గరుడ పురాణము - 10
ఇరువది ఐదవ ద్వాపరములో
శక్తి
ఇరువది యారవ ద్వాపరములో
పరాశరుడు
ఇరువది యేడవ ద్వాపరములో
జాతూకర్ణుడు
ఇరువది ఎనిమిదవ ద్వాపరములో
కృష్ణ ద్వైపాయనుడు
ఈ కృష్ణ ద్వైపాయనుడు బ్రహ్మ శాసనము మీద వేదములను నాలుగుగా విభజించి పైల, జైమిని, సుమంతు, వైశంపాయనులను శిష్యులకు భోదించి, అష్టాదశ పురాణములను రచించిరో మహర్షణునకు (సూతునికి ) బోధించి లోకములో వ్యాపింప జేసెను .
శ్రీ హరి దశావతారములు
1 .మత్స్యావతారము
వైవస్వత మను వొకనాడు నదిలో సూర్యునికి అర్ఘ్య మిచ్చు చుండగా ఒక చేప పిల్ల అతని చేతిలో బడెను . అది పెరిగి పెద్ద దగుచుండగా గంగాళము లోను, చెరువులోను, సరస్సులోను వేసెను. అప్పుడా చేప మనువుతో " ప్రళయ కాలమున ఒక నావ వచ్చును. దానిలో సప్త మహర్షులను నీవును ఎక్కి కూర్చుండుడు . ప్రళయాంతము వరకును ఆ నావను మహా సముద్రములో నా కొమ్మునకు గట్టుకుని లాగుకొని పోవుచునే యుందు, " నని చెప్పెను. మనువట్లే చేసి ఆ ప్రళయమును దాటెను. మరల బ్రహ్మ సృష్టి చేయుటకు పూను కొన్నప్పుడు హయగ్రీవుడను రాక్షసుడు (ఇతనినే సోమకాసురుడని కూడా అందురు) వేదముల నపహరించి సముద్రములో దాగి యుండగా శ్రీ మన్నారాయణుడు మత్స్యావతారమును మరల ధరించి, వానిని సంహరించి వేదములను మరల బ్రహ్మ దగ్గరకు చేర్చెను .
2 . కూర్మావతారము
దూర్వాసుని శాపముచే ఇంద్రుని సంపద లన్నియు సముద్రములో గలిసిపోగా, విష్ణు మూర్తి సలహా మీద దేవ దానవులు సముద్రమును మదించిరి. ఈ పాల సముద్రమును మదించుట కారంబించినపుడు కవ్వముగా వేసిన మందర పర్వతము మునిగిపోసాగెను. అప్పుడు నారాయణుడు కూర్మావతారమును ధరించి దాని క్రింద ఆధారముగా నిలువబడెను. దానితో సముద్ర మధనము జరిగి సర్వ వస్తువులను ,అమృతమును పుట్టెను.
3 .వరాహావతారము
హిరణ్యాక్షుడు దేవతలను గెలిచి స్వర్గ మాక్రమించిన ప్పుడు అతనిని యజ్ఞ వరాహ రూపముతో సంహరించెను.