Tuesday, March 19, 2019

గరుడ పురాణము - 9

గరుడ పురాణము - 9


సూర్య, చంద్ర గ్రహణ సమయములలో ఇచ్చు దానము వలన దాత స్వర్గాది పుణ్య లోకములను బొందును. దేశమును, కాలమును, పాత్రతను (యోగ్యతను ) గమనించి ఇచ్చిన దానము కోటి గుణిత మగును. కర్కాటక, మకర సంక్రమణము లందును అమావశ్య, పూర్ణిమాది పర్వములందును చేసెడి దానము విశేష ఫలము నిచ్చును. దాత తూర్పు ముఖముగా కూర్చుండి సంకల్పము, గోత్రనామములతో జెప్పి దాన మీయవలెను. పుచ్చుకొనువాడు ఉత్తరాభి ముఖుడై స్వీకరింపవలెను. అట్లు చేసినచో దాతకు ఆయుర్దాయము పెరుగును. గ్రహీతకు పుచ్చుకున్నది అక్షయ మగును. మహాదానములు పది :
శ్లో || కనకా శ్వతి లానాగా దాసీరధ మహీ గృహాః ||
కన్యాచ కపిలా దేను: మహా దానాని వైదశ ||
తా || బంగారము, గుఱ్ఱము, తిలలు, ఏనుగులు,దాసీ జనము,రధములు ,భూమి, గృహములు, కన్యక నల్లని ధేనువు వీనిని మహా దానము లనిరి . ఇవి పది.
దేవతలకు గాని, బ్రాహ్మణులకు గాని, గురువులకు గాని, తల్లి దండ్రులకు గాని ఇచ్చెదనని వాగ్దానము చేసిన దానిని ఇయ్యక ఎగ గొట్టినచో వంశ నాశనము జరుగును. ప్రతి గ్రహీత నుండి ఏదో లాభము నాశించి దాన మిచ్చినచో అది నిష్ప్రయోజన మగును . ప్రతి గ్రహీత నుద్దేశించి దానము చేయుచు, ఆ దాన ధారను భూమిపై విడిచినచో ఆ దాన ఫలము మహా సాగరము కన్నా అనంతమైనది యగును. గౌతమీ, గంగా, గయా, ప్రయాగాది తీర్ధము లందిట్టి దానములు విశేష ఫలముల నిచ్చును. వైవస్వత మన్వంతరము లోని వ్యాసులు

ఇప్పుడు జరుగుచున్నది వైవస్వత మన్వంతరములో ఇరువది యెనిమిదవ మహాయాగము .అందులోను కలియుగము వ్యాసుడు జన్మించి వేదాలు నాలుగుగా విభజించి, పదునెనిమిది పురాణములు రచించినది ,దీనికి వెనుక ద్వాపర యుగములోనే గతించిన ఇరువది యేడు మహాయాగములలోను ద్వాపరములందు ఇరువది యేడుగురు వ్యాసులు జనియించిరి .ప్రతి కలియుగములో ను మానవుల శక్తి సామర్ద్యములు పూర్వ యుగములలో కంటే అల్పముగా నుండును. వారు అనంతములైన వేదములను అధ్యయనము చేయలేరు. అందు నిక్షిప్తమైన నిగూఢ ధర్మములను గ్రహించి ఆచరింప లేరు. అందుచేత ప్రతి మహాయాగము లోను ఒక వ్యాసుడు జనించి ఆ వేద రాశిని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము,అధర్వణ వేదము అను నాలుగు విభాగములు చేసి ఒక్కొక్క శాఖను కొన్ని వంశముల బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణముల వారు అధ్యయనము చేయవలెనని నియమించినారు.

ALL COVID 19 ITEMS AVAILABLE

  ALL COVID 19 ITEMS AVAILABLE  

STARS