Sunday, December 23, 2018

తిరుప్పావై ఎనిమిదవ రోజు పాశురం

తిరుప్పావై ఎనిమిదవ రోజు పాశురం

తిరుప్పావై ఎనిమిదవ రోజు పాశురం

    కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు ఎరుమై శిఱు వీడు
    మేయ్ వాన్ పరన్దనకాణ్! మిక్కుళ్ళపిళ్ళైగళుమ్
    పోవాన్ పొగిన్ఱారై ప్పోగామల్ కాత్తున్నై
    కూవువాన్ వన్దు నిన్ఱోమ్; కోదుకల ముడైయ
    పావాయ్! ఎళున్దిరాయ్, పాడిప్పఱై కొణ్డు
    మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ
    దేవాది దేవనైచ్చెన్ఱు నామ్ శేవిత్తాల్
    ఆవా వెన్ఱారాయ్ న్దు అరుళేలో రెమ్బావాయ్.

భావం

తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లివారింది. గేదెలు మంచుమేత మేయటానికై విడువబడినాయి. అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీ కృష్ణుడు చేరక ముందుగనే అతని వద్దకు చేరవలెనని, అట్లు చేసిన అతడు చాల సంతోషించునని తలుస్తున్నారు. అందరును కలిసి గోష్ఠిగ పోవుటే మంచిదని యెంచి వారినందరినీ అచట నిలిపి నీ కొరకు వచ్చితిమి. నీకును అతనిని చేరుటకు కుతూహలముగనే వున్నదికదా! మరింక ఆలస్యమెందుకు? లెమ్ము! ఆశ్వాసురరూపుడైన కేశిని, చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీ కృష్ణుని సన్నిధికి పోయి, మన నోమునకు కావలసిన 'పఱై' అనే సాధనమును పొందుదము. అతని రాకకు ముందే మనమటకు పోయిన అతడు 'అయ్యో! మీరు నాకంటే ముందుగనే వచ్చితిరే!' యని నొచ్చుకొని మన అభీష్టములను వెంటనే నెరవేర్చును.
    
అవతారిక

క్రిందటి పాశురంలో భారద్వాజ పక్షులు చేసే కలకల ధ్వనిని విని అందులోని ధ్వనిని గ్రహించమంటున్నది. ఈమె సాయించిన మొత్తం తిరుప్పావై అంతా ధ్వని కావ్యమే. పైకి సాధారణ భాషగా కనబడినా అందులోని అంతరార్ధం బహు విస్తృతమైనది. వేదోపనిషత్సారమైన యీ గ్రంథ ఆంతర్యాన్ని ప్రతివారు యెరిగి తీరవలసినదే అన్నదే ఆండాళ్ తల్లి చెప్పినది. ఈ ఎనిమిదవ పాశురంలో శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహ విశేషాన్ని సంపాదించిన ఒక పరిపూర్ణురాలైన గోపిక తెల్లవారిపోయిననూ ఇంకా లేవలేదని గమనించి ఆమెను లేచిన వారందరితో కలిసి గోదాదేవి మేల్కొలుపుతున్నది. ఇది ఎనిమిదవ పాశురము.      
            (మలయమారుత రాగము - ఆదితాళము)

ప.    తూరుపు తెలవారె! ఓ జవ్వనీ లేవవె!
    తీరుగ మహిషములు మేతకై! తరలె!
    తూరుపు తెలవారె! ఓ జవ్వనీ లేవవె!

అ..ప.    పరమార్ధమని యెంచి శ్రీకృష్ణునే చేరు 
    తరుణుల నిలిపి యిటు నీకై వచ్చితి మమ్మ    
    తూరుపు తెలవారె! ఓ జవ్వనీ లేవవె!

చ..    కేశినోటిని జీల్చి మల్లుర మదమణచిన 
    కేశవుడౌ సర్వేశుని జేరి 
    ఆశల 'పఱ'గొని కృష్ణు స్తుతింయింప-లో 
    కేశుడౌ తాను కాపాడడే మనల 
    తూరుపు తెలవారె! ఓ జవ్వనీ లేవవె!
    తీరుగ మహిషములు మేతకై తరలె!

ROYAL KINGDOM GREEN HILLS

ROYAL KINGDOM GREEN HILLS Premium Frams, Tadkal, Sangareddy  Pin 8977111729

STARS

gtag('config', 'UA-93893754-1');