్ఘ్య మిచ్చు చుండగా ఒక చేప పిల్ల అతని చేతిలో బడెను . అది పెరిగి పెద్ద దగుచుండగా గంగాళము లోను, చెరువులోను, సరస్సులోను వేసెను. అప్పుడా చేప మనువుతో " ప్రళయ కాలమున ఒక నావ వచ్చును. దానిలో సప్త మహర్షులను నీవును ఎక్కి కూర్చుండుడు . ప్రళయాంతము వరకును ఆ నావను మహా సముద్రములో నా కొమ్మునకు గట్టుకుని లాగుకొని పోవుచునే యుందు, " నని చెప్పెను. మనువట్లే చేసి ఆ ప్రళయమును దాటెను. మరల బ్రహ్మ సృష్టి చేయుటకు పూను కొన్నప్పుడు హయగ్రీవుడను రాక్షసుడు (ఇతనినే సోమకాసురుడని కూడా అందురు) వేదముల నపహరించి సముద్రములో దాగి యుండగా శ్రీ మన్నారాయణుడు మత్స్యావతారమును మరల ధరించి, వానిని సంహరించి వేదములను మరల బ్రహ్మ దగ్గరకు చేర్చెను .

2 . కూర్మావతారము
దూర్వాసుని శాపముచే ఇంద్రుని సంపద లన్నియు సముద్రములో గలిసిపోగా, విష్ణు మూర్తి సలహా మీద దేవ దానవులు సముద్రమును మదించిరి. ఈ పాల సముద్రమును మదించుట కారంబించినపుడు కవ్వముగా వేసిన మందర పర్వతము మునిగిపోసాగెను. అప్పుడు నారాయణుడు కూర్మావతారమును ధరించి దాని క్రింద ఆధారముగా నిలువబడెను. దానితో సముద్ర మధనము జరిగి సర్వ వస్తువులను ,అమృతమును పుట్టెను.

3 .వరాహావతారము
హిరణ్యాక్షుడు దేవతలను గెలిచి స్వర్గ మాక్రమించిన ప్పుడు అతనిని యజ్ఞ వరాహ రూపముతో సంహరించెను.

Tuesday, March 19, 2019

గరుడ పురాణము - 9

గరుడ పురాణము - 9


సూర్య, చంద్ర గ్రహణ సమయములలో ఇచ్చు దానము వలన దాత స్వర్గాది పుణ్య లోకములను బొందును. దేశమును, కాలమును, పాత్రతను (యోగ్యతను ) గమనించి ఇచ్చిన దానము కోటి గుణిత మగును. కర్కాటక, మకర సంక్రమణము లందును అమావశ్య, పూర్ణిమాది పర్వములందును చేసెడి దానము విశేష ఫలము నిచ్చును. దాత తూర్పు ముఖముగా కూర్చుండి సంకల్పము, గోత్రనామములతో జెప్పి దాన మీయవలెను. పుచ్చుకొనువాడు ఉత్తరాభి ముఖుడై స్వీకరింపవలెను. అట్లు చేసినచో దాతకు ఆయుర్దాయము పెరుగును. గ్రహీతకు పుచ్చుకున్నది అక్షయ మగును. మహాదానములు పది :
శ్లో || కనకా శ్వతి లానాగా దాసీరధ మహీ గృహాః ||
కన్యాచ కపిలా దేను: మహా దానాని వైదశ ||
తా || బంగారము, గుఱ్ఱము, తిలలు, ఏనుగులు,దాసీ జనము,రధములు ,భూమి, గృహములు, కన్యక నల్లని ధేనువు వీనిని మహా దానము లనిరి . ఇవి పది.
దేవతలకు గాని, బ్రాహ్మణులకు గాని, గురువులకు గాని, తల్లి దండ్రులకు గాని ఇచ్చెదనని వాగ్దానము చేసిన దానిని ఇయ్యక ఎగ గొట్టినచో వంశ నాశనము జరుగును. ప్రతి గ్రహీత నుండి ఏదో లాభము నాశించి దాన మిచ్చినచో అది నిష్ప్రయోజన మగును . ప్రతి గ్రహీత నుద్దేశించి దానము చేయుచు, ఆ దాన ధారను భూమిపై విడిచినచో ఆ దాన ఫలము మహా సాగరము కన్నా అనంతమైనది యగును. గౌతమీ, గంగా, గయా, ప్రయాగాది తీర్ధము లందిట్టి దానములు విశేష ఫలముల నిచ్చును. వైవస్వత మన్వంతరము లోని వ్యాసులు

ఇప్పుడు జరుగుచున్నది వైవస్వత మన్వంతరములో ఇరువది యెనిమిదవ మహాయాగము .అందులోను కలియుగము వ్యాసుడు జన్మించి వేదాలు నాలుగుగా విభజించి, పదునెనిమిది పురాణములు రచించినది ,దీనికి వెనుక ద్వాపర యుగములోనే గతించిన ఇరువది యేడు మహాయాగములలోను ద్వాపరములందు ఇరువది యేడుగురు వ్యాసులు జనియించిరి .ప్రతి కలియుగములో ను మానవుల శక్తి సామర్ద్యములు పూర్వ యుగములలో కంటే అల్పముగా నుండును. వారు అనంతములైన వేదములను అధ్యయనము చేయలేరు. అందు నిక్షిప్తమైన నిగూఢ ధర్మములను గ్రహించి ఆచరింప లేరు. అందుచేత ప్రతి మహాయాగము లోను ఒక వ్యాసుడు జనించి ఆ వేద రాశిని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము,అధర్వణ వేదము అను నాలుగు విభాగములు చేసి ఒక్కొక్క శాఖను కొన్ని వంశముల బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణముల వారు అధ్యయనము చేయవలెనని నియమించినారు.

Friday, March 15, 2019

గరుడ పురాణము - 8

గరుడ పురాణము - 8

అంతే కాదు ; ఆవేదాలలోని ధర్మములను భోదించుటకై పదునెనిమిది పురాణములను, పదునెనిమిది ఉప పురాణములును వెలసినవి.
గతించిన ఇరువది యేడు ద్వాపర యుగములలోను

జన్మించిన వ్యాసులు వీరు :
మొదటి మహాయుగమున ద్వాపరములోని                      వ్యాసుడు స్వాయుంభువ మనువు
రెండవ ద్వాపరములో                                                      ప్రజాపతి
మూడవ ద్వాపరములో                                                   ఉశ నసుడు
నాలుగవ ద్వాపరములో                                                  బృహస్పతి
ఐదవ ద్వాపరములో                                                       సవితృడు
ఆరవ ద్వాపరములో                                                       మృత్యువు
ఏడవ ద్వాపరములో                                                       ఇంద్రుడు
ఎనిమిదవ ద్వాపరములో                                                వసిష్టుడు
తొమ్మిదవ ద్వాపరములో                                                సారస్వతుడు
పదవ ద్వాపరములో                                                       త్రిధాముడు
పదునొకండవ ద్వాపరములో                                           త్రివృషుడు
పండ్రెండవ ద్వాపరములో                                               శత తేజుడు
పదమూడవ ద్వాపరములో                                            ధర్ముడు
పదునాలుగవ ద్వాపరములో                                          తరక్షుడు
పదునైదవ ద్వాపరములో                                                త్ర్యారుణి
పదునారవ ద్వాపరములో                                               ధనంజయుడు
పదునేడవ ద్వాపరములో                                                కృతంజయుడు
పదునెనిమిదవ ద్వాపరములో                                         ఋతంజయుడు
పందొమ్మిదవ ద్వాపరములో                                            భరద్వాజుడు
ఇరువదవ ద్వాపరములో                                                 గౌతముడు
ఇరువదొక్కటవ ద్వాపరములో                                          రాజశ్రవుడు
ఇరువది రెండవ ద్వాపరములో                                         శుష్మాయణుడు
ఇరువది మూడవ ద్వాపరములో                                       తృణబిందుడు
ఇరువది నాలుగవ ద్వాపరములో                                      వాల్మీకి

Tuesday, March 12, 2019

శ్రీ గరుడ పురాణం-7 వ అధ్యాయము

శ్రీ గరుడ పురాణం-7 వ అధ్యాయము

శ్రీ హరీ!!! మనుషులు ప్రమాదాల వల్ల కానీ,పాపాల వల్ల కానీ రాలిపోయే స్థితి వస్తే,వారు యమయాతనలు పొందకుండా ఉండే మార్గం వివరించండి అని గరుత్మంతుడు అడుగగా శ్రీ హరి ఈ విధంగా చెప్తున్నాడు
ఓ గరుడా!! పుత్రులు లేనివారికి దుర్గతి కలుగుతుంది అని మొదట చెప్పబడుతున్నది. పుత్రవంతులు అయినప్పటికీ, ధర్మాత్ములకి ఎప్పుడూ దుర్గతి కలగదు. కనుక సంతానము కోసం శివ పూజాదికాలు జరిగించి ఏ ఉపాయము వల్ల అయినా పుత్రులు కలిగేలాగా చూసుకోవాలి. పుత్రుడే పున్నామ నరకం నుండి తల్లిదండ్రులని రక్షిస్తాడు. "పుత్ర" నామసార్ఢ్యమ్ ఇదే!!! ధర్మాత్ముడు అయిన ఒక పుత్రుని వల్ల వంశం అంతా తరిస్తుంది. వేదాలలో పుత్ర మహిమ వేనోళ్ళ కొనియాడ బడుతోంది. అలాగే, పౌత్రుని అంగస్పర్శము వలన దేవ ఋణము, పితృ ఋణం, ముని ఋణము తీరి ముక్తుడు అవుతాడు. స్వర్గానికి వెళ్తాడు బ్రహ్మ వివాహం శ్రేష్టం, అవివాహిత పత్ని వల్ల ఎవరైనా పుత్రుని కన్నా,స్వర్గ లోక ప్రాప్తి కలుగదు. ఇట్లే ఇతరులు చేసిన శ్రార్ధం వలన సైతం పొందినట్లు ఐతే సవర్ణ స్త్రీ వలన కలిగిన ఔరస పుత్రుల వలన చేయబడే శ్రార్ధం వలనను స్వర్గలోకం పొందగలుగుతారు.......అన్ని చెప్పగా......గరుడుడు శ్రీహరి ని చూసి ఓ పరమపురుషా!! ఈ ప్రేత జన్మల గురించి ఏమన్న కధ ఉన్నదా??? ఉన్నట్లు ఐతే అటువంటి కధ సవిస్తారం గా తెలపండి అని ప్రార్ధించాడు అందుకు సమాధానం గా ఓ పక్షిరాజా!!! త్రేతా యుగం నాటి గాథ ఒకటి నీకు వినిపిస్తాను. విను!!! ఆ యుగంలో భబ్రువాహనుడు అనే ఒక గొప్ప రాజు ఉండేవాడు. అతడు ధర్మపరాయణుడు. ప్రముఖులచే సైతం ప్రశంసించబడిన వాడు. మహోదాయమనే నగరాన్ని రాజధాని గా చేసుకుని ప్రజారంజకం గా పాలన చేస్తూ ఒక నాడు అడవి లో వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక జింకను చూసి దాన్ని తరుముతూ ఆ అరణ్య మధ్యలోకి వెళ్లి దాని పై ఒక బాణం ప్రయోగించాడు. కానీ ఆ జింక తప్పించుకుని అక్కడ నుండి పరుగెత్తిపోయింది. బభ్రువాహనుడు ఆ జింక శరీరం నుండి కారే రక్త ధారలు బట్టి మరింత దూరం దానికై గాలించసాగాడు అతడొక్కడే జింకను తరుముతూ వెళ్లడంతో అతని పరివారం చాలా దూరంగా ఉండిపోయింది. అతడా అడవి దారిలో తప్పి,అందులోనే ఇంకొక వనంలోకి ప్రవేశించాడు. జింక మాత్రం కనపడలేదు. బాగా అలిసిపోయి దాహం చేత నాలుక ఎండిపోతుంటే నీళ్లకోసం వెతకసాగాడు....... మరింత దూరం సాగిన తరువాత - దివ్యమైన జలంతో ఒక తామర కొలను కనిపించింది. బభ్రువాహనుడు. ఆ చెరువులోకి దిగి స్నానం చేసి, నీరు త్రాగి ఒక చెట్టు కింద తన పరివారం వెత్తుకుంటూ వచ్చేంత వరకు విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నాడు. చెట్టు నీడన కాస్త సేద తీరాడు.. ఇంతలో ఒళ్ళు గగుర్పొడిచేలా ఎముకల గూడు నడుస్తున్న రీతిలో ఒక ప్రేతం కనపడింది. దానికి ఇతరులు ఎవరైనా భయపడాల్సిందే.... పరమవికారం గా ఆ లరేటనికి చేరువగా అటువంటివి మరికొన్ని ప్రేతలు సంచరిస్తున్నాయి. బభ్రువాహనుడు చూసిన ఆ ప్రేతం అతన్ని సమీపించి సంతోషం తో ఇలా అంది....... ఓ మహారాజా!!! నిన్ను దర్శించిన మాత్రము చేతనే ఈ ప్రేత దేహాన్ని వదిలి ఉత్తమగతి చెంది ధన్యుడిని అయ్యాను అని వినయంగా పలికేసరికి, ఆ రాజు మరింత ఆశ్చర్యంగా చూస్తూ ప్రేతమా!!! నీవెవరు??? నీకీ దుష్ట రూపం ఎలా వచ్చింది ఆ వైనం వివరించు అని ఆసక్తిగా అడిగాడు ప్రేత రూపుని చరిత్ర......
అప్పుడు ఆ ప్రేతము ఓ మహారాజా!!! నా చరిత్ర చెప్తున్నాను వినుము..... వైదేశం అనే పట్టణం ఒకటి ఉంది. అది రధాలు,ఏనుగులు, గుర్రాలు, ఇతర జీవ,మనుష్య జాలంతో -- అన్ని విధాలా సంపదలతో అలరారుతూ ఉండేది. అలాంటి పట్టణంలో నేను వైశ్య కులంలో పుట్టాను. నా పేరు దేవగుప్తుడు. నేను బ్రతికి ఉన్నంతకాలం దేవపూజలు చేశాను, బ్రాహ్మణులని పెద్దలని పూజించాను. దేవాలయాలు నిర్మింపచేసాను, సత్రాలు వేయించాను, బీద బిక్కి దిక్కు లేని వారికి నాకు వీలు అయినంత వరకు ఆదుకున్నాను. నాకు తెలిసి ఏ జీవికి హాని తలపెట్టలేదు.నాకు భార్యా పుత్రులు లేరు.బంధువులు లేరు.మరణానంతరం ఈ లరేత జన్మ రావడానికి కారణం నాకెవ్వరు కర్మం చేయకపోవడమే పైగా నాకీ ప్రేత జన్మ సంభవించి చాలా కాలమే అయ్యింది. ఓ రాజ శ్రేష్ఠ!! నేను మీకోకటి అభ్యర్ధిస్తున్నాను. మరణించిన వారికి సంస్కారం - సంచయనం నిత్య విధి,వృషోత్సర్జనం, షోడశం,సపిందీకరణం, మాసికం, శ్రార్ధం..... ఈ మొదలు అయినవన్ని పుత్రులు లేక జ్ఞాతులు చేయవలసిందే!!! కానీ,ప్రభువు అయిన నీవు లోకభాందవుడవు. ఎవ్వరూ లేనివారికి నీవే ఆప్తుడవు-రక్షకుడివి కూడా. ప్రేత రూపంలో ఉన్న నన్ను ఈ ఆపద నుండి గట్టెకించగలిగావు. నా దగ్గర దీనికి ఒక మణి ఉంది ఇది వేరే ఏ మణి ప్రకాశించలేదు.అంత గొప్ప మణి ఉంది. దీనిని నీకు పాదాల వద్ద సమర్పిస్తున్నాను స్వీకరించవలసింది అని ఆ మణిని సమర్పించబోయాడు..... అప్పుడు బభ్రువాహనుడు వారిస్తూ వైశ్య కులభూషణా పుణ్య కార్యాలు నెరవేర్చి నీవే గొప్ప దాతగా వెలిగొందిన వాడివి రాజునైన నేను ఇవ్వాల్సిన వాడ్ని!!! నా చెయ్యి పైన ఉండాలి,అట్టి నేను నీకు కర్మ చేయు నిమిత్తము,ఈ రత్నాన్ని అనుగ్రహిస్తాను అనుకున్నావా??? దీనికి ఆశించను,కానీ నాకున్న కొన్ని సందేహాలు తీర్చు!!! అసలు నీకు ఈ ప్రేత జసన్మా ఎట్లా సంప్రాప్తితించిందో చెప్పినట్లే ఇంకా ఏ ఇతర కారణాల వలన అయిన ప్రేత జన్మ కలిగే అవకాశం ఉందా??? ఒకవేళ పొందితే అందులో నుండి విముక్తి కై ఏం చేయాల్సి ఉంటుంది??? అని అడిగాడు.
ఏ విధంగా ఐతే ఏం??? ౼ ప్రేత జన్మ పొందినవారు ఉద్ధరించాలి అంటే ఓ మహారాజా అవస్యముగా నారాయణ బలి విధి నిర్వర్తించాలి. సంగ్రాహం గా ఆ విధానం ఈ విధంగా ఉంటుంది........ ఆది మధ్యాంతరహితుడు అయిన శ్రీ మన్నారాయణుడు ప్రతిమని శుద్ధమైన బంగారంతో తయారు చేయించి లేదా శంఖ చక్ర పీతాంబర సహితం గా ఆ బంగారు రేకు పై చిత్రించి, అట్లే ఇంద్రుడు బ్రహ్మ,రుద్రుడు మొదలైన వారి ప్రతిమతో పాటు మంటపం పైకి మంత్రాలతో ఆహ్వానించి పూజించాలి వృషోత్సర్జన క్రియ నిర్వహించి, ఆ తరువాత పదమూడు మంది బ్రాహ్మణులని రప్పించి వారికి గొడుగు, పాదరక్షలు, పీటలు, వస్త్రాలు, బియ్యం, గోదానం మొదలైనవి అతిశయంగా (షోడశ మహాదానాలు) జరిపించాలి. వారికి మృష్టాన్న భోజనం అనంతరం జలపూరిత ఘటదానం,సయ్య దానం వంటివి చెయ్యాలి. ఈ విధి సాంగోపాంగంగా నెరవేర్చగలిగితే ఏ రీతిగా ప్రేత జన్మ పొందినప్పటికి కూడా వారు ముక్తులు అవుతారు అని వైశ్య ప్రముఖుడు వివరించాడు. అప్పుడు బభ్రువాహన ప్రభువుని అతని పరివారం అంతా అక్కడకి వెతుక్కుంటూ అక్కడికి రాగా, ఆ ప్రేత జీవులు మాయమయ్యాయి. రాజు రాజధానికి చేరిన వెంటనే, తాను అడవిలో చూచిన వైశ్యుని ప్రేత జన్మ పోగొట్టడానికి సకల దానధర్మాలు జరిపించాడు. అప్పుడా దేవగుప్తునికి ప్రేతతత్వం వదిలింది. అపార పుణ్య జీవి కనుక నా సాయుధ్యాన్ని పొందాడు అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఓ గరుడా!!! పరులు చేసిన శ్రార్ధం వలననే ప్రేతం స్వర్గాధి పుణ్యలోకాలకు పోతుంటే, ఔరస పుత్రుల చేత చేయబడే శ్రార్ధం వల్ల సద్గతులు కలగడంలో ఆశ్చర్యం ఏమి లేదు.....
ఎవరీ ఇతిహాసాన్ని వింటారో లేక వినిపిస్తారో, ఆ ఇద్దరు కూడా మహా పాపులు అయినప్పటికీ ప్రేతతత్వం పొందక,స్వర్గాధి  పుణ్య లోకాలకు వెళ్తారు.

Monday, March 11, 2019

శ్రీ గరుడ పురాణం - 6 వ అధ్యాయము

శ్రీ గరుడ పురాణం-6 వ అధ్యాయము

ఈ మానుష జన్మ ఎంత ఉదాత్తమైనదో, అంతజటిలము. అంతగాను లంపటాల హేతువు. పుణ్యసముపార్జనకు ఎంత అనుకూలంగా ఉందొఇహలోక లంపటాల లో తగుల్కొనడానికి అంతేఅనువుగా ఉన్నది. కారణం......ముందేచెప్పినట్లుగా ఇంద్రియ చాపల్యం. వీటితో జ్ఞానంసముపార్జన చేయడమా??? విషయ వాంఛలకులోబడటమా?? అనేది ఆయా మానవుల విచక్షణమీద - స్వతంత్ర నిర్ణయ శక్తి మీద ఆధార పడిఉంటుంది ఈ 5 ఇంద్రియాలను దేని నిమిత్తం వినియోగించాలిఅని మనిషి ఆశిస్తున్నాడో దానిని బట్టి అతని పాపపుణ్య కార్యాలు ఉంటాయి. వీటిని- జయించిభ్రమలకు లోను కాకుండా జీవితం గడుపు వారికిస్వర్గం తధ్యం ఇంద్రియాలు నిరంతరం భ్రమలకు గురిచేస్తుంటాయి అనడానికి కొన్ని ఉదాహరణలు భ్రమ ఎలాంటిది అంటే ఒక జింక ఉంది అనుకుందాం!! దాన్ని వలలోవేసుకివడానికి బోయవాడు వేణువు ఊదాడు. అప్పుడు ఆ జింక శ్రవణేంద్రియం ఆ వేణు గానంపట్ల అక్షర్షితమై అలాగే మైమర్చిపోతుంది. అప్పుడాజింక సులభంగా బోయవాడికి పట్టుబడిపోతుంది......ఇక్కడ జరిగేది ఏంటి అంటే.... కృష్ణ జింక తన చెవులని తన ఆధీనంలోఉంచుకోలేకపోయింది. ఆపద కొని తెచ్చుకున్నది.... ఒక గజరాజు ఉన్నాడు బలంలో సాటిరాగలజంతువు ఏది గజరాజుకి లేదు..... కానీ ఎన్నో రెట్లుబలం తక్కువగా ఉన్న మావటి వాడు ఏనుగులు సంచరించే ప్రాంతంలో పెద్ద గోతులు తీసి పలుచగాఆకులు అలమలు కప్పి ఆ దరిదాపుల్లో ఆడఏనుగు చేత ఘీంకారాలు చేయించాడుఅనుకుందాం.... ఆడ ఏనుగు కోసం వెంపర్లాట లోపడి కన్నుగానక గోతుల్లో పడిపోతుంది ఇక్కడవిష్య వాంఛ వలన ఏనుగు ఇక్కట్ల పాలుఅయ్యింది. స్పర్శ సుఖం కోసం ఆరాటం ఆపదకారకం..... దీపం పురుగులు ఉన్నాయి. దీపాన్ని తాకిమాడిపోతుంటాయి. తేనెటీగలు ఎంతో శ్రమించికూడబెట్టిన తేనె జిహ్వ చాపల్యం కొద్దీ కొంత త్రాగిమత్తులో ఉండగానే వేటగాడు వచ్చి మంటబెట్టివాటిని మట్టు బెట్టి వాటి జిహ్వ చాపల్యంతీరకుండానే తేనె సొంతం చేస్కుంటాడు. మాంసపుముక్కల్ని గాలపు ముల్లుకి గుచ్చి ఆ వాసనకుచేపను ఆక్షర్షింపబడగానే, గాలానికితగులుకునేలాగా ఏర్పాటు చేస్తారు జాలరి. ఇక్కడ చేపలను నాసిక మోసం చేసి ఆపద పాలు చేసింది.

బంగారాన్ని చూసి దీపం పురుగు లాగా ఆపదతెచుకునేవాళ్ళు. కాసుల గలగలలకు లొంగి, దాన్నిఅపహరించాలనే ఆశతో జింకలగా ప్రాణం మీదకితెచుకోగలరు. పరభార్యాల లట్లఆశక్తితో, ఏనుగులగా గోతిలో పడి అధములైనఉత్తములు అనేకులుంటారు. భార్యపుత్రులచేతేనెలగా భావించి అన్ని సమకూర్చితే, వాళ్లే తనకుకాకుండా పోయినప్పుడు తేనెటీగ మాదిరిగావగచేవారున్నారు. అధికారం పదవిఆశించి, చేపలాగా ముల్లుకి చిక్కి విలవిలలాడేవారుఉన్నారు. పదవీ నిర్వహణలో సుఖం ఉందిఅనుకోవడం కూడా భ్రమే!!! గద్దెనెక్కిన వారి పాట్లు- వారికి కలిగే ఆటుపోట్లు అనుభవిస్తే తప్పతెలిసిరాదు బాలుడైనా, యవ్వనం గలవాడు అయిన, వృద్ధుడుఅయిన జరిగిపోయిన రోజులు లెక్కించే యముడు ఒకడున్నాడు అని తెలుసుకోవడం లేదు. లోకాల్లోజనులు పుట్టి - పుట్టి మరణిస్తూనే ఉన్నారు. జననం అనేది ఇతరులకు తెలియకుండా ఎలాజరిగిపోతోందో ఆయువు తీరాక కూడా ప్రాణంఅలానే పోతుంది. కానీ భార్య పుత్రులని విడిచిఅందరూ చూస్తుండగానే మరణిస్తారు. లోకంలో తానొక్కడే ఎవరితోడూ లేకుండా ఎలావస్తున్నాడో - పోయేటప్పుడు కూడా ఎవరి తోడులేకుండా అలానే పోతాడు. మరణించిన వానిదేహాన్ని భూమి పై కట్టె లాగా ఉంచి బంధువులుఅంత హహకారాలతో ఏడుస్తారు.....వాళ్ళు అలాఏడవటం వలన ఏమన్న ప్రయోజనంఉంటుందా??? ఏమి ఉండదు..... ఒకడు తప్పుడు సాక్ష్యాలు చెప్తాడు మరొకడుతప్పుడు లెక్కలు చూపిస్తాడు. ఇంకొకడు చెడుత్రోవలో నడుస్తాడు. అలానే కొందరు హత్యలుచేస్తారు. వారివరసలు లేకుండా స్త్రీ పొందకోరుతారు. అనెన్నో పాపాలు చేసి ధనం.పోగు చేసిఅది చూసుకుని మురిసిపోతారు.... ఇంద్రియ భోగాలకు బలీయమైనప్పుడు మనుషులుఈ జన్మను వ్యర్థంగా చెడగొట్టుకున్న వారుఅవుతారు. ఇంతకంటే మూఢుడు ఇంకొకడుఉండదు కదా..... అన్ని జన్మలో మానవ జన్మదుర్లభమైన జన్మ అతడు తన చేతిలో ఉన్నఅమృత భాండాన్ని తానే జారవిడుచుకునివెర్రివాడితో సమానం అవుతాడు తరువాత వార్ధక్యాన్ని పొంది, రోగాలతోబాధపడుతూ మృతి చెంది నరకాలకి పోతాడు. ఇట్లాగే గతా గతముల చేత పాపాత్ములు కర్మబద్ధులైఎన్నటికీ వైరాగ్యం పొందక సంసారంలో పడి మునిగితేలుతూ దుఃఖిస్తుంటారు. పాపులు నరకానికి వెళ్లే విధానం వివరించబడిందిగరుడ!!!! మరల ఇంకేమి వినగోరుతావు??? అనిశ్రీహరి అడుగగా జీవుడు పిండ శరీరాకృతి పొందేవిధానం చెప్పామన్నాడు గరుత్మంతుడు.
సశేషం......గరుడ పురాణం నుండి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన జీవిత సత్యాలు... వైరాగ్యంకాదు ఇది వాస్తవం.... భ్రమ ఎలాంటిది? అతిదుర్లభమైన మానవ జన్మ ఎత్తి మనిషి ఏ విధంగాపాపి అవుతున్నాడు????

Sunday, March 10, 2019

శ్రీ గరుడ పురాణం 5వ అధ్యాయము

శ్రీ గరుడ పురాణం 5వ అధ్యాయము

గరుడ పురాణం నుండి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ధర్మ సూక్ష్మాలు...శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి ఉపదేశించిన అత్యంత రహస్యమైన విషయం ఏమిటి??... దానానికి ఎటువంటి ధనం పనికొస్తుంది??? పరమపథం పొందడం ఎలా?? మరణాంతరం జీవుడు తో పాటు వెంట వచ్చేవి ఏవి??? మరణించిన జీవుడు నరకం లో ఏమని అక్రందనలు చేస్తాడు?? ఏ ఏ పాపాలు చేసి ఆర్జించినా, వాటి ఫలితంగా వచ్చే నరకం నుండి ఆ సంపాద పరుడ్ని ఎవరు తప్పించలేరు. వాటి అన్నిటికి అతడు ఒక్కడే బాధ్యుడు. సరే!!! ఇంత మోహం౼మొసంతో సంపాదించిన ధనం ఏమైనా వెంట వస్తుందా?? అది రాదు. బంధువులు మొదలైన వారు,శవం తో శ్మశాననికి పోయి, మళ్ళీ తిరిగి ఇంటికి చేరుకుంటారు. దీని బట్టి ఏమి తేటతెల్లం అవుతోంది??? కేవలం ఆ జీవి చేసిన పాప కర్మలు మాత్రమే అతని వెంట రాగలవు. దానం ఇచ్చిన సొమ్ము అనుభవించడానికి అతను అధికారి కాబోడు. పూర్వ జన్మలో చేసిన దానధర్మాలు చేసినప్పుడే, ఇప్పటి భాగ్యం సిద్దిస్తోంది అని గ్రహించాలి. ఈ జన్మలో చేసే దాన ధర్మాలు తదుపరి జన్మలో ఆ జీవిని భాగ్యశాలి గా చేయగలవు. ఎవరైతే ఈ దాన ధర్మాలు భక్తి శ్రద్ధలతో చేస్తారో, వారే ధర్మార్ధ కామ మోక్షలకు అర్హులు. ఇచ్చే దానం అయిన భక్తి శ్రద్ధలతో కూడుకుని ఉండాలి. దాన ధర్మాలు చెయ్యడం ద్వారా కోరినవి కోరినట్లు సిద్ధింపచేసుకోవచ్చు... భక్తితో చేసిన ధర్మం అణువుమాత్రమైనా మేరువుతో సమానం ఇక్కడ ఇంకొక ధర్మ సూక్ష్మం ఉంది. దానాధర్మలకి వెచ్చించే ద్రవ్యం న్యాయ్యంగా ఆర్జించినదై ఉండాలి. అన్యాయం గా ఆర్జించిన ధనం దాన ధర్మలకు ఉపయోగపడదు. ఎవరైనా అటువంటిది వినియోగిస్తే అది ఫల రహితము అవుతుంది. ఆశించిన ఫలితం ఇవ్వదు. ప్రజల నోళ్లు కొట్టి సంపాదించిన ధనం, దానం చేస్తే లేదా భాగవాదర్పణ చేస్తే పుణ్యం లభించదు సరికదా..... మరింత పాప హేతువు కాగలదు. నీతి నియమాలు తప్పి చేయు వ్యాపారములు/కార్య కాలాపములు వల్ల సమకూడిన ధనంతో పుణ్యం కొనాలని చూడటం అవివేకం అనిపిస్తుంది. సాటి జీవిని పీడించి సాధించిన ధనంతో ఎన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టినా ప్రయోజనం శూన్యం. అంతకంటే సాటి జీవుల్ని హింసించక పోవడం - వారిని పీడించి ధనం ఆర్జించకపోవడం విశేష పుణ్యదాయకం….

నా పరమపథం పొందడానికి బ్రహ్మ, దేవేంద్రులాదులకే దుర్లభం. అటువంటిది కేవలం మనః శుద్ధి - విత్త శుద్దితో చిన్న దానం చేసినా ఆ జీవికి నా పరమపదాన్ని అనుగ్రహిస్తున్నాను. గరుడా!!! అందుకే ఇది అతి రహస్యమైనది - పాపాత్ములకి అర్ధం కానిది అని నీకు మొదటే చెప్పి ఉన్నాను.. కనుక భక్తి శ్రద్ధలతో దానధర్మాలు చేసే వారంతా మొట్ట మొదట తాము ఆర్జించిన ధనము సమ్మతమైన ద్రవ్యమా??? పరపీడన ద్వారా పోగు చేసినట్టి ద్రవ్యమా??? అని ఎవరికి వారే జాగరూకులై గమనించుకోవాలి. స్వార్జితం ధర్మ సమ్మతమైన ధనాన్ని భక్తితో దానం చెయ్యాలి అని వక్కాణించాడు శ్రీ హరి పదవ రోజున ఏర్పడిన పిండ దేహాన్ని పదమూడో రోజున కింకారులు లాక్కుని పోయే తీరు ఎలా ఉంటుంది అంటే....రాను రాను అంటూ మొరాయించే కోతిని తాడుకి కట్టి ఈడ్చుకుని వెళ్తున్నట్లు ఉంటుంది. అయ్యయ్యో!!! నాకేది దారి??? నేనిక్కడ పెక్కు ఇక్కట్లు పడుతున్నానే!!! ఎం చెయ్యను??? ఈ నరకం బాధ తప్పించుకునేది ఎట్లు?? బ్రతికి ఉన్నప్పుడు మేలుకోరి చెప్పిన సాధు సత్పురుషులను పరిహాసం చేసానే.... సర్వేశ్వరుడు ఉన్నాడు అని, సత్కర్మలుకి స్వర్గఫలం / దుష్కర్మలకు నరక ఫలం తప్పదని..... దుర్మార్గం వదిలి సన్మార్గం లో నడవాల్సింది అని వాళ్ళు చెప్పే హితోక్తులు పెడచెవిన పెట్టానే.... ఇప్పుడు ఇక్కడ యమకింకరులు పార్వతాలంతేసి సమ్మెటలతో ఇనుప గదలతో బాదుతున్నారే!!! అబ్బాబ్బా!!! ఈ బాధ భరింపశక్యం గా ఉంది.... అయ్యాయో!!!! పెద్దలకు ఏ ఉపకారాన్ని చెయ్యలేదు. కనీసం చేసేవాడికి అయిన తోడ్పడలేదు. తీర్థయాత్రలు చెయ్యలేకపోయాను. చేసేవారిని ప్రశంసించలేక పోయాను. మేలైన పూజలు, అర్చనలు నిర్వహించలేక పోయాను సరి కదా..... కనీసం చేసేవారికి పరిచర్యలు అయిన చెయ్యలేదు... నీళ్లు లేని చోట్ల చాలివేంద్రాలు ఏర్పరిచి ఉన్న బాగుండేది. ఒక చెరువునో - నూతినో ప్రోజపయోగం కోసం త్రవ్వించగలిగానా???? మొత్తం నా భూమి అంతటితో పైరు వేసుకుని అంతా నా స్వార్ధానికి వాడుకున్నాను..... అందులో కాస్త అయిన పచ్చిక కోసం పశువుల నిమిత్తం వదలక పోతిని. సాధమైనంతలో నిత్యం చిన్న దానం అయిన చేయాకపోతిని వేద శాస్త్రాలు అభ్యసించగల నేర్పు - ఓపిక లేకున్నా కనీసం శ్రీ మద్రామాయణ భారత భాగవతాలను స్వహస్తం తో రాయడమో - ఆ గాధలు వినడమో చేయలేకపోయాను. వ్రాయించడమో - కనీసం అమ్మకానికి చదవగల ఆశ గలవారికి ఇప్పించలేక పోయాను. చదవడమో - చదివించడమో చేసి ఉంటే బాగుండేది ఆహా ఏమి నా దౌర్భాగ్యం!!! శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన ఏకాదశి నాడు ఉపవాసం చేయలేకపోయాను. కనీసం కలలో కూడా ఒక్కటంటే ఒక్కటి సత్కార్యం ఆచరించలేకపోయాను..... పైగా చెడు పనులలో ఏ. ఒక్కటి విడిచిపెట్టలేదు.....మహా పాపి అయిన నేను ఇప్పుడు శిక్ష అనుభవిస్తుంటే ఎంత విచారించి ఎం.ప్రయోజనం???? అని పరిపరి విధాలుగా ఏడుస్తూ - కింకరుల ఆదలింపులకి భీతిల్లుతూ ఆ నరకాలు అనుభవిస్తూ ఉంటాడు అని శ్రీమన్నారాయణుడు తన భక్తుడు ఖగపతికి యమమార్గం ఎంత కఠినమో వివరించాడు 5వ అధ్యాయము సమాప్తం

రేపు 6 వ భాగము చదువుకుందాము

Wednesday, March 6, 2019

Advance National Women’s Day


Advance National Women’s Day

Advance National Women’s Day

Advance Happy Women’s Day quotes. International Women’s Day or IWD is remembered all around the world every March 8. It’s also celebrated on August 9th each year in South Africa under the name National Women’s Day as a public holiday. It is the celebration of the achievements of women all over the planet for their achievements in all aspects of society and civilization including social, economic, cultural and political arenas.
In some countries, IWD is celebrated as a day of appreciation much like Mother’s Day. For other countries, however, International Women’s Day is a day which highlights the political and human rights struggles of women worldwide. Wherever in the world you may be living, hopes that you live in a country where women are able to live to their full potential in happiness and health. Share these Happy Women’s Day quotes and greet all the important and beloved women in your life.

Tuesday, March 5, 2019

శ్రీ గరుడ పురాణం 4 వ అధ్యాయము

శ్రీ గరుడ పురాణం 4 వ అధ్యాయము


యమలోక మార్గ వివరణ,ఆ మార్గం ఎలా ఉంటుంది?యమభటులు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ కర్తవ్యం ఏమిటి?పాపాత్ములకి విధించే శిక్షలు ఏంటి?

నరలోకనికి, నరకలోకానికి 86000 ఆమడల దూరం ఉంటుంది. దీనిని సుమారుగా 8600 క్రోసుల దూరం అని చెప్పవచ్చు. ఈ నాటి కొలమానం ఐతే దాదాపు 68800 మైళ్ళ దూరం. ఆలోకంలోనే యమధర్మ రాజు నివాసమైన యమపురి ఉంటుంది. ఆ యముని వద్ద ఆయుష్హు తీరినవారిని పట్టుకుని రావడానికి పంపే నిమిత్తం ఒక్కో జీవికి (ముగ్గురు చొప్పున) అసంఖ్యంగా భటులు ఉంటారు.వారి రూపమెంతో భీకరం. భయోత్పాతం కలిగించే ఘోరమైన ఆకృతితో పాటు అగ్నినే దహించగలిగినంత కోపం, కారు మేఘాల్లాంటి నల్లటి వస్త్రాల ఆచ్ఛాదన,పాశం, ముసలం (రోకలి) వంటి ఆయుధధారణ వారి స్వంతం. ఆయువు తీరిన జీవిని పట్టి, వాయురూప దేహం కల్పించి,యమధర్మరాజు ఎదుట ప్రవేశ పెట్టడమే వారి విధి నిర్వహణ యమకింకరులు పాశం పట్టి లాగుతుండగా, అతి సుధీర్గము,అతి కఠినం అయిన యమలోకం మార్గంలో నానాక్లేసాలు అనుభవిస్తూ జీవుడు నడవాల్సి ఉంటుంది. మృతి చెందిన వెంటనే౼తృటిలో యమకింకరులు యమసధనమున ప్రవేశ పెట్టిన ఆ మార్గమే ఇప్పుడు జీవుడు అధిగమించాలి. రేయింబవళ్లు నడవాలి. యమకింకరులకు దయా దాక్షిణ్యాలు ఉండవు.మార్గంలో కఠినమైన అవరోధాలు ఉన్న వారు ఈడ్చుకుంటూ,దండించుకుంటూ నడిపిస్తుంటారు. ఆ మార్గంలో ౼మొనదేలిన కత్తులతో సమానంగా ఉండే ఆకులు గల్గిన దట్టమైన చెట్లు నిండిన "అసిపత్రవనం" అనే అడవి ఉంటుంది. ఆ అటవీ మార్గంలో ఒకదాన్ని ఒకటి ఒరుసుకుని, ముందుకు చొచ్చుకొని వచ్చినట్లు చెట్లు జీవుని శరీరాన్ని ఎక్కడికి అక్కడే చెల్చేస్తూ, రక్తధారలు స్రవింపజేస్తుంటాయి.

యమభటులు ఏం చేస్తుంటారు

ఆయువు ముగిసినవారిని పట్టి, వాయుశరీరం లోకి ప్రవేశ పెట్టి,తమ ప్రభువైన యమధర్మ రాజు ముందు నిలిపి. పశాండధరా!!! మీ ఉత్తర్వు ప్రకారం ఆయుష్హు తీరినవారిని,మీ సన్నిధిని ప్రవేశ పెడుతున్నాము. ఇక మేము చేయవల్సింది ఏమిటో శెలవు ఇవ్వండి అని అడుగుతారు. అప్పుడు మహిష వాహనుడు అయిన యమధర్మరాజు "కింకరులరా! మంచిది. ఈ జీవుని 13 దినమున నా దగ్గరకు రండి" అని చెప్పడంతో దూతలు ఆజ్ఞ పాటించి,క్షణంలో ఆ జీవుని తెచ్చి నరలోకంలో అతని నివాసం వద్ద విడుస్తారు. ఆ జీవుడు యమపురికి వెళ్ళిరావాల్సిన వాడు కావడం వల్ల, మృతి చెందిన తక్షణమే దహనం చెయ్యరు.యముని ఆజ్ఞ మేరకు ఆ జీవుడు కి ఇంకా భూమ్మీద వాసయోగ్యత ఉందేమో అని బంధువుల ఆశ. ఆ దారిలో ఆకలిదప్పులు తీరే అవకాశమే లేదు. నెల చదునుగా ఉండటం వలన పాదాలు బొబ్బలు ఎక్కుతాయి. అరికాళ్ళకి గుచ్చుకునే ముళ్లకు అంతు ఉండదు.రక్తం కాలువలై కట్టి ప్రవహిస్తున్నా.....యమభటులకి జాలి కలగదు. వారు అదిలిస్తూ నడిపించక మానరు. మార్గంలోనే ఇదంతా పిందశరీరం పడే యాతన. ఇక౼ యమపురిలో ప్రవేసించన వెనుక పడే బాధ వర్ణనాతీతం. ఆ యమపురి ఘోరపాపుల నిలయం.ఎటు చూసినా నరక బాధలు అనుభవించే హాహాకారాలు మిన్నంటి ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. అక్కడ నీరు దొరకదు. మృగతృష్ణ (ఎండమావులు) నీరు ఉన్నట్లే కనిపిస్తుంది కానీ ఎంత దూరం పరుగులు పెట్టినా దాహం తీరే దారి కానరాదు. రక్తాన్ని వర్షించే మేఘాలే తప్ప నీటి బొట్టు రాల్చే మేఘమేది ఉండదు

పాపాత్ములకి విధించే శిక్షలు.

పాపం చేసిన వారికి ఆ పాపపు తీవ్రత బట్టి శిక్ష ఉంటుంది. కొందరిని రొకళ్ళతో దంచుతారు. కొందరిని ఆయుధాలతో తిరుగుతారు.మారికొందరిని కత్తి తో నున్నగా పెచ్చు తరుగుతూ తోలు తీస్తారు. ఇంకా కొందరిని గానుగల్లో వేసి తిప్పుతారు. వ్యభిచారం అనే మహా పాపానికి విధించే శిక్ష మరింత క్రూరంగా ఉంటుంది. రాగితో తయారు అయిన రెండు విగ్రహాలు (ఒకటి పురుషుడిది, ఒకటి స్త్రీ ది) ఎర్రగా నిరంతరం కాలుతూ నిప్పు కణికల్లా మెరుస్తూ ఉంటాయి.ఇతరుల భార్యల్ని వాంఛించ వారికి కాలుతున్న స్త్రీ విగ్రహాన్ని, పురుషులతో సంగమించిన దానిని కాలుతున్న పురుష విగ్రహాన్ని జతచేసి బలవంతంగా కౌగలింప చేస్తారు. పాపాత్ములు ఆ విగ్రహాలు చూస్తేనే మూర్ఛపోతారు. యమభటులు ఊరుకుంటారా? లాగి, ఈడ్చి తన్ని ఆ శిక్ష అనుభవింపజేస్తారు. ఇంతకంటే పరసతులని/పారపురుషులని వాంఛిపకుండా ఉండటంమేలు కదా

Sunday, March 3, 2019

శ్రీ గరుడ పురాణం 3వ అధ్యాయము

శ్రీ గరుడ పురాణం 3వ అధ్యాయము


నిన్నటి భాగం తరువాయి
యమధర్మ రాజు పాపుల్ని శిక్షించమని ఆజ్ఞాపించుట....యమదూతలు శిక్షలు అమలు చేయడం.

నిష్చేష్టులై ఉన్న ఆ పాపుల్ని చూసిన యముడు "వారి పాపాలకి తగిన శిక్ష అనుభవింప చేయండి" అని భటులని ఆజ్ఞాపిస్తాడు. చండుదు౼ప్రచండుడు మొదలైన దూతలు నిర్ధయాత్ములై,పాపుల్ని అందరిని ఒక త్రాడుతో కట్టి నరకాల దగ్గరకి తీస్కునిపోతారు. అక్కడే ఒక పెద్ద వృక్షము కలదు. అది ఐదు యోజనముల వెడల్పు౼ఒక యోజనము ఎత్తు కలిగి ఉండును. యమభటులు పాపుల్ని తలక్రిందులుగా కట్టి౼కొట్టుదురు.ఆ భాదలని భరించలేక దుఃఖిస్తూ౼ పాపుల్ని రక్షించే వాడు అక్కడ ఉండదు. ఇలా వేలాడుతున్న పాపులు ౼ యమభటులని అనేక విధంగా ప్రార్ధిస్తారు. యమభటులు ౼ వివిధ ఆయుధములు తో వారిని కొడతారు. పాపాత్ములరా!!! పాపకార్యములు అనేకం చేసిరి..... పితృదేవతలకు తర్పణం ఇయ్యలేదు౼పెద్దలని గౌరవించలేదు౼సులభమైన జలము అన్నము ఎవరికి పెట్టలేదు౼కాకులకి, కుక్కలకి ఏమియును పెట్టలేదు౼అతిథుల్ని ఆదరింపలేదు౼దేవతల్ని అర్చింపలేదు౼ఇట్టి మిమ్ము ఆ శ్రీహరి మాత్రమే క్షమించగలడు. మేము అతని ఆజ్ఞచే౼మీ పాపములకు తగినట్లు శిక్షిస్తున్నాం౼అని అనేక విధముగా పాపుల్ని కొట్టేదరు౼కుక్కలచే కరిపించుదురు. వివిధ ఆయుధములచే చీల్చి ౼ మరుగుచున్న నూనె లో వేసి ౼ అనేక విధములు గా శిక్షిస్తారు. తరువాత వారిని యముని ఆజ్ఞ ప్రకారము తామిస్రము అనే నరకంలో పడేస్తారు అని శ్రీ హరి గరుత్మంతునికి వివరించాడు ఆ పిదప, ఖగరాజు సర్వలోక పూజ్యుడు అయిన శ్రీ హరికి నమస్కరించి "ఓ కరుణానిధి! నరకములు ఎన్ని? వారి స్వరూపం ఎట్టిది?అందులో బాధలు చెందే వారి దుర్దసలు ఏంటి? సవివరంగా నాకు వివరించండి" అని అనగా శ్రీ మహావిష్ణువు ఈ విధముగా సెలవు ఇచ్చాడు

నానారకముల నరకాలు:-
ఓ ఖాగరాజ!గరుడా! నరకములు ఇన్ని అన్ని అని చెప్పడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే అవి అగణితం గా ఉన్నాయి. మానవుని చిత్త ప్రవృత్తులలో ఎన్ని దుష్టపు ఆలోచనలు ఉంటే వాటి అన్నింటికీ సంబంధించిన నరకాలు చవిచూడాల్సి వస్తుంది.కనుక అవి అసంఖ్యంగా ఉన్నాయి అని చెప్పక తప్పదు. కానీ నీవంటి జ్ఞానికి ఆ సంఖ్య రేణమాత్రంగా అయిన గోచరించడానికి 84 లక్షల నరకాలు ఉన్నాయి.జీవుల సంఖ్యకు ఇవి సరిసమానం అనుకో....
వీటిలో కూడా ఘోరతిఘోరమైన నరకాలు 21
వైతరణీ కి చేరువగా సారమేయోదనము కూడా చేర్చవచ్చును. ఈ నరకాలకు చేరువలో ఐదు ఆమడల విస్తీర్ణం ఒక యోజనము ఎత్తు కలిగిన ఒక బూరుగ వృక్షం అగ్నిహోత్రం లాగా వెలుగుతూ ఉంటుంది.పాపాత్ములు అందరిని ఆ చెట్టుకు తలక్రిందులు గా కట్టి యమదూతలు కొడుతూ ఉంటారు. వారిని అక్కడ ఆదుకోవడానికి ఎవరూ ఉండరు.యమదూతల చేత వారు హింసించబడుతూనే "వారేమి పుణ్యకార్యలు చేయలేదో ఆ పుణ్యకార్యాల చిట్టాని యమభటులు చెప్తుండగా వింటారు. కొందరు పాపులు దెబ్బలకి ఓర్వలేక గిలాగిలలాడి పడిపోతారు.అలా పడేటప్పుడు ఆ చెట్టు ఆకుల చేత కోసుకుపోయి వారి శరీరం తెగిపోతూ ఉంటుంది. కిందపడిన వారిని కుక్కలు కరుస్తాయి. ఈ పాపులలో కొందరిని భటులు రంపాలతో కోస్తారు. కొందర్ని గొడ్డళ్లతో నరుకుతారు. కొందరిని సలసల కాగే నూనెలోకి పడేసి వేపుతూ ఉంటారు.కొందర్ని నిప్పుల్లో కాల్చి సమ్మెటల్తో సాగకొడతారు.కొందర్ని నూతుల్లోకి తోస్తారు. కొందరిని శిఖరాలు నుండి కిందకి దొర్లిస్తారు.కొందరిని గానుగల్లో ఆడించినట్లు తిప్పుతూ ఉంటారు. కొందర్ని పురుగుల గుంటలోకి తోస్తారు వజ్రపు ముక్క గల కాకులు౼గ్రద్దలు వల్ల ఆ పాపులు పడే హింస వర్ణనాతీతం
21 అతిఘోర నరకాలు ఇవి.

1.తమిస్రము
2.అంధ తమిస్రము
3. రౌరవం
4. మహారౌరవం
5.కుంభీపాకము
6.సూచీముఖం
7.అసిపత్రవనము
8.అవీచి
9.అంధకూపము
10.వైతరణీ
11.పుయోధ
12. కృమిభోజనం
13. ప్రాణరోధ
14.కాలసూత్రము
15.సందర్శము
16. తప్తోర్మీ
17.వజ్రకంటకం
18. శాల్మలి
19. వినాశము
20. నానాభక్షణము
21.రేతః పానము
సశేషం
రేపు  అతిఘోరమైన నరకాల వివరణ ఏ ఏ పాపానికి ఆ నరకం అలానే దాంట్లో విధించే శిక్షలు  తెలుసుకుందాము.

ALL COVID 19 ITEMS AVAILABLE

  ALL COVID 19 ITEMS AVAILABLE  

STARS