Tuesday, March 12, 2019

శ్రీ గరుడ పురాణం-7 వ అధ్యాయము

శ్రీ గరుడ పురాణం-7 వ అధ్యాయము

శ్రీ హరీ!!! మనుషులు ప్రమాదాల వల్ల కానీ,పాపాల వల్ల కానీ రాలిపోయే స్థితి వస్తే,వారు యమయాతనలు పొందకుండా ఉండే మార్గం వివరించండి అని గరుత్మంతుడు అడుగగా శ్రీ హరి ఈ విధంగా చెప్తున్నాడు
ఓ గరుడా!! పుత్రులు లేనివారికి దుర్గతి కలుగుతుంది అని మొదట చెప్పబడుతున్నది. పుత్రవంతులు అయినప్పటికీ, ధర్మాత్ములకి ఎప్పుడూ దుర్గతి కలగదు. కనుక సంతానము కోసం శివ పూజాదికాలు జరిగించి ఏ ఉపాయము వల్ల అయినా పుత్రులు కలిగేలాగా చూసుకోవాలి. పుత్రుడే పున్నామ నరకం నుండి తల్లిదండ్రులని రక్షిస్తాడు. "పుత్ర" నామసార్ఢ్యమ్ ఇదే!!! ధర్మాత్ముడు అయిన ఒక పుత్రుని వల్ల వంశం అంతా తరిస్తుంది. వేదాలలో పుత్ర మహిమ వేనోళ్ళ కొనియాడ బడుతోంది. అలాగే, పౌత్రుని అంగస్పర్శము వలన దేవ ఋణము, పితృ ఋణం, ముని ఋణము తీరి ముక్తుడు అవుతాడు. స్వర్గానికి వెళ్తాడు బ్రహ్మ వివాహం శ్రేష్టం, అవివాహిత పత్ని వల్ల ఎవరైనా పుత్రుని కన్నా,స్వర్గ లోక ప్రాప్తి కలుగదు. ఇట్లే ఇతరులు చేసిన శ్రార్ధం వలన సైతం పొందినట్లు ఐతే సవర్ణ స్త్రీ వలన కలిగిన ఔరస పుత్రుల వలన చేయబడే శ్రార్ధం వలనను స్వర్గలోకం పొందగలుగుతారు.......అన్ని చెప్పగా......గరుడుడు శ్రీహరి ని చూసి ఓ పరమపురుషా!! ఈ ప్రేత జన్మల గురించి ఏమన్న కధ ఉన్నదా??? ఉన్నట్లు ఐతే అటువంటి కధ సవిస్తారం గా తెలపండి అని ప్రార్ధించాడు అందుకు సమాధానం గా ఓ పక్షిరాజా!!! త్రేతా యుగం నాటి గాథ ఒకటి నీకు వినిపిస్తాను. విను!!! ఆ యుగంలో భబ్రువాహనుడు అనే ఒక గొప్ప రాజు ఉండేవాడు. అతడు ధర్మపరాయణుడు. ప్రముఖులచే సైతం ప్రశంసించబడిన వాడు. మహోదాయమనే నగరాన్ని రాజధాని గా చేసుకుని ప్రజారంజకం గా పాలన చేస్తూ ఒక నాడు అడవి లో వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక జింకను చూసి దాన్ని తరుముతూ ఆ అరణ్య మధ్యలోకి వెళ్లి దాని పై ఒక బాణం ప్రయోగించాడు. కానీ ఆ జింక తప్పించుకుని అక్కడ నుండి పరుగెత్తిపోయింది. బభ్రువాహనుడు ఆ జింక శరీరం నుండి కారే రక్త ధారలు బట్టి మరింత దూరం దానికై గాలించసాగాడు అతడొక్కడే జింకను తరుముతూ వెళ్లడంతో అతని పరివారం చాలా దూరంగా ఉండిపోయింది. అతడా అడవి దారిలో తప్పి,అందులోనే ఇంకొక వనంలోకి ప్రవేశించాడు. జింక మాత్రం కనపడలేదు. బాగా అలిసిపోయి దాహం చేత నాలుక ఎండిపోతుంటే నీళ్లకోసం వెతకసాగాడు....... మరింత దూరం సాగిన తరువాత - దివ్యమైన జలంతో ఒక తామర కొలను కనిపించింది. బభ్రువాహనుడు. ఆ చెరువులోకి దిగి స్నానం చేసి, నీరు త్రాగి ఒక చెట్టు కింద తన పరివారం వెత్తుకుంటూ వచ్చేంత వరకు విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నాడు. చెట్టు నీడన కాస్త సేద తీరాడు.. ఇంతలో ఒళ్ళు గగుర్పొడిచేలా ఎముకల గూడు నడుస్తున్న రీతిలో ఒక ప్రేతం కనపడింది. దానికి ఇతరులు ఎవరైనా భయపడాల్సిందే.... పరమవికారం గా ఆ లరేటనికి చేరువగా అటువంటివి మరికొన్ని ప్రేతలు సంచరిస్తున్నాయి. బభ్రువాహనుడు చూసిన ఆ ప్రేతం అతన్ని సమీపించి సంతోషం తో ఇలా అంది....... ఓ మహారాజా!!! నిన్ను దర్శించిన మాత్రము చేతనే ఈ ప్రేత దేహాన్ని వదిలి ఉత్తమగతి చెంది ధన్యుడిని అయ్యాను అని వినయంగా పలికేసరికి, ఆ రాజు మరింత ఆశ్చర్యంగా చూస్తూ ప్రేతమా!!! నీవెవరు??? నీకీ దుష్ట రూపం ఎలా వచ్చింది ఆ వైనం వివరించు అని ఆసక్తిగా అడిగాడు ప్రేత రూపుని చరిత్ర......
అప్పుడు ఆ ప్రేతము ఓ మహారాజా!!! నా చరిత్ర చెప్తున్నాను వినుము..... వైదేశం అనే పట్టణం ఒకటి ఉంది. అది రధాలు,ఏనుగులు, గుర్రాలు, ఇతర జీవ,మనుష్య జాలంతో -- అన్ని విధాలా సంపదలతో అలరారుతూ ఉండేది. అలాంటి పట్టణంలో నేను వైశ్య కులంలో పుట్టాను. నా పేరు దేవగుప్తుడు. నేను బ్రతికి ఉన్నంతకాలం దేవపూజలు చేశాను, బ్రాహ్మణులని పెద్దలని పూజించాను. దేవాలయాలు నిర్మింపచేసాను, సత్రాలు వేయించాను, బీద బిక్కి దిక్కు లేని వారికి నాకు వీలు అయినంత వరకు ఆదుకున్నాను. నాకు తెలిసి ఏ జీవికి హాని తలపెట్టలేదు.నాకు భార్యా పుత్రులు లేరు.బంధువులు లేరు.మరణానంతరం ఈ లరేత జన్మ రావడానికి కారణం నాకెవ్వరు కర్మం చేయకపోవడమే పైగా నాకీ ప్రేత జన్మ సంభవించి చాలా కాలమే అయ్యింది. ఓ రాజ శ్రేష్ఠ!! నేను మీకోకటి అభ్యర్ధిస్తున్నాను. మరణించిన వారికి సంస్కారం - సంచయనం నిత్య విధి,వృషోత్సర్జనం, షోడశం,సపిందీకరణం, మాసికం, శ్రార్ధం..... ఈ మొదలు అయినవన్ని పుత్రులు లేక జ్ఞాతులు చేయవలసిందే!!! కానీ,ప్రభువు అయిన నీవు లోకభాందవుడవు. ఎవ్వరూ లేనివారికి నీవే ఆప్తుడవు-రక్షకుడివి కూడా. ప్రేత రూపంలో ఉన్న నన్ను ఈ ఆపద నుండి గట్టెకించగలిగావు. నా దగ్గర దీనికి ఒక మణి ఉంది ఇది వేరే ఏ మణి ప్రకాశించలేదు.అంత గొప్ప మణి ఉంది. దీనిని నీకు పాదాల వద్ద సమర్పిస్తున్నాను స్వీకరించవలసింది అని ఆ మణిని సమర్పించబోయాడు..... అప్పుడు బభ్రువాహనుడు వారిస్తూ వైశ్య కులభూషణా పుణ్య కార్యాలు నెరవేర్చి నీవే గొప్ప దాతగా వెలిగొందిన వాడివి రాజునైన నేను ఇవ్వాల్సిన వాడ్ని!!! నా చెయ్యి పైన ఉండాలి,అట్టి నేను నీకు కర్మ చేయు నిమిత్తము,ఈ రత్నాన్ని అనుగ్రహిస్తాను అనుకున్నావా??? దీనికి ఆశించను,కానీ నాకున్న కొన్ని సందేహాలు తీర్చు!!! అసలు నీకు ఈ ప్రేత జసన్మా ఎట్లా సంప్రాప్తితించిందో చెప్పినట్లే ఇంకా ఏ ఇతర కారణాల వలన అయిన ప్రేత జన్మ కలిగే అవకాశం ఉందా??? ఒకవేళ పొందితే అందులో నుండి విముక్తి కై ఏం చేయాల్సి ఉంటుంది??? అని అడిగాడు.
ఏ విధంగా ఐతే ఏం??? ౼ ప్రేత జన్మ పొందినవారు ఉద్ధరించాలి అంటే ఓ మహారాజా అవస్యముగా నారాయణ బలి విధి నిర్వర్తించాలి. సంగ్రాహం గా ఆ విధానం ఈ విధంగా ఉంటుంది........ ఆది మధ్యాంతరహితుడు అయిన శ్రీ మన్నారాయణుడు ప్రతిమని శుద్ధమైన బంగారంతో తయారు చేయించి లేదా శంఖ చక్ర పీతాంబర సహితం గా ఆ బంగారు రేకు పై చిత్రించి, అట్లే ఇంద్రుడు బ్రహ్మ,రుద్రుడు మొదలైన వారి ప్రతిమతో పాటు మంటపం పైకి మంత్రాలతో ఆహ్వానించి పూజించాలి వృషోత్సర్జన క్రియ నిర్వహించి, ఆ తరువాత పదమూడు మంది బ్రాహ్మణులని రప్పించి వారికి గొడుగు, పాదరక్షలు, పీటలు, వస్త్రాలు, బియ్యం, గోదానం మొదలైనవి అతిశయంగా (షోడశ మహాదానాలు) జరిపించాలి. వారికి మృష్టాన్న భోజనం అనంతరం జలపూరిత ఘటదానం,సయ్య దానం వంటివి చెయ్యాలి. ఈ విధి సాంగోపాంగంగా నెరవేర్చగలిగితే ఏ రీతిగా ప్రేత జన్మ పొందినప్పటికి కూడా వారు ముక్తులు అవుతారు అని వైశ్య ప్రముఖుడు వివరించాడు. అప్పుడు బభ్రువాహన ప్రభువుని అతని పరివారం అంతా అక్కడకి వెతుక్కుంటూ అక్కడికి రాగా, ఆ ప్రేత జీవులు మాయమయ్యాయి. రాజు రాజధానికి చేరిన వెంటనే, తాను అడవిలో చూచిన వైశ్యుని ప్రేత జన్మ పోగొట్టడానికి సకల దానధర్మాలు జరిపించాడు. అప్పుడా దేవగుప్తునికి ప్రేతతత్వం వదిలింది. అపార పుణ్య జీవి కనుక నా సాయుధ్యాన్ని పొందాడు అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఓ గరుడా!!! పరులు చేసిన శ్రార్ధం వలననే ప్రేతం స్వర్గాధి పుణ్యలోకాలకు పోతుంటే, ఔరస పుత్రుల చేత చేయబడే శ్రార్ధం వల్ల సద్గతులు కలగడంలో ఆశ్చర్యం ఏమి లేదు.....
ఎవరీ ఇతిహాసాన్ని వింటారో లేక వినిపిస్తారో, ఆ ఇద్దరు కూడా మహా పాపులు అయినప్పటికీ ప్రేతతత్వం పొందక,స్వర్గాధి  పుణ్య లోకాలకు వెళ్తారు.

ALL COVID 19 ITEMS AVAILABLE

  ALL COVID 19 ITEMS AVAILABLE  

STARS