గరుడ పురాణము - 8
అంతే కాదు ; ఆవేదాలలోని ధర్మములను భోదించుటకై పదునెనిమిది పురాణములను, పదునెనిమిది ఉప పురాణములును వెలసినవి.
గతించిన ఇరువది యేడు ద్వాపర యుగములలోను
జన్మించిన వ్యాసులు వీరు :
మొదటి మహాయుగమున ద్వాపరములోని వ్యాసుడు స్వాయుంభువ మనువుజన్మించిన వ్యాసులు వీరు :
రెండవ ద్వాపరములో ప్రజాపతి
మూడవ ద్వాపరములో ఉశ నసుడు
నాలుగవ ద్వాపరములో బృహస్పతి
ఐదవ ద్వాపరములో సవితృడు
ఆరవ ద్వాపరములో మృత్యువు
ఏడవ ద్వాపరములో ఇంద్రుడు
ఎనిమిదవ ద్వాపరములో వసిష్టుడు
తొమ్మిదవ ద్వాపరములో సారస్వతుడు
పదవ ద్వాపరములో త్రిధాముడు
పదునొకండవ ద్వాపరములో త్రివృషుడు
పండ్రెండవ ద్వాపరములో శత తేజుడు
పదమూడవ ద్వాపరములో ధర్ముడు
పదునాలుగవ ద్వాపరములో తరక్షుడు
పదునైదవ ద్వాపరములో త్ర్యారుణి
పదునారవ ద్వాపరములో ధనంజయుడు
పదునేడవ ద్వాపరములో కృతంజయుడు
పదునెనిమిదవ ద్వాపరములో ఋతంజయుడు
పందొమ్మిదవ ద్వాపరములో భరద్వాజుడు
ఇరువదవ ద్వాపరములో గౌతముడు
ఇరువదొక్కటవ ద్వాపరములో రాజశ్రవుడు
ఇరువది రెండవ ద్వాపరములో శుష్మాయణుడు
ఇరువది మూడవ ద్వాపరములో తృణబిందుడు
ఇరువది నాలుగవ ద్వాపరములో వాల్మీకి