Thursday, December 27, 2018

తిరుప్పావై పదకొండవ పాశుర అనుసందానము

తిరుప్పావై పదకొండవ పాశుర అనుసందానము

కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు
శెత్తార్ తిఱల్ అరియ   చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం
కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం  పొఱ్కొడియే
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు  నిన్-
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎంబావాయ్

భావం

లేగదూడలు కలవియు, దూడలవలె ఉన్నవియు అగు ఆవుల మందలను ఎన్నింటినో పాలుపితుక కలవారును, శత్రువులను ఎదిరించి బలముతో యుద్ధము చేయగలవారును, ఏవిధమగు దోషము లేనివారును అగు గోపాలకులు వంశమున మొలచిన ఓ బంగారుతీగా !పుట్టలోని పాముపడగ వలె ఉన్న వితంబ ప్రదేశము కలదానా ! అడవిలోని నెమలివలె అందమైన కేశపాశంతో ఒప్పుచున్నదానా ! రమ్ము, చుట్టములను, చెలికత్తెలును మొదలుగ అందరును వచ్చి నీముంగిట చేరిరి. నీలిమేఘవర్ణుడగు శ్రీకృష్ణుని నామమును కీర్తించుచుండిరి. ఐనా గాని నీవు ఉలుకక - పలుకక ఉన్నవేమి ? ఓ సంపన్నురాలా ! నీనిద్రకు అర్థమేమో తెలుపుము.

అవతారిక

ఈ పాశురమున లేపబడు గోపిక కులముచేతను, రూపముచేతను, గుణముచేతను అందమైనది. కృష్ణుడు ఊరు అంతటికి ఆదరణీయుడైనట్లు, ఈమె కూడా ఊరులోని అందరి మన్నలను అందిన ఆమె. పతిసంయోగ యోగ్యమగు ఆమె. ఆ కృష్ణుని పొందుటకు నేను వ్రతము చేయుట ఏమిటి ? అతడే నన్ను పొందుటకు వ్రతము ఆచరించవలెను అని నిర్భయంగా ఉన్నది ఆమె. సౌందర్యము శరీర నిష్టము, అందుచే ఆమె శరీరమునే చూచి మేల్కొలుపుచున్న గోపికలు మురియుచున్నారు. ఇట్లనుటచే భగవత్భక్తులను ఆశ్రయించునపుడు వారి ఆత్మగుణ పూర్తిచే కల్గు అంతర సౌందర్యమేకాక బాహ్యసౌందర్యం కూడ అనుభవింపబడవలెను. ఆచార్యుల దివ్యమంగళ విగ్రహమును చూచుటచే కూడ ప్రీతి కలుగవలెను. ఆ మూర్తిని వదలలేని మమకారము ఏర్పడును. అట్టి ప్రీతి ఈ గోపికలకు కలిగినది అనుటచే లోపల నిద్రిస్తున్న గోపిక భగవదనుభవమున పరిపూర్ణురాలై తన దివ్యమంగళ విగ్రహదర్శనము చేతనే వీరిని ఆనందింపచేయుజాలినదై ఉన్నదని తెలియుచున్నది.

ALL COVID 19 ITEMS AVAILABLE

  ALL COVID 19 ITEMS AVAILABLE  

STARS