Monday, December 24, 2018

తిరుప్పావై రేపటి తొమ్మిదవ పాశుర అనుసందానము

తిరుప్పావై రేపటి తొమ్మిదవ పాశుర అనుసందానము


తిరుప్పావై రేపటి తొమ్మిదవ పాశుర అనుసందానము

తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియత్
దూపం కమళత్తుయిల్  అణైమేల్ కణ్ వళరుం
మామాన్ మగళే! మణి క్కదవం తాళ్ తిఱవాయ్
మామీర్! అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్ తాన్
ఊమైయో అన్ఱి చ్చెవిడో అనందలో
ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో
మామాయన్ మాదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు
నామం పలవుం నవిన్ఱేలోర్ ఎంబావాయ్

భావం

పరిశుద్ధములగు నవవిధమణులతో నిర్మింపబడిన మేడలో సుఖశయ్యపై చుట్టును దీపములు వెలుగుచుండగా అగరుధూపము ఘుమఘుమలాడుచుండగా నిద్రపోవుచున్న ఓ అత్త కూతురా ! మణికవాటపు గడియతీయుము. ఓఅత్తా ! నీవైనను ఆమెను లేపుము. నీకుమార్తె మూగదా ? లేక చెవిటిదా ? లేక జాడ్యము కలదా ? లేక ఎవరైనా కదలిన ఒప్పమని కావలియున్నారా ? లేక గాఢనిద్రపట్టునట్లు మంత్రించినారా ? మహామాయావీ ! మాధవా ! వైకుంఠవాసా ! అని అనేక నామములను కీర్తించి ఆమె లేచునట్లు చేయుము. 

అవతారిక

మొదటి రెండు పాశురములలొ శ్రవణము చెప్పబడింది. తర్వాతి పాశురములో మననము నిరూపింపబడినది. ఈ పాశురము నుండి నాలుగు పాశురములలొ ధ్యానదశ వివరింపబడినది. నిస్వార్థమైన వ్రతనిష్ట కలిగినవారికే తాను లభించే హక్కు కలదు అన్నాడు శ్రీకృష్ణుడు. మరి మనకు స్వాతంత్ర్యం ఎందుకు ? పరమాత్మ తానే స్వయంగా మన వద్దకు వచ్చి, మన అభీష్టాలను తీరుస్తాడు. కావున మనం ఎక్కడికి వెళ్ళక ఉన్నచోటునే భగవదనుభవ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే చాలు అనే ధ్యానములో పరాకాష్టపొంది నిద్రిస్తున్న నాల్గవ గోపిక ఈనాడు మేల్కొల్పబడుచున్నది. ఓ మామకూతురా ! మరదలా లేవమ్మా ! అంటున్నారు.

ALL COVID 19 ITEMS AVAILABLE

  ALL COVID 19 ITEMS AVAILABLE  

STARS