గరుడ పురాణము - 11
4 . నృసింహావతారము
అతని సోదరుడు హిరణ్య కశిపుడు తరువాత దేవలోకము నాక్రమించి యజ్ఞ భాగములను కాజేయగా నార సింహ రూపము ధరించి అతనిని సంహరించెను.
5 .వామనావతారము
బలి చక్రవర్తి ఇంద్రుడై దేవతలను స్వర్గము నుండి తరిమి వేయగా శ్రీ హరి వామనుడై పుట్టి, బలిని మూడడుగుల నేల యడిగి, వామనుడు అవామనుడై రెండడుగులలో భూమ్యాకాశముల నాక్రమించి అతనిని పాతాళమునకు త్రొక్కి వేసెను.
6 .పరశురాముడు
శ్రీ హరి తన అంశము తో జమదగ్నికి పరశురాముడై పుట్టి మదాంధులైన రాజులను ఇరువది యొక్క సారులు దండ యాత్రలు చేసి సంహరించెను. చివరికి దశరధ రాముని చేతిలో ఓడి తపమునకు బోయెను.
7 . శ్రీరాముడు
రావణ కుంభ కర్ణులను సంహరించుట కై దేవతలు ప్రార్ధించిన మీదట దశరధునకు రామునిగా పుట్టి, సీతను పెండ్లాడి, సీతా లక్ష్మణులతో అరణ్య వాసము చేసి అనేక రాక్షసులను వధించెను. రావణుడు సీత నెత్తికొన పోగా సుగ్రీవుని సహాయముతో లంకకు వెళ్లి రావణ కుంభ కర్ణాది రాక్షసులను సంహరించి, అయోధ్యకు వచ్చి పట్టము గట్టు కొనెను. లోకాపవాద మునకు భయపడి సీతను అడవిలో వదలగా ఆమె వాల్మీకి ఆశ్రమమునకు జేరెను. అప్పటికే గర్భవతి యైన సేత, అక్కడ కుశలవులను ఇద్దరు కొడుకులను గనెను. రాముడు పదునొక్క వేల యేండ్లు రాజ్యము చేసి కుశునికి పట్టాభిషేకము చేసి, సీతా సమేతుడై అయోధ్యా పుర వాసులతో సహా పరమ పదమునకు వేంచేసెను.