Tuesday, March 5, 2019

శ్రీ గరుడ పురాణం 4 వ అధ్యాయము

శ్రీ గరుడ పురాణం 4 వ అధ్యాయము


యమలోక మార్గ వివరణ,ఆ మార్గం ఎలా ఉంటుంది?యమభటులు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ కర్తవ్యం ఏమిటి?పాపాత్ములకి విధించే శిక్షలు ఏంటి?

నరలోకనికి, నరకలోకానికి 86000 ఆమడల దూరం ఉంటుంది. దీనిని సుమారుగా 8600 క్రోసుల దూరం అని చెప్పవచ్చు. ఈ నాటి కొలమానం ఐతే దాదాపు 68800 మైళ్ళ దూరం. ఆలోకంలోనే యమధర్మ రాజు నివాసమైన యమపురి ఉంటుంది. ఆ యముని వద్ద ఆయుష్హు తీరినవారిని పట్టుకుని రావడానికి పంపే నిమిత్తం ఒక్కో జీవికి (ముగ్గురు చొప్పున) అసంఖ్యంగా భటులు ఉంటారు.వారి రూపమెంతో భీకరం. భయోత్పాతం కలిగించే ఘోరమైన ఆకృతితో పాటు అగ్నినే దహించగలిగినంత కోపం, కారు మేఘాల్లాంటి నల్లటి వస్త్రాల ఆచ్ఛాదన,పాశం, ముసలం (రోకలి) వంటి ఆయుధధారణ వారి స్వంతం. ఆయువు తీరిన జీవిని పట్టి, వాయురూప దేహం కల్పించి,యమధర్మరాజు ఎదుట ప్రవేశ పెట్టడమే వారి విధి నిర్వహణ యమకింకరులు పాశం పట్టి లాగుతుండగా, అతి సుధీర్గము,అతి కఠినం అయిన యమలోకం మార్గంలో నానాక్లేసాలు అనుభవిస్తూ జీవుడు నడవాల్సి ఉంటుంది. మృతి చెందిన వెంటనే౼తృటిలో యమకింకరులు యమసధనమున ప్రవేశ పెట్టిన ఆ మార్గమే ఇప్పుడు జీవుడు అధిగమించాలి. రేయింబవళ్లు నడవాలి. యమకింకరులకు దయా దాక్షిణ్యాలు ఉండవు.మార్గంలో కఠినమైన అవరోధాలు ఉన్న వారు ఈడ్చుకుంటూ,దండించుకుంటూ నడిపిస్తుంటారు. ఆ మార్గంలో ౼మొనదేలిన కత్తులతో సమానంగా ఉండే ఆకులు గల్గిన దట్టమైన చెట్లు నిండిన "అసిపత్రవనం" అనే అడవి ఉంటుంది. ఆ అటవీ మార్గంలో ఒకదాన్ని ఒకటి ఒరుసుకుని, ముందుకు చొచ్చుకొని వచ్చినట్లు చెట్లు జీవుని శరీరాన్ని ఎక్కడికి అక్కడే చెల్చేస్తూ, రక్తధారలు స్రవింపజేస్తుంటాయి.

యమభటులు ఏం చేస్తుంటారు

ఆయువు ముగిసినవారిని పట్టి, వాయుశరీరం లోకి ప్రవేశ పెట్టి,తమ ప్రభువైన యమధర్మ రాజు ముందు నిలిపి. పశాండధరా!!! మీ ఉత్తర్వు ప్రకారం ఆయుష్హు తీరినవారిని,మీ సన్నిధిని ప్రవేశ పెడుతున్నాము. ఇక మేము చేయవల్సింది ఏమిటో శెలవు ఇవ్వండి అని అడుగుతారు. అప్పుడు మహిష వాహనుడు అయిన యమధర్మరాజు "కింకరులరా! మంచిది. ఈ జీవుని 13 దినమున నా దగ్గరకు రండి" అని చెప్పడంతో దూతలు ఆజ్ఞ పాటించి,క్షణంలో ఆ జీవుని తెచ్చి నరలోకంలో అతని నివాసం వద్ద విడుస్తారు. ఆ జీవుడు యమపురికి వెళ్ళిరావాల్సిన వాడు కావడం వల్ల, మృతి చెందిన తక్షణమే దహనం చెయ్యరు.యముని ఆజ్ఞ మేరకు ఆ జీవుడు కి ఇంకా భూమ్మీద వాసయోగ్యత ఉందేమో అని బంధువుల ఆశ. ఆ దారిలో ఆకలిదప్పులు తీరే అవకాశమే లేదు. నెల చదునుగా ఉండటం వలన పాదాలు బొబ్బలు ఎక్కుతాయి. అరికాళ్ళకి గుచ్చుకునే ముళ్లకు అంతు ఉండదు.రక్తం కాలువలై కట్టి ప్రవహిస్తున్నా.....యమభటులకి జాలి కలగదు. వారు అదిలిస్తూ నడిపించక మానరు. మార్గంలోనే ఇదంతా పిందశరీరం పడే యాతన. ఇక౼ యమపురిలో ప్రవేసించన వెనుక పడే బాధ వర్ణనాతీతం. ఆ యమపురి ఘోరపాపుల నిలయం.ఎటు చూసినా నరక బాధలు అనుభవించే హాహాకారాలు మిన్నంటి ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. అక్కడ నీరు దొరకదు. మృగతృష్ణ (ఎండమావులు) నీరు ఉన్నట్లే కనిపిస్తుంది కానీ ఎంత దూరం పరుగులు పెట్టినా దాహం తీరే దారి కానరాదు. రక్తాన్ని వర్షించే మేఘాలే తప్ప నీటి బొట్టు రాల్చే మేఘమేది ఉండదు

పాపాత్ములకి విధించే శిక్షలు.

పాపం చేసిన వారికి ఆ పాపపు తీవ్రత బట్టి శిక్ష ఉంటుంది. కొందరిని రొకళ్ళతో దంచుతారు. కొందరిని ఆయుధాలతో తిరుగుతారు.మారికొందరిని కత్తి తో నున్నగా పెచ్చు తరుగుతూ తోలు తీస్తారు. ఇంకా కొందరిని గానుగల్లో వేసి తిప్పుతారు. వ్యభిచారం అనే మహా పాపానికి విధించే శిక్ష మరింత క్రూరంగా ఉంటుంది. రాగితో తయారు అయిన రెండు విగ్రహాలు (ఒకటి పురుషుడిది, ఒకటి స్త్రీ ది) ఎర్రగా నిరంతరం కాలుతూ నిప్పు కణికల్లా మెరుస్తూ ఉంటాయి.ఇతరుల భార్యల్ని వాంఛించ వారికి కాలుతున్న స్త్రీ విగ్రహాన్ని, పురుషులతో సంగమించిన దానిని కాలుతున్న పురుష విగ్రహాన్ని జతచేసి బలవంతంగా కౌగలింప చేస్తారు. పాపాత్ములు ఆ విగ్రహాలు చూస్తేనే మూర్ఛపోతారు. యమభటులు ఊరుకుంటారా? లాగి, ఈడ్చి తన్ని ఆ శిక్ష అనుభవింపజేస్తారు. ఇంతకంటే పరసతులని/పారపురుషులని వాంఛిపకుండా ఉండటంమేలు కదా

ALL COVID 19 ITEMS AVAILABLE

  ALL COVID 19 ITEMS AVAILABLE  

STARS