Wednesday, December 26, 2018

రేపటి తిరుప్పావై పన్నెండవ పాశుర అనుసందానము

రేపటి తిరుప్పావై పన్నెండవ పాశుర అనుసందానము


రేపటి తిరుప్పావై పన్నెండవ పాశుర అనుసందానము

కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి
నినైత్తు ములై వరియే నిన్ఱు పాల్ శోర
ననైత్త్-ఇల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీర నిన్ వాశల్ కడై పత్తి
శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్
ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్
అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్

భావం

లేగదూడలుగల గేదెలు పాలుపితుకువారు లేక లేగదూడలను తలచుకొని వానిపై మనసు పోవుటచే ఆ దూడలే వచ్చి పొదుగులో మూతిపెట్టునట్లుతోచి పాలు .... పొడుగు నుండి కారిపోవుటచే ఇల్లంతయు బురదయగుచున్న ఒకానొక మహైశ్వర్య సంపన్నుని చెల్లెలా ! మంచు తలపై పడుచుండ నీ వాకిట నిలిచియుంటిమి. మీ ఇంటి ద్వారపు పైకమ్మిని పట్టుకొని నిలిచి ఉంటిమి. కోపముతో దక్షిణ దిక్కున ఉన్న లంకకు అధిపతియైన రావణుని చంపిన శ్రీరాముని గానము చేయుచుంటిమి. అది వినియైనను నీవు నోరు విప్పవా ! ఇంక మమ్మేలుకొనవా ! ఏమి ఈ గాఢనిద్ర !ఊరివారికి అందరికి నీ విషయము తెలిసిపోయినది. లెమ్ము ---- అని కృష్ణుని విడువక సర్వకాలములనుండుటచే స్వధర్మమును కూడా చేయలేని దశయందున్న ఐశ్వర్యసంపన్నుడగు ఒక గోపాలుని చెల్లిలిని మేల్కొలిపినారు

అవతారిక

భగవత్సేవాలక్ష్మి సంపన్నతగల ఒక గోపాలుని చెల్లెలిని ఈనాడు మేల్కొల్పుతున్నారు. ఇతనికి సమృద్ధిగా గేదెలమంద కలదు. కాని పాలుపితకడు, పాలుకారి నెల అంతా బురదమయము అగుచుండును. అట్టివాని చెల్లెలు ఈమె. ఇంద్రియ విషయములందు ఇంద్రియములు ప్రవర్తింపకుండ భగవానునియందే సర్వవృత్తులను నియమించి ఉండును. ఇది కూడా ఒక విధమైన నిద్రవంటిది. ఇంతవరకు నాలుగు పాశురములలొ నలుగురు గోపికలను నిద్రించుట తగదని చెప్పి మేల్కొలుపుటలో ఈ స్థితప్రజ్ఞావస్థలోని దశాలనే వివరించారు.

ALL COVID 19 ITEMS AVAILABLE

  ALL COVID 19 ITEMS AVAILABLE  

STARS