శ్రీ గరుడ పురాణం 3వ అధ్యాయము
శ్రీ గరుడ పురాణం 3వ అధ్యాయము
నిన్నటి భాగం తరువాయి
యమధర్మ రాజు పాపుల్ని శిక్షించమని ఆజ్ఞాపించుట....యమదూతలు శిక్షలు అమలు చేయడం.
నిష్చేష్టులై ఉన్న ఆ పాపుల్ని చూసిన యముడు "వారి పాపాలకి తగిన శిక్ష అనుభవింప చేయండి" అని భటులని ఆజ్ఞాపిస్తాడు. చండుదు౼ప్రచండుడు మొదలైన దూతలు నిర్ధయాత్ములై,పాపుల్ని అందరిని ఒక త్రాడుతో కట్టి నరకాల దగ్గరకి తీస్కునిపోతారు. అక్కడే ఒక పెద్ద వృక్షము కలదు. అది ఐదు యోజనముల వెడల్పు౼ఒక యోజనము ఎత్తు కలిగి ఉండును. యమభటులు పాపుల్ని తలక్రిందులుగా కట్టి౼కొట్టుదురు.ఆ భాదలని భరించలేక దుఃఖిస్తూ౼ పాపుల్ని రక్షించే వాడు అక్కడ ఉండదు. ఇలా వేలాడుతున్న పాపులు ౼ యమభటులని అనేక విధంగా ప్రార్ధిస్తారు. యమభటులు ౼ వివిధ ఆయుధములు తో వారిని కొడతారు. పాపాత్ములరా!!! పాపకార్యములు అనేకం చేసిరి..... పితృదేవతలకు తర్పణం ఇయ్యలేదు౼పెద్దలని గౌరవించలేదు౼సులభమైన జలము అన్నము ఎవరికి పెట్టలేదు౼కాకులకి, కుక్కలకి ఏమియును పెట్టలేదు౼అతిథుల్ని ఆదరింపలేదు౼దేవతల్ని అర్చింపలేదు౼ఇట్టి మిమ్ము ఆ శ్రీహరి మాత్రమే క్షమించగలడు. మేము అతని ఆజ్ఞచే౼మీ పాపములకు తగినట్లు శిక్షిస్తున్నాం౼అని అనేక విధముగా పాపుల్ని కొట్టేదరు౼కుక్కలచే కరిపించుదురు. వివిధ ఆయుధములచే చీల్చి ౼ మరుగుచున్న నూనె లో వేసి ౼ అనేక విధములు గా శిక్షిస్తారు. తరువాత వారిని యముని ఆజ్ఞ ప్రకారము తామిస్రము అనే నరకంలో పడేస్తారు అని శ్రీ హరి గరుత్మంతునికి వివరించాడు ఆ పిదప, ఖగరాజు సర్వలోక పూజ్యుడు అయిన శ్రీ హరికి నమస్కరించి "ఓ కరుణానిధి! నరకములు ఎన్ని? వారి స్వరూపం ఎట్టిది?అందులో బాధలు చెందే వారి దుర్దసలు ఏంటి? సవివరంగా నాకు వివరించండి" అని అనగా శ్రీ మహావిష్ణువు ఈ విధముగా సెలవు ఇచ్చాడు
నానారకముల నరకాలు:-
ఓ ఖాగరాజ!గరుడా! నరకములు ఇన్ని అన్ని అని చెప్పడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే అవి అగణితం గా ఉన్నాయి. మానవుని చిత్త ప్రవృత్తులలో ఎన్ని దుష్టపు ఆలోచనలు ఉంటే వాటి అన్నింటికీ సంబంధించిన నరకాలు చవిచూడాల్సి వస్తుంది.కనుక అవి అసంఖ్యంగా ఉన్నాయి అని చెప్పక తప్పదు. కానీ నీవంటి జ్ఞానికి ఆ సంఖ్య రేణమాత్రంగా అయిన గోచరించడానికి 84 లక్షల నరకాలు ఉన్నాయి.జీవుల సంఖ్యకు ఇవి సరిసమానం అనుకో....
వీటిలో కూడా ఘోరతిఘోరమైన నరకాలు 21
వైతరణీ కి చేరువగా సారమేయోదనము కూడా చేర్చవచ్చును. ఈ నరకాలకు చేరువలో ఐదు ఆమడల విస్తీర్ణం ఒక యోజనము ఎత్తు కలిగిన ఒక బూరుగ వృక్షం అగ్నిహోత్రం లాగా వెలుగుతూ ఉంటుంది.పాపాత్ములు అందరిని ఆ చెట్టుకు తలక్రిందులు గా కట్టి యమదూతలు కొడుతూ ఉంటారు. వారిని అక్కడ ఆదుకోవడానికి ఎవరూ ఉండరు.యమదూతల చేత వారు హింసించబడుతూనే "వారేమి పుణ్యకార్యలు చేయలేదో ఆ పుణ్యకార్యాల చిట్టాని యమభటులు చెప్తుండగా వింటారు. కొందరు పాపులు దెబ్బలకి ఓర్వలేక గిలాగిలలాడి పడిపోతారు.అలా పడేటప్పుడు ఆ చెట్టు ఆకుల చేత కోసుకుపోయి వారి శరీరం తెగిపోతూ ఉంటుంది. కిందపడిన వారిని కుక్కలు కరుస్తాయి. ఈ పాపులలో కొందరిని భటులు రంపాలతో కోస్తారు. కొందర్ని గొడ్డళ్లతో నరుకుతారు. కొందరిని సలసల కాగే నూనెలోకి పడేసి వేపుతూ ఉంటారు.కొందర్ని నిప్పుల్లో కాల్చి సమ్మెటల్తో సాగకొడతారు.కొందర్ని నూతుల్లోకి తోస్తారు. కొందరిని శిఖరాలు నుండి కిందకి దొర్లిస్తారు.కొందరిని గానుగల్లో ఆడించినట్లు తిప్పుతూ ఉంటారు. కొందర్ని పురుగుల గుంటలోకి తోస్తారు వజ్రపు ముక్క గల కాకులు౼గ్రద్దలు వల్ల ఆ పాపులు పడే హింస వర్ణనాతీతం
21 అతిఘోర నరకాలు ఇవి.
1.తమిస్రము
2.అంధ తమిస్రము
3. రౌరవం
4. మహారౌరవం
5.కుంభీపాకము
6.సూచీముఖం
7.అసిపత్రవనము
8.అవీచి
9.అంధకూపము
10.వైతరణీ
11.పుయోధ
12. కృమిభోజనం
13. ప్రాణరోధ
14.కాలసూత్రము
15.సందర్శము
16. తప్తోర్మీ
17.వజ్రకంటకం
18. శాల్మలి
19. వినాశము
20. నానాభక్షణము
21.రేతః పానము
సశేషం
రేపు అతిఘోరమైన నరకాల వివరణ ఏ ఏ పాపానికి ఆ నరకం అలానే దాంట్లో విధించే శిక్షలు తెలుసుకుందాము.