Monday, March 11, 2019

శ్రీ గరుడ పురాణం - 6 వ అధ్యాయము

శ్రీ గరుడ పురాణం-6 వ అధ్యాయము

ఈ మానుష జన్మ ఎంత ఉదాత్తమైనదో, అంతజటిలము. అంతగాను లంపటాల హేతువు. పుణ్యసముపార్జనకు ఎంత అనుకూలంగా ఉందొఇహలోక లంపటాల లో తగుల్కొనడానికి అంతేఅనువుగా ఉన్నది. కారణం......ముందేచెప్పినట్లుగా ఇంద్రియ చాపల్యం. వీటితో జ్ఞానంసముపార్జన చేయడమా??? విషయ వాంఛలకులోబడటమా?? అనేది ఆయా మానవుల విచక్షణమీద - స్వతంత్ర నిర్ణయ శక్తి మీద ఆధార పడిఉంటుంది ఈ 5 ఇంద్రియాలను దేని నిమిత్తం వినియోగించాలిఅని మనిషి ఆశిస్తున్నాడో దానిని బట్టి అతని పాపపుణ్య కార్యాలు ఉంటాయి. వీటిని- జయించిభ్రమలకు లోను కాకుండా జీవితం గడుపు వారికిస్వర్గం తధ్యం ఇంద్రియాలు నిరంతరం భ్రమలకు గురిచేస్తుంటాయి అనడానికి కొన్ని ఉదాహరణలు భ్రమ ఎలాంటిది అంటే ఒక జింక ఉంది అనుకుందాం!! దాన్ని వలలోవేసుకివడానికి బోయవాడు వేణువు ఊదాడు. అప్పుడు ఆ జింక శ్రవణేంద్రియం ఆ వేణు గానంపట్ల అక్షర్షితమై అలాగే మైమర్చిపోతుంది. అప్పుడాజింక సులభంగా బోయవాడికి పట్టుబడిపోతుంది......ఇక్కడ జరిగేది ఏంటి అంటే.... కృష్ణ జింక తన చెవులని తన ఆధీనంలోఉంచుకోలేకపోయింది. ఆపద కొని తెచ్చుకున్నది.... ఒక గజరాజు ఉన్నాడు బలంలో సాటిరాగలజంతువు ఏది గజరాజుకి లేదు..... కానీ ఎన్నో రెట్లుబలం తక్కువగా ఉన్న మావటి వాడు ఏనుగులు సంచరించే ప్రాంతంలో పెద్ద గోతులు తీసి పలుచగాఆకులు అలమలు కప్పి ఆ దరిదాపుల్లో ఆడఏనుగు చేత ఘీంకారాలు చేయించాడుఅనుకుందాం.... ఆడ ఏనుగు కోసం వెంపర్లాట లోపడి కన్నుగానక గోతుల్లో పడిపోతుంది ఇక్కడవిష్య వాంఛ వలన ఏనుగు ఇక్కట్ల పాలుఅయ్యింది. స్పర్శ సుఖం కోసం ఆరాటం ఆపదకారకం..... దీపం పురుగులు ఉన్నాయి. దీపాన్ని తాకిమాడిపోతుంటాయి. తేనెటీగలు ఎంతో శ్రమించికూడబెట్టిన తేనె జిహ్వ చాపల్యం కొద్దీ కొంత త్రాగిమత్తులో ఉండగానే వేటగాడు వచ్చి మంటబెట్టివాటిని మట్టు బెట్టి వాటి జిహ్వ చాపల్యంతీరకుండానే తేనె సొంతం చేస్కుంటాడు. మాంసపుముక్కల్ని గాలపు ముల్లుకి గుచ్చి ఆ వాసనకుచేపను ఆక్షర్షింపబడగానే, గాలానికితగులుకునేలాగా ఏర్పాటు చేస్తారు జాలరి. ఇక్కడ చేపలను నాసిక మోసం చేసి ఆపద పాలు చేసింది.

బంగారాన్ని చూసి దీపం పురుగు లాగా ఆపదతెచుకునేవాళ్ళు. కాసుల గలగలలకు లొంగి, దాన్నిఅపహరించాలనే ఆశతో జింకలగా ప్రాణం మీదకితెచుకోగలరు. పరభార్యాల లట్లఆశక్తితో, ఏనుగులగా గోతిలో పడి అధములైనఉత్తములు అనేకులుంటారు. భార్యపుత్రులచేతేనెలగా భావించి అన్ని సమకూర్చితే, వాళ్లే తనకుకాకుండా పోయినప్పుడు తేనెటీగ మాదిరిగావగచేవారున్నారు. అధికారం పదవిఆశించి, చేపలాగా ముల్లుకి చిక్కి విలవిలలాడేవారుఉన్నారు. పదవీ నిర్వహణలో సుఖం ఉందిఅనుకోవడం కూడా భ్రమే!!! గద్దెనెక్కిన వారి పాట్లు- వారికి కలిగే ఆటుపోట్లు అనుభవిస్తే తప్పతెలిసిరాదు బాలుడైనా, యవ్వనం గలవాడు అయిన, వృద్ధుడుఅయిన జరిగిపోయిన రోజులు లెక్కించే యముడు ఒకడున్నాడు అని తెలుసుకోవడం లేదు. లోకాల్లోజనులు పుట్టి - పుట్టి మరణిస్తూనే ఉన్నారు. జననం అనేది ఇతరులకు తెలియకుండా ఎలాజరిగిపోతోందో ఆయువు తీరాక కూడా ప్రాణంఅలానే పోతుంది. కానీ భార్య పుత్రులని విడిచిఅందరూ చూస్తుండగానే మరణిస్తారు. లోకంలో తానొక్కడే ఎవరితోడూ లేకుండా ఎలావస్తున్నాడో - పోయేటప్పుడు కూడా ఎవరి తోడులేకుండా అలానే పోతాడు. మరణించిన వానిదేహాన్ని భూమి పై కట్టె లాగా ఉంచి బంధువులుఅంత హహకారాలతో ఏడుస్తారు.....వాళ్ళు అలాఏడవటం వలన ఏమన్న ప్రయోజనంఉంటుందా??? ఏమి ఉండదు..... ఒకడు తప్పుడు సాక్ష్యాలు చెప్తాడు మరొకడుతప్పుడు లెక్కలు చూపిస్తాడు. ఇంకొకడు చెడుత్రోవలో నడుస్తాడు. అలానే కొందరు హత్యలుచేస్తారు. వారివరసలు లేకుండా స్త్రీ పొందకోరుతారు. అనెన్నో పాపాలు చేసి ధనం.పోగు చేసిఅది చూసుకుని మురిసిపోతారు.... ఇంద్రియ భోగాలకు బలీయమైనప్పుడు మనుషులుఈ జన్మను వ్యర్థంగా చెడగొట్టుకున్న వారుఅవుతారు. ఇంతకంటే మూఢుడు ఇంకొకడుఉండదు కదా..... అన్ని జన్మలో మానవ జన్మదుర్లభమైన జన్మ అతడు తన చేతిలో ఉన్నఅమృత భాండాన్ని తానే జారవిడుచుకునివెర్రివాడితో సమానం అవుతాడు తరువాత వార్ధక్యాన్ని పొంది, రోగాలతోబాధపడుతూ మృతి చెంది నరకాలకి పోతాడు. ఇట్లాగే గతా గతముల చేత పాపాత్ములు కర్మబద్ధులైఎన్నటికీ వైరాగ్యం పొందక సంసారంలో పడి మునిగితేలుతూ దుఃఖిస్తుంటారు. పాపులు నరకానికి వెళ్లే విధానం వివరించబడిందిగరుడ!!!! మరల ఇంకేమి వినగోరుతావు??? అనిశ్రీహరి అడుగగా జీవుడు పిండ శరీరాకృతి పొందేవిధానం చెప్పామన్నాడు గరుత్మంతుడు.
సశేషం......గరుడ పురాణం నుండి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన జీవిత సత్యాలు... వైరాగ్యంకాదు ఇది వాస్తవం.... భ్రమ ఎలాంటిది? అతిదుర్లభమైన మానవ జన్మ ఎత్తి మనిషి ఏ విధంగాపాపి అవుతున్నాడు????

ALL COVID 19 ITEMS AVAILABLE

  ALL COVID 19 ITEMS AVAILABLE  

STARS